Viral Video: ఆ అమ్మాయి టాలెంట్ కు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.. మీరూ చూసేయండి వీడియో..

సునాయసంగా గోడ ఎక్కిన చిన్నారి

Viral Video: ప్రస్తుతం సోషల్ మీడియా(Social Media) విస్తృతి విపరీతంగా పెరిగిపోయింది. ప్రపంచంలో ఏమూల ఏం జరిగినా కొన్ని క్షణాల్లోనే తెలిసిపోతుంది. అంతలా విస్తరించింది. అయితే కొంతమంది ఆ సోషల్ మీడియాల్లో సరదాగా కొన్ని వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. అవి నెటిజన్లను ఆకట్టుకుంటే మాత్రం విపరీతంగా వైరల్ అయిపోతాయి. ఇక్కడ కూడా ఒక వీడియో వైరల్ గా మారింది. అదేంటంటే..

 • Share this:
  ప్రస్తుతం సోషల్ మీడియా(Social Media) విస్తృతి విపరీతంగా పెరిగిపోయింది. ప్రపంచంలో ఏమూల ఏం జరిగినా కొన్ని క్షణాల్లోనే తెలిసిపోతుంది. అంతలా విస్తరించింది. అయితే కొంతమంది ఆ సోషల్ మీడియాల్లో సరదాగా కొన్ని వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. అవి నెటిజన్లను ఆకట్టుకుంటే మాత్రం విపరీతంగా వైరల్ అయిపోతాయి. దాంతో ఆ వీడియోలు తీసే వారు ఫేమస్ అయిపోతుంటారు. మరొ కొన్ని వీడియోలు మాత్రం చూడటానికి కూడా భయపడతాం. అంత క్రూరంగా ఉంటాయి. మరి కొన్ని వీడియోలు చూస్తూంటే.. ఇలా చేయడం సాధ్యమేనా.. నీజంగా వాళ్లు మనుషులేనా అనే అనుమానం వస్తుంది. అలాంటి వీడియోనే సోషల్ మీడియాలో వైరల్‌గా (social media) మారింది.

  Ganesh Festival: మొక్కిన వారికి తీర్ధాన్ని ఇస్తూ.. చెవులు ఊపుతూ.. కంటి రెప్పలు కొడుతున్న వినాయకుడు.. ఎక్కడంటే..


  స్పైడర్(Spider) లాగా ఒక చిన్న అమ్మాయి గోడ ఎక్కుతున్న వీడియో వైరల్‌గా మారింది. సోషల్ మీడియా యూజర్లకు ఈ వీడియో తెగ నచ్చేసింది. అంతే కాకుండా ఆ వీడియోలో ఆ అమ్మాయి ప్రతిభ చూసి ఆశ్చర్యానికి కూడా గురయ్యారు. 5 సంవత్సరాల వయస్సు ఉన్న ఆ అమ్మాయి, ఎలాంటి సపోర్ట్ లేకుండా నిమిషాల్లో గోడ ఎక్కింది. ఆ అమ్మాయి తన చేతులు మరియు కాళ్ళను సపోర్టు తీసుకొని తన ఇంటి వద్ద ఎత్తైన గోడను సునాయసంగా ఎక్కేసింది.


  Telangana News: వామ్మో.. ఏందిది.. హుజురాబాద్ ఎన్నికల ప్రచారానికి దేవుడిని కూడా వదలట్లేదుగా.. వీడియో వైరల్..


  ఆమె ఎలా ఎక్కిందంటే.. మొదట తన ఇంటి రూంలోని ఓ మూల దగ్గర నిలబడి రెండు గోడలను గట్టిగా సపోర్ట్ చేసుకుంటూ.. ఆమె చేతులు మరియు పాదాలను ఉంచింది. ఆమె రెండు గోడల మధ్య బేస్ చేసి, తన శరీరాన్ని పైకి లాగుతూ ఆ గది టాప్ వరకు వెళ్లింది. అంతే కాకుండా.. ఆ బాలిక గోడ పైభాగానికి చేరుకున్నప్పుడు తన రెండు కాళ్లను గాలిలో ఉంచి గాల్లో తేలినట్టుందే అన్నట్లు ఊపింది. ఇలా చేస్తున్న సమయంలో ఎక్కడ కిందపడిపోతుందో అన్న భయం వేస్తుంది.

  Corona Diagnose Mask: ఈ మాస్క్ 90 నిమిషాల్లో కోవిడ్ ను కనిపెడుతుందట.. వివరాలిలా..


  అయినా అక్కడ వీడియో తీసే కుటుంబసభ్యులు ఏమాత్రం భయపడలేదు. ఆ అమ్మాయి చేసే సాహసాన్ని వారు తమ కెమెరాలో బంధించారు. తర్వాత, 'స్పైడర్‌గర్ల్' అనే క్యాప్షన్‌తో Ffs OMG Vids అనే ఖాతా ద్వారా వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియో పెట్టిన కొన్ని గంటల్లోనే తెగ వైరల్ గా మారింది.


  Blood Donation: రక్తదానం చేస్తే ‘బరువు’ తగ్గుతారా.. నిపుణులు ఏమంటున్నారంటే..


  125 కే వ్యూస్ మరియు 600 కంటే ఎక్కువ షేర్‌లను ఈ వీడియో సాధించింది. ఆ చిన్నారి నైపుణ్యం ఎంతగానో నెటిజన్లను ఆకట్టకుంది. మరి కొంతమంది .. ఇటువంటి సాహసాలు చేసిన వారు అంతకముందే ఉన్నారంటూ కామెంట్లు చేశారు. గతంలో, కాన్పూర్ కు చెందిన బాలుడు యశార్థ్ సింగ్ గౌర్ కు సంబంధించిన ఇదే వీడియో వైరల్ అయ్యింది. అతడు గోడలను అత్యంత తేలికగా ఎక్కేశాడు. ఇతడికి స్పైడర్ మ్యాన్ సినిమా చూసిన తర్వాత ఇలా ట్రై చేయలని అనిపించి.. ప్రయత్నించగా వచ్చిందని చెప్పాడు.
  Published by:Veera Babu
  First published: