VIRAL VIDEO LEOPARD STRAYS INSIDE MERCEDES BENZ FACTORY IN PUNE PAH
Shocking: కార్ల తయారీ కంపెనీలో చిరుతపులి.. 6 గంటల పాటు ఒకటే టెన్షన్.. వైరల్ అవుతున్న వీడియో..
ఫ్యాక్టరీలో ఉన్న చిరుతపులి
Viral Video: పూణేలోని ఒక కార్ల కంపెనీలో చిరుతపులి కలకలం రేపింది. ఫ్యాక్టరీలో ప్రవేశించి దాదాపు.. ఆరు గంటల పాటు కార్మికులకు, స్థానిక అధికారులకు చుక్కలు చూపించింది. దీంతో కార్మికులు భయపడిపోయి అక్కడి నుంచి పారిపోయారు.
Leopard In Factory: మహారాష్ట్రలోని పూణేలో మెర్సిడేజ్ బెంజ్ ఫ్యాక్టరీ ఉంది. దీని చుట్టుపక్కల దట్టమైన అడవి విస్తరించి ఉంది. ఈ క్రమంలో ఒక రోజు కార్మికులకు షాకింగ్ ఘటన ఎదురైంది. అడవి నుంచి చిరుత పులి ఫ్యాక్టరీలో ప్రవేశించింది. మొదట.. ఎదో పిల్లి కాబోలు అనుకుంటూ.. కార్మికులు దీన్ని పట్టించుకొలేదు. ఆ తర్వాత.. చూస్తే చిరుత పులి ఫ్యాక్టరీకి చెందిన ఒక సందులో నక్కి ఉండటాన్ని గమనించారు. వెంటనే అలారం మోగించారు. యాజమాన్యం, కార్మికులను అప్రమత్తం చేసింది. వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు. అప్పటి వరకు ఫ్యాక్టరీలో ఉన్న కార్మికులను, ఇతర సిబ్బందిని బయటకు పంపేశారు
ఒక్కొసారి అడవిలోని జంతువులు దారి తప్పి మానవ ఆవాసాలకు వస్తుంటాయి. ఈ క్రమంలో, అవి మనుషులపై దాడులకు పాల్పడుతుంటాయి. కొన్ని సార్లు వీటిని అటవీ సిబ్బంది రెస్క్యూ చేసి తిరిగి వాటిని అడవిలోకి పంపించివేస్తారు. ఇలాంటి ఎన్నో సంఘటనలో గతంలో మనం చూశాం. తాజాగా, ఈ కోవకు చెందిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Surprise visitor at @MercedesBenzInd car plant today
Forest dept officials are trying to rescue the Leopard. All employees told to go home, no production or dispatches today pic.twitter.com/PelLyiXSKA
పూర్తి వివరాలు.. పూణేలో మెర్సిడేజ్ బెంజ్ ఫ్యాక్టరీ ఉంది. దీనిలో కార్లు తయారు చేస్తారు. దీని చుట్టు పక్కల దట్టమైన అడవి ఉంది. నిన్న (సోమవారం) ఒక చిరుత పులి దారితప్పి ఫ్యాక్టరీలో ప్రవేశించింది. వెంటనే సిబ్బంది, అటవీ అధికారులకు, వెటర్నరీ సిబ్బందికి సమాచారం అందించారు. వారు ఫ్యాక్టరీలో ఉన్న వారిని బయటకు పంపేశారు. ఆ తర్వాత.. చిరుత పులిని కాపాడటం కోసం ఆపరేషన్ ప్రారంభించారు. వెటర్నరీ వైద్యుల సూచన ప్రకారం.. చిరుత పులికి దూరం నుంచి మత్తు ఇంజెక్షన్ ను ఇచ్చారు. దీని ప్రభావంతో అది మత్తులోనికి జారుకుంది.
ఆ తర్వాత.. దాన్ని బోనులో బంధించారు. దానికి వైద్యపరీక్షలు నిర్వహించి, సమీపంలోని అటవిలో తిరిగి వదిలేస్తామని మానిక్ దో రేంజ్ ఫారెస్ట్ అధికారి యోగేష్ మహరాజ్ తెలిపారు. ఆ చిరుతపులి మగదని, 2 నుంచి 3 ఏళ్ల వయసు కల్గి ఉంటుదని వెటర్నరీ వైద్యులు తెలిపారు. చిరుత పులిని పట్టుకోవడంతో ఫ్యాక్టరీ సిబ్బంది తమ విధులలో చేరిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.