Viral Video: మనం రోజూ రకరకాల వైరల్ వీడియోలు చూసి ఎనర్జీ తెచ్చుకుంటున్నాం కదా... ఇప్పుడు ఆ లిస్టులో మరొకటి చేరింది. అడవికి రారాజు సింహం. సింహం ఏదైనా జంతువును వేటాడాలి అనుకుంటే... పెద్దగా పరుగెత్తకుండానే పని అయిపోవాలి అని స్కెచ్ వేసుకుంటుంది. ఎందుకంటే దానికి అతిగా పరుగులు పెట్టడం ఇష్టం ఉండదు. కానీ స్కెచ్ వేస్తే మాత్రం ఎంత దూరమైనా పరుగెత్తి టార్గెట్‌ని పట్టుకుంటుంది. ఈ వీడియోలో రివర్స్ జరిగింది. రోడ్డుకు అటూ, ఇటూ అడవి ఉన్న చోట... ఓ జింక రోడ్డును వేగంగా దాటాలనే ఉద్దేశంతో... దూసుకొచ్చింది. ఐతే... అదే రోడ్డుపై సింహాలు వెళ్తున్న విషయాన్ని జింక చూసుకోలేదు. సరిగ్గా అది రోడ్డుపైకి వచ్చేసరికి... అటుగా వెళ్తున్న సింహాలు... జింకను చూసి... రెడీ అయ్యాయి. క్రికెట్లో బంతిని క్యాచ్ చెయ్యడానికి ఫీల్డర్ రెడీ అయినట్లుగా... జింక కోసం సింహాలు సరైన పొజిషన్లోకి వచ్చేశాయి. అంతే... జింక సడెన్ బ్రేక్ వేసుకున్నా... ఆ జోరుకు ఆగలేకపోయింది. వెళ్లి సింహాల ఒళ్లో పడింది. సింహోర అయిపోయింది.
అసలు వేట అన్నదే లేకుండా జింకే వచ్చి సింహాలకు చిక్కడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోను మీరు జాగ్రత్తగా గమనిస్తే... ఇందులో మరో కొత్త పాయింట్ ఉంది. సపోజ్ మనం రోడ్డుపై వెళ్తున్నప్పుడు సడెన్‌గా ఓ కారు దూసుకొస్తే... మనం కంగారు పడతాం. అదే విధంగా... ఇక్కడ సింహాలు కూడా మొదట అదిరిపడ్డాయి. కానీ క్షణాల్లో అవి అలర్ట్ అయ్యాయి. భయపడినట్లే భయపడి... వెంటనే జింకను పట్టుకోవడానికి రెడీ అయ్యాయి. అలా సింహాలను భయపెట్టిన జింక... వాటికి ఆహారమైపోయింది.
ఇది కూడా చదవండి: Horoscope Today: ఫిబ్రవరి 23 రాశి ఫలాలు... ఆర్థిక వ్యవహారాలతో జాగ్రత్త
ట్విట్టర్లో లైఫ్ అండ్ నేచర్ వారు ఈ వీడియోను పోస్ట్ చేశారు. నేచర్ లవర్స్, యానిమల్ లవర్స్ ఈ వీడియోను చూసి కాస్త రిలాక్స్ పొందుతున్నారు. ఐతే... ఈ సంఘటన ఎక్కడ జరిగిందో మాత్రం వివరాలు లేవు. ఇది ఏ సఫారీలోనో జరిగి ఉంటుందని అంటున్నారు.
Published by:Krishna Kumar N
First published:February 23, 2021, 06:53 IST