Home /News /trending /

VIRAL VIDEO LIONESS CLIMBS ON ELEPHANT TRIES TO BITE EAR OFF PAH

Viral video: మనతో పెట్టుకుంటే దబిడి దబిడే.. సివంగికి చుక్కలు చూపించిన ఏనుగు.. వైరల్ వీడియో..

ఏనుగుపై దాడి చేస్తున్న సివంగి

ఏనుగుపై దాడి చేస్తున్న సివంగి

Shocking: ఏనుగులను అడవులలో  బలమైన జంతువులలో ఒకటిగా భావిస్తారు. ఇతర జీవులు వీటి దరిదాపుల్లోకి వెళ్లటానికి సాహసం చేయవు. సింహం, పులుల వంటి క్రూర జంతువులు కూడా ఏనుగులను చాలా అరుదుగా వేటాడతాయి.

Lioness Climbs on Elephant Tries to hunt: ఏనుగులు గుంపులుగా సంచరిస్తాయి. ఇవి అడవిలో చెట్ల కొమ్మలు, ఆకులను తింటుంటాయి. వీటికి గుంపులో ఐదునుంచి ఎనిమిది ఏనుగులు ఉంటాయి. ఇవి ఎక్కడికి వెళ్లిన సముహంగానే సంచరిస్తాయి. ఇక అడవికి రాజైన సింహాం కూడా ఏనుగుల జోలికి వెళ్లడానికి సాహాసం చేయవు. ఒక ఏనుగును వేటాడలంటే.. దాదాపు.. ఎనిమిది సింహాలు రంగంలోకి దిగాలి. అప్పటికి కూడా ఏనుగు లొంగుతుందంటే నమ్మకం లేదు.  ఒక్కొసారి చిన్న ఏనుగులను, సింహాల గుంపు టార్గెట్ చేస్తుంటాయి. అది కూడా.. పొరపాటున మంద నుంచి వేరుపడినప్పుడు మాత్రమే సింహాలు దాడికి పాల్పడతాయి.

అడవిలో సింహలే.. ఏనుగుకు సహాజ శత్రువు. కానీ ఏనుగులు.. చాలా వరకు అప్రమత్తంగా ఉంటాయి. ఏనుగులు తమ పొడవైన దంతాలు, పెద్దవైన చాటల్లాంటి చెవులు చూడటానికి భయంకరంగా ఉంటాయి. తమ తుండంతో ఎంత బలమైన చెట్లనైన కూకటి వేళ్లతో సహా తెంచి వేస్తాయి. ఒక్కొసారి సింహాలు, పులులు ఏనుగులపై దాడికి పాల్పడితే.. అవి తమ తుండంతో గాల్లో గిరగిరా తిప్పి పడేస్తాయి. ఇక వాటి సఫారీలలోకి అడుగు పెడితే మనుషులపైకి దాడులు చేస్తాయి.





ఇక కొన్ని సార్లు ఏనుగులు చెరువులలో నీళ్లు తాగడానికి వెళ్లినప్పుడు మాత్రమే మొసళ్ల బారిన పడతాయి. నీళ్లలో మొసలికి స్థాన బలం అధికం. అక్కడ వాటిని పది ఏనుగుల బలం ఉంటుందంటారు. అయినా.. చాలా అరుదుగా ఏనుగులపై ఇతర జీవులు దాడులు చేస్తాయి. ప్రస్తుతం ఒక ఏనుగుపై సివంగి దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు.. పాపం.. ఏనుగు మంద నుంచి విడిపోయిందో ఏమో.. కానీ ఒక్కటే చెట్ల మధ్యగా ఉంది. అప్పుడు దాన్ని ఒక సివంగి గమనిచింది. ఇదే ఛాన్స్ అనుకుందో ఏమో కానీ.. వెంటనే ఏనుగుపై దాడి చేసింది. దానిపైకి ఎక్కి బలమైన తన పళ్లతో దాడి చేసింది. ఇక ఏనుగు కూడా సింహాన్ని గట్టిగానే ప్రతి ఘటించింది. సింహం ఏనుగు వీపుపైకి ఎక్కి.. దానిపై దాడి చేయడానికి ప్రయత్నించింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఏనుగు.. ఘీంకరిస్తూ.. సివంగిని తన తుండంతో గాల్లో పైకెత్తి తిప్పి దూరంగా విసిరేసింది. ప్రస్తుతం వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Elephant, Viral Videos

తదుపరి వార్తలు