• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • VIRAL VIDEO INDIAN SUPERMAN FLYING IN AIR WITH BIKE DANGEROUS STUNT VIDEO VIRAL ON SOCIAL MEDIA NK

Viral video: దేవుడా.. బైక్‌పై ఇలా కూడా వెళ్తారా.. వీడియో చూసి పగలబడి నవ్వుతున్న జనం

Viral video: దేవుడా.. బైక్‌పై ఇలా కూడా వెళ్తారా.. వీడియో చూసి పగలబడి నవ్వుతున్న జనం

బైక్‌పై ఇలా కూడా వెళ్తారా (image credit - twitter)

Viral video: మీరు అరుదైన వీడియోలు, ఆశ్చర్యపోయే వీడియోలు చూడాలని అనుకుంటున్నారా... అయితే మీ కోసం ఈ వారం ఓ అద్భుతమైన వీడియో వచ్చేసింది. ఆలస్యం చేయకుండా చూసేద్దాం.

  • Share this:
    Viral video: సోషల్ మీడియా అనేది వైరల్ వీడియోల అడ్డా. అక్కడ మనకు ఆనందాన్ని ఇచ్చే వీడియోలకు లెక్క లేదు. కొన్ని నవ్విస్తాయి, కొన్ని ఆలోచింపజేస్తాయి, మరికొన్ని ఏడిపిస్తాయి... ఇంకొన్ని పక్కదారి పట్టిస్తాయి. అంతా సోషల్ మీడియా నెటిజన్ల మహిమ. ఇలాంటి వీడియోల్లో కాస్త వరైటీగా ఉన్నవైతే ఎక్కువ మందికి నచ్చి వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వీడియో ఇంకా వైరల్ అవ్వలేదు. ఎందుకంటే దాని గురించి ఇంకా అందరికీ తెలియలేదు. మనమే ముందుగా చూసేస్తున్నామన్నమాట. ఈ వీడియో చూసిన వాళ్లు మొదట ఆశ్చర్యపోతున్నారు. తర్వాత నవ్వేస్తున్నారు. ఇలాంటి దృశ్యం మనం ఎప్పుడూ చూసి ఉండం.

    ఇందులో ఓ బైక్‌పై నలుగురు వెళ్తున్నారు. అదే చిత్రం అనుకుంటే... ఆ నలుగురిలో ముందు డ్రైవ్ చేస్తున్న వ్యక్తి కాకుండా... మిగతా వెనక కూర్చున్న ముగ్గురూ... మరో వ్యక్తిని తమ చేతులతో పట్టుకొని మోసుకెళ్తున్నారు. అతను వంకరగా వంగకుండా నిఠారుగా ఉండి... గాల్లో తేలుతున్నట్లుగా సైడుకి ఉన్నాడు. వాళ్లు ఆయన్ని ఏమాత్రం పట్టు జారకుండా పట్టుకున్నారు. దాంతో... ఆయన సూపర్ మేన్‌లా గాల్లో తేలినట్లుగా దూసుకుపోతున్నాడు. అతన్ని కూర్చోబెట్టేందుకు బైక్‌పై ప్లేస్ లేకపోవడంతో... ఇలా ఎరేంజ్ చేసుకున్నారు.


    ఇలాంటి దృశ్యం మనం ఎక్కడా చూసి ఉండం. రూల్స్ ప్రకారమైతే... ఇది చట్టరీత్యా నేరం. బైక్‌పై ఇద్దరే వెళ్లాలి. హెల్మెట్ ధరించాలి. ఇక్కడ నలుగురు వెళ్తున్నారు. పైగా మరో వ్యక్తిని ప్రమాదకర స్థితిలో మోసుకెళ్తున్నారు. యాక్సిడెంట్ జరిగితే... ప్రాణాలకే ప్రమాదం. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు గానీ... దేవరాజ్ సింహ్ చౌహాన్ అనే నెటిజన్ ఈ వీడియోని ట్విట్టర్‌లో రిప్లైగా పోస్ట్ చేశారు. ఓ మహిళ మాస్కుతోపాటూ... ముక్కుపుడక నగను కూడా మాస్క్ పైన ధరించడం వైరల్ అవ్వడంతో... ఇండియాలో ఇలాంటివి కూడా జరుగుతాయి అనే అర్థం వచ్చేలా ఈ వీడియో పోస్ట్ చేశారు. ఇది రెండ్రోజుల్లో వైరల్ అయ్యే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు.

    ఇది కూడా చదవండి: No Corona: దగ్గు, జలుబు ఉన్నాయా... డోంట్ వర్రీ... ఇంట్లోనే ఇలా చేసుకోండి చాలు

    ఈ వీడియోని ఇంకా పోలీసులు చూడలేదేమో. చూసి ఉంటే కేసు రాసేవాళ్లే. ఆ సంగతేమో గానీ నెటిజన్లకు మాత్రం ఇది కొత్తగా ఉండి నచ్చుతోంది.
    Published by:Krishna Kumar N
    First published: