Home /News /trending /

VIRAL VIDEO LION SEES ANOTHER LION TRYING TO FLIRT WITH HIS LIONESS TAKES HIM DOWN PAH

Shocking: బాప్ రే.. ఆడ తోడు కోసం సింహాల పెనుగులాట.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఇదే..

దాడులు చేసుకుంటున్న సింహాలు

దాడులు చేసుకుంటున్న సింహాలు

Viral video: ఒక సింహాం, సివంగీ అడవిలో జతకట్టాయి. ఇంతలో మరో సింహాం దూరం నుంచి వాటిని చూసింది. వెంటనే గాండ్రిస్తు పరిగెత్తుకుంటూ వచ్చింది.

సింహాలు చూడటానికి అత్యంత భయంకరంగా ఉంటాయి. అడవిలో ఉండే అతి క్రూరమైన, అత్యంత పెద్ద జంతువులుగా చెప్పుకుంటారు. సింహాలను చూసేందుకు కూడా ఎంతో భయంకరంగా ఉంటాయి. వాటి పెద్దవైన జూలూ, భారీ శరీరం, అవి గాండ్రీస్తే.. కొన్ని కిలోమీటర్ల వరకు వాటి అరుపులు విన్పిస్తుంటాయి. సాధారణంగా అడవిలో ఆడ సింహలు ఎక్కువగా వేటాడుతూ ఉంటాయి. మగ సింహాలు, తమ స్థలాన్ని కాపాడుతు ఉంటాయి. వేరే సింహాలు వాటి ప్రదేశంలో రాకుండా చూసుకుంటాయి. ఒక్కొసారి ఇతర సింహాలు, ఇతర ప్రదేశాలకు వెళ్తుంటాయి. అప్పుడు అక్కడే ఉన్న సింహాలు వాటిపై దాడిచేస్తుంటాయి. కొన్ని సార్లు, సింహాలు మధ్య పొరు భయంకరంగాను ఉంటుంది. ఈ కోవకు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.



పూర్తి వివరాలు, రెండు సింహాల జంట అడవిలో జతకట్టాయి. అవి అడవి గుండా వెళ్తున్నాయి. ఈ క్రమంలో వీటిని దూరం నుంచి మరో మగ సింహాం చూసింది. గట్టిగా గాండ్రీస్తు వచ్చింది. ఇక్కడున్న సింహాం కూడా, మరో దాన్ని చూసింది. రెండు కూడా గాండ్రీస్తు ఒక దానిపై మరోకటి దాడులు చేసుకున్నాయి. వాటి మధ్య పోరు భీకరంగా సాగుతుంది. నువ్వా నేనా అన్న రీతిలో పొరు సాగుతుంది. సివంగీ కోసం సింహాలు తలబడుతున్నట్లు తెలుస్తోంది. గెలిచిన దానితో సివంగీ జతకడుతుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఇదిలా ఉండగా  ఒక కోడి వింతగా ప్రవర్తిస్తుంది. అది ప్రతి రోజు మద్యం తాగుతుంది.

మహారాష్ట్రలోని (Maharashtra) భందారా జిల్లాలో ఒక కోడి పుంజు వింతగా ప్రవర్తిస్తుంది. సాధారణంగా కోళ్లకు దాణాలు, పిస్తాలు, ధాన్యం గింజలు పెట్టటం మనకు తెలిసిందే. కానీ ఈ కోడికి మాత్రం ఏదైన తినలంటే దానికంటే ముందుగా మద్యం దాని నోట్లో పడాల్సిందే. లిక్కర్ అందిస్తేనే.. అది ధాన్యం గింజలను తింటుంది. భందారా గ్రామానికి సమీపలో పునరావాస గ్రామం ఉంది. అక్కడ భావు కాతోరే అనే వ్యక్తి కోళ్లను (Rooster) పెంచుకుంటున్నాడు. అనేక జాతుల కోళ్లు అతని దగ్గర ఉన్నాయి. ఒక కోడికి కొన్ని రోజుల క్రితం అనారోగ్యానికి గురైంది. అదంటే భావు కాతోరేకు చాలా ఇష్టం. దాని ఆరోగ్యం బాగుపడటం కోసం ఎంతో ఖర్చు చేశాడు. కొంత మంది కోడికి మద్యం తాగిస్తే.. దానికి రోగం కుదుటపడుతుందని చెప్పారు. అప్పటి నుంచి దానికి మద్యం తాగిస్తున్నారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Lions, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు