Video: దేవుడా!.. కిడ్నీ అమ్ముకొని భార్యకు ఐఫోన్ కొన్నాడు!

ఐఫోన్ కహానీ (image credit - facebook)

Viral video: భార్యకు భర్తే గిఫ్ట్. అతను పంచే ప్రేమానురాగాలే అసలైన ఆనందం. అది అర్థం చేసుకోని కొంత మంది విపరీత నిర్ణయాలు తీసుకుంటున్నారు.

 • Share this:
  Video: మనకు ఉన్నదానితో సరిపెట్టుకుంటే ఏ సమస్యలూ ఉండవు. కోరికల్ని అదుపులో పెట్టుకోవాలి. అప్పు ఎప్పుడూ ప్రమాదమే అని చాణక్యుడు ఎప్పుడో చెప్పాడు. అయినా సరే ఈ రోజుల్లో చాలా మంది... క్రెడిట్ కార్డులు (credit cards) వాడేస్తూ... అప్పులపాలవుతున్నారు. ఫలానా వస్తువు కొనుక్కోవాలి అనుకున్నప్పుడు దాని కోసం డబ్బు పోగేసి కొనుక్కుంటే సమస్య ఉండదు... కానీ EMI ద్వారా కొనేసి... ఆ ఇన్‌స్టాల్‌మెంట్లు (instalments) కట్టలేక... ఇబ్బంది పడుతున్నారు. ఆదాయాన్ని బట్టే ఖర్చులుండాలి. అనుకోకుండా జరిగే ఖర్చులను (unexpected expenses) ఎలాగూ ఆపలేం. కానీ... అవసరాలకు మించిన వాటిని ఆశించి చిక్కుల్లో పడటం కరెక్టు కాదు.

  తన భార్యకు ఐఫోన్ కొనాలి అనుకున్న ఆ భర్త.. దాన్ని కొనేందుకు డబ్బు కోసం ఏకంగా తన కిడ్నీ అమ్ముకున్నాడన్నది వీడియో సారాంశం. ఇది కొన్ని నెలల కిందటి వీడియో. ఇప్పుడు వైరల్ అయ్యింది. చైనాలో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఓ టీనేజర్ తన కిడ్నీ అమ్ముకొని ఐఫోన్ (Iphone) కొనుక్కున్నాడు. ఆ తర్వాత అతనికి చిత్రమైన వ్యాధి వచ్చి 22 ఏళ్లకే చనిపోయాడు. దాంతో అతని విషయం బయటపడింది. అలాంటిదే మన దేశంలోనూ జరిగిందన్నది ఆ వీడియో సీన్.

  సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో భార్య, భర్త గొడవాడుకుంటున్నారు. గొడవకు కారణం ఐఫోన్. తనకు ఐఫోన్ కావాలని ఆమె కొన్నాళ్లుగా భర్తను తరచూ అడుగుతోంది. అతని ఆదాయం అంతంతమాత్రమే. ఐఫోన్ కొనేంత స్థోమత లేదు. పోనీ అప్పో సొప్పో చేద్దామంటే... అతనికి అంత అప్పు ఇచ్చేవాళ్లు లేరు. మరేంచెయ్యాలి. భార్యను ఎలా సంతోష పెట్టాలి అని ఆలోచించాడు.

  "తన రెండు గాజులూ అమ్ముకోవాల్సి వచ్చింది" అనే యాడ్ లాంటిది ఏదో చూశాడు. దాంతో తనకు రెండు కిడ్నీలు ఉన్నాయి కాబట్టి.... ఒకటి అమ్ముకున్నా ఏం కాదులే అనుకున్నాడు. రెండో ఆలోచన లేకుండా ఆస్పత్రికి వెళ్లి... ఆపరేషన్ చేయించుకున్నాడు. ఆ డాక్టర్లు ఓ కిడ్నీ తీసేసి డబ్బులిచ్చారు. డిశ్చార్జి అయ్యాక... ఐఫోన్ కొని ఇంటికొచ్చాడు. నీ చేతిలో ఐఫోన్ చూడాలన్నదే నా ఆనందం అంటూ ఆమెకు ఇచ్చాడు. ఎంతో ఆనందపడింది. ఆ తర్వాత మంచంపై కూలబడ్డాడు. పొట్టకు బ్యాండేజీ కనిపించింది. ఏమైందన్న ఆమెకు నిజం చెప్పాడు. అంతే ఆమె ఆనందం ఆవిరైంది.

  ఐఫోన్ మంచంపై పడేసిన ఆమె... వాదనకు దిగింది. కిడ్నీ అమ్మి కొనమని ఎవరు చెప్పారంటూ మండిపడింది. నిజానికి అది ఆమె కోపం కాదు... బాధ నుంచి వచ్చే ఆవేశం. ఇలా కాసేపు భార్యను ఏడిపించిన (teasing) అతను... ఇదంతా ఫేక్... డ్రామా అంటూ బ్యాండేజ్ తీసేశాడు. డబ్బు పోగేసి ఐఫోన్ కొన్నాను అని అసలు నిజం చెప్పాడు. దాంతో ఆమె ఎంతో ఆనందపడింది. ఇంకెప్పుడూ ఏవీ కొనమని అడగనని చెప్పింది. పొరపాటున కూడా ఇలాంటి ఆలోచనలు మనసులోకి రానివ్వొద్దని భర్తను కోరింది. అది అతనిపై ఆమె గుండెల్లో దాచుకున్న ప్రేమ.

  వీడియో ఇక్కడ చూడండి:

  ఇది కూడా చదవండి: Red Ladyfinger: ఆ బెండకాయలు కేజీ రూ.300... ఎందుకో తెలుసా?

  నెటిజన్లకు ఈ వీడియో బాగా నచ్చుతోంది. ఇందులో ఓ మంచి సందేశం ఉంది అంటున్నారు. భార్యల కోర్కెలు తీర్చాలి... అలాగని తీవ్ర నిర్ణయాలు తీసుకోకూడదు అనే మంచి మెసేజ్ ఇచ్చారని మెచ్చుకుంటున్నారు. హ్యాపీ ఎండింగ్ అని స్మైలీ ఇమోజీలు పెడుతున్నారు.
  Published by:Krishna Kumar N
  First published: