Home /News /trending /

VIRAL VIDEO INTELLIGENT CROW SOLVES SHAPE PUZZLE TO GET TREATS PAH

Viral Video: పజిల్ ఆడుతున్న కాకి.. నెట్టింట వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో..

పజిల్ ఆడుతున్న కాకి

పజిల్ ఆడుతున్న కాకి

Intelligent Crow:  జంతువులకు సంబంధించిన రకారకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇక్కడో కాకి తన యజామానితో కలిసి పజిల్ గేమ్ ను ఆడుతుంది. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ గా మారింది.

Crow Solves Shape Puzzle to Get Treats: ఇప్పటి వరకు మనం కుక్కలు, పిల్లులు, గున్న ఏనుగులు వంటివి తమ యజమానులతో చేసిన చిలిపి చేష్టలు, ఫన్నీ సంఘటనలను మనం చూశాం. కుక్కలు, పిల్లులను ఇంట్లో పెంచుకోవడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుంటారు. అవి తమ యజమాని చెప్పిన ఆదేశాలను పాటిస్తుంటాయి. బాల్ తో ఆడుకోవడం, పేపర్ తేవడం, ఏవైన వస్తువులను దూరంగా పారేసి, తమ కుక్కతో తెప్పించుకోవడం వంటివి నేర్పిస్తుంటారు. ఇక పిల్లులు కూడా రకారకాల చిలిపి పనులు చేస్తుంటాయి.

తమ ఇంట్లో బెడ్ పై పడుకొని ఉంటాయి. ఒక్కొసారి, తమ యజమాని బెడ్ లో ప్రవేశించడం, వీపు మీద ఎక్కి పడుకోవడం వంటివి చేస్తుంటాయి. కొన్ని చోట్ల పిల్లులు.. యజమానికి బాడీ మసాజ్ చేసిన వీడియోలు కూడా ఇటీవల వైరల్ గా మారాయి. ఇక చాలా అరుదుగా పక్షులను కొంత మంది మాత్రమే పెంచుకుంటారు. ప్రధానంగా రామచిలుకను పెంచుకొవడానికి ఇంట్రెస్ట్ చూయిస్తుంటారు. అవి తమ ఇంట్లో వారి మాటలను విని మాటలు నేర్చుకుంటాయి.





ఎవరైన వస్తే అరుస్తూ ఇంట్లో వారిని అప్రమత్తం చేస్తాయి. ఇక్కడో అరుదైన సంఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. చిన్నప్పుడు మనకు కథల్లో.. కాకి దాహాం వేస్తుంది. అప్పుడు ఒక కుండ కనిపిస్తుంది. కానీ కుండ అడుగు భాగంలో నీళ్లు ఉంటాయి. అప్పుడు కాకి.. ఒక ఉపాయం ఆలోచిస్తుంది. మెల్లగా దాని దగ్గరకు వెళ్లి దాంట్లో రాళ్లు వేస్తుంది. అప్పుడు నీళ్లు పైకి వస్తాయి. ఆ నీళ్లను తాగా తన దాహాన్ని తీర్చుకుంటుంది. ఈ కాకి కూడా అలాంటి తెలివైన కాకే.. ఇది తమ యజమానితో కలిసి పజీల్ ఆడుతుంది.

పూర్తి వివరాలు.. మనం ఇళ్లలో చిన్నపిలలకు కొన్ని రకాల పజిల్స్ గేమ్స్ ఆడిస్తుంటాం. ఇలాంటి గేమ్స్ ను చిన్న పిల్లలు ఇష్టంతో ఆడతారు. అయితే, ఇక్కడో కాకి కూడా తానేమాత్రం తక్కువ కాదన్నట్లు.. పజీల్ గేమ్ ఆడుతుంది. కాకి ముందు పజిల్ బాక్స్ ఉంచారు. ఆ బాక్స్ లో రౌండ్, నక్షత్రాకారం, త్రిభుజం, చతురస్రాకారంలో హోల్స్ ఉన్నాయి. వాటి పక్కన వివిధ ఆకారాలలో ఉన్న.. గుండ్రని, నక్షత్రాకార, త్రిభుజాకారం, చతురస్రాకారంలో ఉన్నవాటిని ఉంచారు.

కాకి ఆ పక్కన ఉన్న వివిధ ఆకారాలలో ఉన్న బాక్స్ లను తన ముక్కుతో కరుచుకొని వెళ్లి.. ఆ పజిల్ బాక్స్ లో వేయసాగింది. ఏ ఆకారంలో ఉన్న ప్లాస్టిక్ ను.. దాని తగ్గ ఆకారంలో ఉన్న పజిల్ బాక్స్ మీద ఉన్న రంధ్రంలో వేసింది. ఇలా రౌండ్, నక్షత్రాకారం, త్రిభుజం,చతురస్రాకారం హోల్స్ లలో పక్కన ఉన్న బాక్స్ లను వేసి.. పజిల్ పూర్తి చేసింది. దీంతో దాని యజమని తన చేతిలో కొన్ని గింజలను పట్టుకుంది. కాకి గబగబా తినేసింది. దీన్ని అక్కడే ఉన్న మహిళ రికార్డు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో... అమెజింగ్ నేచర్ అనే.. ఇన్ స్టాలో పేజీలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. కాకులు మనుషుల ముఖాల్ని గుర్తుంచుకుంటాయని కొన్నిపరిశోధనలలో తెలింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Crows, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు