Home /News /trending /

VIRAL VIDEO LION BITES OFF MAN S FINGER AFTER HE STICKS HIS HAND INTO CAGE VIDEO LEAVES INTERNET HORRIFIED PAH

OMG: పిచ్చి వేశాలు వేస్తే ఇలానే ఉంటది.. జూకీపర్ కు సుస్సు పోయించిన సింహాం..

జూకీపర్ పై దాడిచేస్తున్న సింహాం

జూకీపర్ పై దాడిచేస్తున్న సింహాం

America: బోనులో ఉన్న సింహాం దగ్గరకు జూకీపర్ వెళ్లాడు. దాన్ని బోనులో నుంచి చేయిపెట్టి గెలికాడు. అత గాడిని చూసి సింహాం దూరంగా వెళ్లాలన్నట్లు గాండ్రించింది. అయినా దానికి చిరాకు తెప్పించాడు.

క్రూరమైన జంతువుల దగ్గరకు వెళ్లినప్పుడు మనం హద్దుల్లో ఉండాలి. అవి ఏప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో.. ఎవరికి అర్థం కాదు. సాధారణంగా జూలల్లో, కొన్ని సర్కస్ లలో జంతువులను దగ్గర నుంచి చూడటానికి అవకాశం ఉంటుంది. అయితే, కొందరు అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. జంతువులను రాళ్లతో కొట్టడం, కర్రలతో కొట్టడం వంటివి చేస్తుంటారు. వాటికి చిరాకు తెప్పించడం చేస్తుంటారు. దీంతో అవి తిరగబడుతుంటాయి. ఈ క్రమంలో అవి మనుషులపైన దాడులకు దిగుతాయి.

ఇప్పటికే సర్కస్ లలో, జూలలో జంతువులు దాడిచేసిన సంఘటనలు అనేకం వార్తలలో నిలిచాయి. ఈ మధ్యనే ఒక గొరిల్లాను గెలికిన ఒక వ్యక్తిని అది బోనులో లాక్కుని గాయపర్చిన భయానక వీడియో వైరల్ (Viral video) అయ్యింది. తాజాగా, మరో జూకీపర్ ఏకంగా సింహాంతోనే పెట్టుకున్నాడు. అది ఊరుకుంటుందా.. మనోడికి చుక్కలు చూపించింది. ప్రస్తుతం ఈ ఘటన నెట్టింట (Social media)  వైరల్ గా మారింది.



పూర్తి వివరాలు.. అమెరికాలో (America) అత్యంత భయానక ఘటన జరిగింది. ఎలిజబెత్ లోని జమైకా జూలో శుక్రవారం ఒక షాకింగ్ ఘటన జరిగింది. అక్కడ బోనులో ఒక సింహం ఉంది. అక్కడ దానికి కాపాలాగా జూకీలపర్ ఉన్నాడు. ఇంతలో మనోడికి ఏమనిపిచ్చిందో కానీ సింహాం బోను దగ్గరకు వెళ్లాడు. ఇనుప చువ్వల నుంచి సింహాన్ని వెంట్రుకలను లాగాడు. దాన్ని పొడుస్తున్నట్లు వేళ్లు పెట్టి చిరాకు తెప్పించాడు. సింహాం గట్టిగా గాండ్రిస్తు.. అతగాడిపై దాడికి ప్రయత్నించింది.అతను బోనులో వెళ్లను పెట్టాడు. వెంటనే సింహాం అతని చేయివేళ్లను (Lion Bites Off Mans Finger) తన నోటితో పట్టేసుకుంది. అతను ఏంతలా గింజుకున్న వదల్లేదు. అతను గిలాగిలా కొట్టుకున్నాడు. ఈ సంఘనతో అక్కడి వాళ్లు తీవ్ర భయాందోళలనలకు గురయ్యారు. కొందరు ఈ ఘటనను తమ సెల్ ఫోన్ లలో బంధించారు. ప్రస్తుతం ఈ షాకింగ్ ఘటన నెట్టింట వైరల్ గా మారింది.

ఇదిలా ఉండగా పెళ్లిలో  కొత్త జంట కొట్టుకున్నారు.

పెళ్లి వేడుక జరుగుతుంది. కొత్త జంట అందంగా ముస్తాబయ్యారు. కాస్లీ కాస్టూమ్స్ వేసుకున్నారు. ఇద్దరు కూడా వరమాల కార్యక్రమం అయ్యింది. ఆ తర్వాత.. ఒకరి నోటిలో మరోకరు స్వీటు తినిపించే కార్యక్రమం జరుగుతుంది. అయితే, ఇక్కడో ఊహించని సంఘటన జరిగింది. ఏంజరిగిందో కానీ, పెళ్లి కూతురు తినిపిస్తున్న మిఠాయిని తినడానికి పెళ్లి కొడుకు ఆసక్తి చూపించలేదు.

ఏదో ఇష్టం బలవంతంగా ఆమె తినిపించింది తింటాడు. పెళ్లి కొడుకు కూడా.. కోపంతో ఆమె నోటిలో స్వీటును కుక్కుతాడు. దీంతో ఆమెకు చిర్రెత్తుకొస్తుంది. వెంటనే ఆమె పెళ్ళి కొడుకుని వేదిక మీదనే చితక్కొడుతుంది. అక్కడికి వచ్చిన అతిథులంతా షాకింగ్ కు గురవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట (Social media)  తెగ వైరల్ (Viral video)  గా మారింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Lions, Trending video, Viral Video

తదుపరి వార్తలు