Home /News /trending /

VIRAL VIDEO LITTLE GIRL PLAYS WITH HUGE PYTHON PAH

వామ్మో.. భారీ కొండ చిలువల మధ్య బాలిక.. ఏకంగా బెడ్ మీదే ఆ పని.. చూస్తే షాక్ అవ్వాల్సిందే..

కొండ చిలువతో బాలిక

కొండ చిలువతో బాలిక

Viral Video: పాములు, కొండ చిలువలను చూస్తే చాలా మందికి చచ్చేంత భయం. వాటి పేరేత్తిన కూడా భయంతో పారిపోతుంటారు. కానీ ఒక బాలిక మాత్రం.. భయంకరమైన విషసర్పాలు, కొండ చిలువలతో సరదాగా ఆడుకుంటుంది. అంతటితో ఆగకుండా..

Viral Video:  పాములు, కొండ చిలువలను (Pythons)చూస్తే చాలా మందికి చచ్చేంత భయం. వాటి పేరేత్తిన కూడా మనలో చాలా మంది భయంతో పారిపోతుంటారు. కానీ ఒక బాలిక మాత్రం.. భయంకరమైన విషసర్పాలు (Snakes), కొండ చిలువలతో సరదాగా ఆడుకుంటుంది. అంతటితో ఆగకుండా..

మనలో చాలా మంది కొన్నిరకాల జంతువులను ఇష్టపడుతుంటారు. కుక్క, పిల్లి, మొదలైన సాధు జంతువులను ఇష్టపడతారు.  సరదాగా తమ ఇంట్లో సరదాగా పెంచుకుంటారు. మరికొందరు వెరైటీగా.. పులుల వంటి క్రూరమైన జంతువులను కూడా పెంచుకుంటారు. ఇంకొందరు పాములు, కొండ చిలువలను కూడా పెంచుకుంటారు. ఇలాంటి ఎన్నో వీడియోలను మనం తరచుగా సోషల్ మీడియా (Social Media) లో చూస్తునే ఉంటాం.










View this post on Instagram






A post shared by Ariana (@snakemasterexotics)












View this post on Instagram






A post shared by Ariana (@snakemasterexotics)







ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండ్ (Trending News) కొనసాగుతుంది. ఎక్కడ ఏం జరిగిన నిముషాలలో వైరల్ గా మారిపోతున్నాయి. వీటిలో కొన్నిచూడటానికి భయంకరంగా ఉంటే.. మరికొన్ని ఫన్నీగాను ఉంటున్నాయి. వీటిలో జంతువులు కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. నెటిజన్లు కూడా ఇలాంటి వెరైటీ వీడియోలను (Viral Videos) చూడటానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు.

సాధారణంగా మనలో చాలా మందికి పాములు, కొండ చిలువలంటే చచ్చేంత భయం. వాటి పేరు తలుచుకున్న కూడా వెన్నులో వణుకుపుడుతుంది. కానీ కొందరు వీరికి భిన్నంగా వాటితోనే ఆడుకుంటారు. సరదాగా గడుపుతుంటారు. తాజాగా,  ఈ కోవకు చెందిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media) లో చక్కర్లు కొడుతుంది.



పూర్తి వివరాలు.. అరియానా అనే 6 ఏళ్ల బాలికకు పాములు, కొండ చిలువలు అంటే ఇష్టం. ఆమె ఏమాత్రం భయం లేకుండా వాటితోనే సహవాసం చేస్తుంది. ఆమె ఇంటిలో భయంకరమైన విషసర్పాలు, భారీ కొండ చిలువలు ఉన్నాయి. వాటిలో ఆమె బెడ్ రూములో ఏమాత్రం భయం లేకుండా ఆడుకుంటుంది. అరియానా పాములను చేతిలో పట్టుకుని.. వాటితో  ఆడుకుంటుంది. తన ఒడిలో వేసుకుని సరదాగా గడుపు తుంది. ఆమె భిన్న  రకారకాల పాములు, కొండ చిలువలతో ఆడుకోవడం కనిపిస్తుంది.

ఇది ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. ఈ వీడియోను ( snake masterexotics) మాస్టర్ క్సాటిక్స్ అనే ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. దీంతో ఇది వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. షాకింగ్(Shocking Video) కు గురౌతున్నారు. వామ్మో.. ఇదేంటి భయంకరమైన విషసర్పాలతో ఆడుకుంటుందని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మాకన్నా.. పాపే నయం.. ఆమె ధైర్యవంతురాలు.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Python, Snakes, VIRAL NEWS, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు