జంతువులు, మరోక జీవిని చంపి తినేస్తాయి. ఇదే ఆటవిక ధర్మం. అవి బతకాలంటే ఎదుటి జీవి దానికి ఆహారం కావాల్సిందే. ఇక క్రూర జంతువులు.. వేటాడేటప్పుడు ఏమాత్రం జాలీ చూపించవు. అవి ఎదుటి జీవిని చంపి తమ ఆకలిని తీర్చుకుంటాయి. అయితే, అవి కూడా కొన్ని సార్లు చిన్న జంతువులను తినకుండా వదిలేసిన సందర్బాలు ఉన్నాయి. సింహలు, పులులు, సాధు జంతువులు మీద దాడిచేసేటప్పుడు, కొన్ని సార్లు వాటి పిల్లలు కూడా ఉంటాయి. వాటిని చంపకుండా దూరంగా వెళ్లిపోతుంటాయి. ఇలాంటి ఎన్నో వీడియోలు వైరల్ (viral videos) అయ్యాయి. తాజాగా, ఒక పిల్లి తన వేటను తినకుండా వదిలేస్తుంది.
The cat wants to attack the pigeon. The pigeon is blind. The moment the cat realises it, she changes her mind. pic.twitter.com/jQxu2NquFz
పూర్తి వివరాలు.. పిల్లికి (cat attacks on pigeon) బాగా ఆకలేసింది. ఈ క్రమంలో అది వేట కోసం వెతుకుతుంది. ఇంతలో దానికి బిల్డింగ్ మధ్యలో ప్రదేశంలో ఒక పావురం కన్పిస్తుంది. వెంటనే దాని దగ్గరకు వెళ్తుంది. ఎలాగైన దాన్ని తినాలకుంటుంది. మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ దాని దగ్గరకు చేరుకుంటుంది. పాపం..పావురం మాత్రం ఏమాత్రం కదలకుండా అలానే ఉండిపోతుంది. అయితే.. పిల్లికి ఇదేదో తెడా ఉందనుకుంటుంది. మెల్లగా పావురం దగ్గరకు వెళ్తుంది.
అప్పుడు అది పావురం చూడలేదని.. కళ్లు కన్పించవని అనుకుటుంది. అయితే, దానికి ఏమాత్రం హనీ తలపెట్టకుండా ఆగిపోతుంది. ప్రస్తుతం ఈ మనస్సుకు హత్తుకునే వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి అవనిష్ శరణ్ తన ఇన్ స్టా హ్యండిల్ లో షేర్ చేశారు. దీంతో ఇది కాస్త వైరల్ గా మారింది.
ఇదిలా ఉండగా 80 ఏళ్ల బామ్మ జిమ్ చేస్తు అందరిని షాక్ కు గురిచేసింది.
ఒక బామ్మ తన మనవడు జిమ్ చేస్తుండగా టెర్రస్ మీదకు వెళ్లింది. ఆమెకు 82 ఏళ్లు. తన మనవడు ఆమెకు సవాల్ విసిరాడో.. మరేంటో కానీ.. 80 కేజీల డంబెల్ ను ఎత్తింది. ఏ మాత్రం ఒత్తిడి లేకుండా డంబెల్ ను పైకి ఎత్తి ఆ తర్వాత మెల్లగా కింద పెట్టింది. బామ్మ వర్కవుట్స్ చూసి మనవడు షాక్ కు గురయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. దీన్ని చూసిన నెటిజన్లు.. వావ్... బామ్మ.. భలే వర్కవుట్స్ చేస్తుందంటూ కామెంట్ లు పెడుతున్నారు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.