Home /News /trending /

VIRAL VIDEO KERALA BRIDE WALKS ON ROAD FULL OF POTHOLES PHOTOSHOOT IS A HIT ON INTERNET PAH

Viral video: పెళ్లి వేడుకలో సామాజిక బాధ్యత.. వధువు చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు..

గుంతల రోడ్డుపైన నడుస్తున్న నవవధువు

గుంతల రోడ్డుపైన నడుస్తున్న నవవధువు

Wedding video: వధువు తన పెళ్ళి ఫోటోషూట్ కోసం అందంగా ముస్తాబైంది. ఈ క్రమంలో ఆమె గుంతలు పడిన రోడ్డుపై తన ఫోటో షూట్ కార్యక్రమం చేపట్టింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Kerala, India
ప్రస్తుతం యువత తమ పెళ్లిని (Wedding)   ట్రెండ్ కు తగ్గట్టుగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఒకప్పటిలాగా సాదా సీదాగా చేసుకోవడానికి అసలు ఆసక్తి చూపించడం లేదు. తమ పెళ్లి వేడుక ఒక రేంజ్ లో ఉండాలంటూ రకరకాల ప్లాన్ లు వేస్తున్నారు. కొంత మంది ఈవెంట్ ఆర్గనైజర్లను సంప్రదిస్తున్నారు. ఖర్చుకు కూడా ఏమాత్రం వెనుకాడటం లేదు. ప్రీవెడ్డింగ్ నుంచి అప్పగింతల వరకు ప్రతి ఒక్క ఈవెంట్ జీవింతంలో మర్చిపోలేని విధంగా ఉండేలా ప్లాన్ వేస్తున్నారు. దీనికోసం మంచి మంచి లోకేషన్ లు, కొండలు, గ్రీనరీ ఉన్న ప్రదేశాలు, కాస్లీ కాస్టూమ్స్ ధరించి ఈవెంట్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఒక యువతి మాత్రం తన వెడ్డింగ్ షూట్ కోసం గుంతలు పడిన రోడ్డును ఎంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో (Social media) తెగవైరల్ గా (Viral video) మారింది. పూర్తి వివరాలు.. కేరళకు (Kerala) చెందిన ఒక నవవధువు తన పెళ్లి ఫోటో షూట్ కోసం గుంతలు పడిన రోడ్లను ఎంచుకుంది. ఆమె అందంగా రెడీ అయ్యి.. గుంతలు పడిన రోడ్లగుండా నడుచుకుంటూ వస్తుంది. కాగా, ఆ ప్రాంతంలో రోడ్లన్ని వర్షం పడి పూర్తిగా గుంతలుగా మారిపోయాయి. కనీసం యువతి సరిగ్గా నడవలేక ఇబ్బందులు పడుతుంది. కనీసం ఈ రకంగా అయిన.. తాము ఎదుర్కొంటున్న బాధలు అధికారులు, నాయకులవరకు వెళ్తుందని నవవధువు ఈ విధంగా చేసినట్లు తెలుస్తోంది.
దీనితో యువతి తన పెళ్లి ఫోటోషూట్ తో పాటు.. సమాజం పట్ల తన సామాజిక బాధ్యతను కూడా సోషల్ మీడియాలో అందరికి తెలిసేలా చేసింది. కనీసం దీన్ని చూసైన అధికారులు స్పందిస్తారేమోనని నవవధువు భావించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లుకొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు వధువు చేసిన పనికి ఫిదా అవుతున్నారు. మరికొందరు సమాజం పట్ల ఆమె చూపిన బాధ్యతను శెభాష్ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Kerala, Viral Video, Wedding

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు