హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral video: బార్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఊహించని అతిథి.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో..

Viral video: బార్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఊహించని అతిథి.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో..

బార్ లోకి ప్రవేశిస్తున్న కంగారు

బార్ లోకి ప్రవేశిస్తున్న కంగారు

Wine shop: మన చుట్టు పక్కల .. కోతులు, కొండెంగలు మన ఇళ్లు, దుకాణాలలోనికి ప్రవేశిస్తుంటాయి. వాటికి నచ్చిన పదార్థాలను తీసుకొని అక్కడి నుంచి నిముషాల్లో మాయమవుతాయి. ఇది మనకు తెలిసిందే. కానీ ఇక్కడ మాత్రం.. ఒక కొత్త అతిథి స్థానికంగా ఉన్న వైన్ షాప్ లోనికి ప్రవేశించింది.

ఇంకా చదవండి ...

Kangaroo Enters A Bar In Australia: సాధారణంగా జంతువులు ఒక్కొసారి దారితప్పి మనుషుల ఆవాసాలలోకి ప్రవేశిస్తుంటాయి. ఇవి.. ఆహారం కోసం, నీటి కోసం మన ఇళ్లలోనికి ప్రవేశిస్తుంటాయి. మన ఇళ్ల మీద కొతులను చూస్తుంటాం. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న వెంటనే ఇళ్లలోనికి ప్రవేశించి, కనపడిన దాన్ని తీసుకొని పారిపోతుంటాయి. ఒక్కొసారి కోతులు దుకాణాలలో కూడా ప్రవేశిస్తుంటాయి. కోతులు, పిల్లులు, కొన్ని రకాల పకులు మన ఇళ్లలోనికి ప్రవేశిస్తుండటం మనం చూస్తుంటాం. అవి వాటికి కావాల్సిన ఆహారాన్ని తీసుకొని చటుక్కును వెళ్లిపోతాయి.

సోషల్ మీడియాలో (Social Media) రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు  (Viral video) ఫన్నీగా ఉంటే మరికొన్ని వింతగా ఉంటాయి. కొన్ని ఎమోషనల్ గా ఉంటే.. మరికొన్ని భయంకరంగా ఉంటాయి. నెటిజన్లు వీటిని చూడటానికి ఆసక్తి కనబరుస్తారు. ప్రస్తుతం ఒక ఫన్నీ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.


పూర్తి వివరాలు.. కంగారు (Kangaroo) అనేది ఆస్ట్రేలియా దేశపు జాతీయ జంతువు. కంగారులు ఆసీస్ లో ఎక్కువగా కనపడతాయి. ఇవి ప్రధానంగా రెండు కాళ్లతో ఎక్కువగా నడుస్తాయి. దుంకుతూ.. కంగారు కడుపులో పిల్లలు ఉండటానికి ప్రత్యేకమైన ప్రదేశం ఉంటుంది. అయితే, తాజాగా, ఒక కంగారు ఆస్ట్రేలియాలోని ( Australia) ఒక బార్ లో (Kangaroo Enters A Bar) ప్రవేశించింది. అప్పుడు బార్ లో కస్టమర్ ఉన్నారు. కొంత మంది వైన్ ను కొనుగోలు చేస్తున్నారు. మరికొంత మంది అక్కడే తాగుతున్నారు. అప్పుడు ఒక కంగారు.. గెంతుకుంటూ రావడాన్ని వారు ఆశ్చర్యంతో చూశారు. ఆ తర్వాత.. నవ్వుకున్నారు. ఎవరు కూడా భయపడలేదు. వారు కంగారును తమ సెల్ ఫోన్ లో ఫోటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. ఆ తర్వాత.. కంగారు వారికి కాసేపు అక్కడ ఉండి తిరిగి బైటకు వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా  (Viral video) మారింది. కొందరు పాపం.. సమ్మర్ కదా.. కంగారు.. (Kangaroo) కూడా కూల్ గా ఉన్నది.. తాగడానికి వచ్చిందేమో, అది కూడా ఛిల్ కావడానికి వచ్చిందేమో అంటూ ఫన్నీగా కామెంట్ లు చేస్తున్నారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Australia, Viral Videos, Wine shops

ఉత్తమ కథలు