• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • VIRAL VIDEO LEOPARD AND BLACK PANTHER FACE OFF IN KARNATAKAS KABINI WILDLIFE SANCTUARY VIDEO VIRAL IN SOCIAL MEDIA NK

Viral Video: నువ్వా...నేనా... చెట్టుపై తలపడిన చిరుతపులి... నల్ల చిరుతపులి

Viral Video: నువ్వా...నేనా... చెట్టుపై తలపడిన చిరుతపులి... నల్ల చిరుతపులి

చెట్టుపై తలపడిన చిరుతపులి... నల్ల చిరుతపులి (image credit - twitter)

Viral Video: ఈ అరుదైన ఘటన ఎక్కడ జరిగింది? చెట్టుపై చిరుతపులి గెలిచిందా... నల్ల చిరుతపులి గెలిచిందా?... ఈ వీడియో చూసి నెటిజన్లు ఏమంటున్నారో తెలుసుకుందాం.

  • Share this:
    నల్ల చిరుతపులి... అదే బ్లాక్ పాంథర్... అది కనిపిస్తే మనకు ఒకింత ఆనందం వేస్తుంది. ఎందుకంటే... పులులు, చిరుత పులుల్ని మనం రెగ్యులర్‌గా చూస్తూనే ఉంటాం. నల్ల చిరుతపులి మాత్రం ఎప్పుడో గానీ కనిపించదు. ఐతే... చిరుతపులులు దెబ్బలాడుకోవడం చూసి ఉంటాం గానీ... ఇలా నల్ల చిరుత, మచ్చల చిరుత దెబ్బలాడుకోవడం ఎప్పుడూ చూసి ఉండం. సోషల్ మీడియా పుణ్యమా అని ఇలాంటివి తెరపైకి వస్తున్నాయి. ఈ వీడియో షేర్ చేసింది ఎవరో తెలుసా... ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేఖని. తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేయగానే.. వైరల్ అయిపోయింది. ఆయన ఈమధ్య కర్ణాటకలోని కబినీ వైల్డ్‌లైఫ్ శాంక్చురీకి వెళ్లారు. అక్కడ ఈ దృశ్యం కంటపడింది.

    ఓ చెట్టుపై ఆల్రెడీ మచ్చల చిరుత ఎక్కి... సేద తీరుతోంది. ఇంక ఏ చెట్టూ దొరకనట్లు నల్ల చిరుత కూడా అదే చెట్టు ఎక్కాలని డిసైడ్ అయ్యింది. ఎక్కింది. అది చూసి పై చిరుత... "దొంగ మొహమా... నీకూ ఈ చెట్టే దొరికిందా... దిగు ముందు... దిగుతావా లేదా" అని మండిపడింది. మచ్చల చిరుతతో గొడవ పెట్టుకోవడానికి రెడీ అయిన నల్ల చిరుత... మరికాస్త పైకి ఎక్కగానే... పై చిరుత ఓ రేంజ్‌లో కయ్యిమంది. దాంతో... బ్లాక్ పాంథర్‌కి... గొడవ అనవసరం... శాంతి మార్గమే మేలు అని అర్థమైంది. వీడియో మీరే చూడండి.


    ఈ 54 సెకండ్ల వీడియో నెటిజన్లను అలరిస్తోంది. చూసినవాళ్లంతా భలే ఉంది అంటున్నారు. ఈ వారం ఓ మంచి వీడియో చూసేశాం అంటున్నారు. ఇది మార్చి 6న జరిగినట్లు నీలేఖని తెలిపారు. విజయ్ ప్రభు అనే వ్యక్తి ఈ వీడియో షూట్ చేసినట్లు ఆయన వివరించారు.





    ఇది కూడా చదవండి: Horoscope Today: మార్చి 9 రాశి ఫలాలు... ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తతే రక్ష

    సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోను ఇప్పటివరకూ 98వేల మందికి పైగా చూశారు. 5వేలకు పైగా లైక్స్ వచ్చాయి. థ్రిల్లింగ్ గా ఉన్న ఈ వీడియోలో చివరికి ఏమైందన్నది తేలలేదు. నల్ల చిరుత చెట్టు దిగిపోయి ఉంటుందని నెటిజన్లు అంచనా వేస్తున్నారు.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు