హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

కండోమ్ చేతిలో పట్టుకుని మరీ యువతి రిపోర్టింగ్.. వైరల్ వీడియో..

కండోమ్ చేతిలో పట్టుకుని మరీ యువతి రిపోర్టింగ్.. వైరల్ వీడియో..

రిపోర్టింగ్ చేస్తున్న యువతి

రిపోర్టింగ్ చేస్తున్న యువతి

Viral Video: కొన్నిరోజులుగా ఆప్రాంతంలో భారీగా వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో ఒక యువతీ అక్కడి నుంచి లైవ్ రిపోర్టింగ్ చేస్తోంది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Delhi, India

అమెరికాలోని (America)  ఫ్లోరిడాలో కొన్నిరోజులుగా వర్షం కురుస్తోంది. దీంతో అక్కడి ప్రాంతమంతా పూర్తిగా జలమయమైపోయింది. కుండపోతగా కురుస్తున్న వర్షం వలన అక్కడి జనజీవనమంతా అస్తవ్యస్తమైపోయింది. వాహనాలు రోడ్డుమీదకు రావడానికి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అక్కడ హరికేన్ ప్రభావానికి 60 మందికి పైగా ప్రజలు చనిపోయినట్లు తెలుస్తోంది. అక్కడ విద్యుత్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న బాధలను కొందరు జర్నలిస్ట్ లు వర్షంలోనే లైవ్ రిపోర్టింగ్ చేస్తున్నారు.

ఇంతలో NBC2 యొక్క కైలా గేలర్ అనే యువతి వర్షం లో ఆమె లోగో (మైక్) తడవకుండా ఆమె కండోమ్ ను తొడిగింది. సాధారణంగా ఎవరైన వర్షంలో తడవకూడదని ప్లాస్టిక్ కవర్ లు పెట్టడం మనకు తెలిసిందే. కానీ యువతి మాత్రం ఆమె మైక్ కు కండోమ్ తొడిగీ మరీ రిపోర్టింగ్ చేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో (Social media)  వైరల్ గా (Viral video) మారింది.

ఇదిలా ఉండగా  రాజస్థాన్ లో (Rajasthan) వింత ఘటన చోటు చేసుకుంది.

సజ్జన్ గఢ్ ప్రాంతంలోని పడ్లా వాడ్కియా గ్రామంలో ఒక వ్యక్తి నివసిస్తున్నాడు. అతను కొన్నేళ్లుగా ఒక ఎలుకను (Rat) ఎంతో అపురూపంగా పెంచుకుంటున్నాడు. దానికి మంచి ఫుడ్ పెట్టేవాడు. ఎక్కడికి వెళ్లిన దాన్ని ఒక కంట కనిపెట్టుకుని ఉండేవాడు. అయితే.. ఒకరోజు అతని పెంపుడు ఎలుక కన్పించకుండా పోయింది. ఇంట్లో చుట్టుపక్కల వెతికాడు. కానీ లాభం లేకుండా పోయింది. దీంతో అతగాడు ఏకంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. తన ఎలుక కన్పించడంలేదని ఫిర్యాదు చేశాడు. దానికి సంబంధించిన ఆనవాళ్లు కూడా చెప్పాడు. ఎలుక 700 గ్రాముల బరువు ఉంటుందని కూడా చెప్పాడు.

అంతే కాకుండా.. ఎలుక మిస్పింగ్ వెనుక తన సోదరుల పిల్లల హస్తం ఉండోచ్చని కూడా ఫిర్యాదు చేశాడు. తొలుత పోలీసులు దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ బాధితుడు మంకుపట్టు పట్టేసరికి ఫిర్యాదు నమోదు చేశారు. అంతే కాకుండా.. ఎలుకను తన సోదరుడి కుమారులు ఏమైన చేశారేమో అని కూడా ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో వారి సోదరుడి కుమారుల పేర్లను ఎఫ్‌ఐఆర్‌ కాపీలో నమోదు చేశారు. ప్రస్తుతం కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఇలాంటి కేసు నమోదు చేయడం తొలిసారి అని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో (Social media) వైరల్ గా (Viral)  మారింది.

Published by:Paresh Inamdar
First published:

Tags: America, Viral Video

ఉత్తమ కథలు