Home /News /trending /

VIRAL VIDEO LITTLE GIRL FALLS OUT OF CAR WINDOW AT BUSY JUNCTION IN CHINA RESCUED BY OTHER DRIVERS PAH

Shocking: బిజీ జంక్షన్ వద్ద కారు కిటికీ నుంచి పడిన చిన్నారి.. వీడియో వైరల్..

కారు నుంచి కింద పడిన చిన్నారి

కారు నుంచి కింద పడిన చిన్నారి

China: రద్దీగా ఉన్న జంక్షన్ వద్ద సిగ్నల్ పడింది. అప్పుడు ఒక చిన్నారి కారు కిటికీ నుంచి బైట తలపెట్టి.. చుట్టుపక్కల చూస్తుంది. ఇంతలో గ్రీన్ సిగ్నల్ పడింది.

చాలా మంది తరచుగా ఓపెన్ టాప్ కారులో వెళ్తుంటారు. కొన్నిసార్లు.. పిల్లలు కారుతో విండో సీటులో కూర్చోవడానికి ఇంట్రెస్ట్ చూయిస్తుంటారు. పెద్ద వాళ్లు ఫ్రంట్ సీటులో కూర్చుని.. పిల్లలను వెనుక సీటులో కూర్చోబెడుతుంటారు. సీటు బెల్టులు పెట్టటం కూడా మర్చిపోతుంటారు. అయితే.. ఒక్కొసారి పిల్లలు.. విండో నుంచి తలలు బయటపెట్టి చుట్టుపక్కల చూస్తుంటారు. కొన్నిసందర్భాలలో అలాంటప్పుడు అనుకొని సంఘటనలు జరుగుతుంటాయి. కొందరి చేతులకు గాయాలు కావడం, మరికొందరు ప్రమాదాల బారిన పడటం జరుగుతుంటాయి. ఈ కోవకు చెందిన ఘటన వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు.. చైనాలో (China) షాకింగ్ ఘటన జరిగింది. నింగ్బోలోని బిజీ జంక్షన్ లో జరిగిన సంఘటన అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. రద్దీగా ఉన్న చౌరస్తా వద్ద సిగ్నల్ పడింది. చాలా కార్లు అక్కడే ఆగిపోయాయి. అప్పుడు ఒక చిన్నారి.. కారు లో నుంచి తలబైటకు పెట్టుకుని చుట్టుపక్కల చూస్తుంది. ఇంతలో సిగ్నల్ పడటంతో కారు స్టార్ట్ అయ్యింది. ఈ క్రమంలో... చిన్నారి బ్యాలెన్స్ తప్పి..రోడ్డు మీద పడింది. దీన్ని గమనించకుండా చిన్నారి ఎక్కిన కారు అలాగే ముందుకు వెళ్లిపోయింది.





వెనుకవైపు నుంచి వస్తున్న కారులో ఉన్న వారు.. రోడ్డుపైన చిన్నారి పడి ఉండటాన్ని గమనించారు. వెంటనే పరుగున వెళ్లారు. ఆమెను పక్కకు తీసుకెళ్లారు. కాసేపటికి తన వాళ్లకు చిన్నారిని అప్పగించారు. చిన్నారికి ఏం కాకపోవడంతో అక్కడున్న వారంతా ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట (Social media) తెగ వైరల్ గా (Viral video)  మారింది.

ఇదిలా ఉండగా ఒక గేదె రోడ్డుపై వీరంగం చేసింది.

గేదె (Buffalo attacks) తన మానాన తాను వెళ్తుంది. ఇంతలో.. రోడ్డుపైన వెహికిల్ పై వెళ్తున్న వ్యక్తి వెనుక నుంచి హరన్ మోగించారు. దీంతో అది భయపడిపోయింది. కోపంతో అతి సదరు వ్యక్తిని కుమ్మడం ప్రారంభించింది. గేదె దాడి నుంచి తప్పించుకొవడానికి అతను రోడ్డుమీద పరుగులు పెట్టాడు. ఇంతలో అతనికి రోడ్డు పక్కన ఒక కారు పార్కు చేసి ఉండటాన్ని గమనించాడు.

వెంటనే దానికిందకు వెళ్లి దాక్కున్నాడు. గేదె మాత్రం.. కారు కిందకు వెళ్లిన అతడిని వదల్లేదు. అతని కోసం అక్కడే వేచిచూసింది. ఎంత సేపటికి రాకపోవడంతో మెల్లగా గేదె అక్కడి నుంచి వెళ్లిపోయింది. అతను కూడా.. గేదె వెళ్లిపోయింది కన్ఫామ్ చేసుకుని.. మెల్లగా బయటకు వచ్చి.. వెళ్లిపోయాడు. ఈ ఘటన అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ప్రస్తుతం ఈ క్లిప్పింగ్స్ లు వైరల్ గా (Viral news) మారాయి.
Published by:Paresh Inamdar
First published:

Tags: CAR, China, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు