హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

వావ్.. కల్లు గీత కార్మికుడి టెక్నిక్ ఫాలో అయిన కొండచిలువ.. వైరల్ గా మారిన వీడియో..

వావ్.. కల్లు గీత కార్మికుడి టెక్నిక్ ఫాలో అయిన కొండచిలువ.. వైరల్ గా మారిన వీడియో..

చెట్టుపైకి ఎక్కిన కొండ చిలువ

చెట్టుపైకి ఎక్కిన కొండ చిలువ

Viral Video: కొండ చిలువ అడవిలో పెద్ద చెట్టుదగ్గరకు చేరుకుంది. అది మెల్లగా చెట్టుపైకి ఎక్కుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Goa, India

పాములంటే ప్రతి ఒక్కరికి చచ్చేంత భయం. అసలు.. పాము పేరు ఎత్తడానికి కూడా సాహాసించరు. పొరపాటున పాము కన్పిస్తే ఆ దరిదాపుల్లోకి కూడా వెళ్లడానికి సాహాసించరు. పాములు, కొండ చిలువలు.. ఎక్కువగా చెట్లు, పొదలు, పంటపొలాల్లో ఎక్కువగా కన్పిస్తుంటాయి. అదే విధంగా.. గుబురుగా చెట్లు, బురద,రాళ్లదగ్గర, చెరువుల దగ్గరగా కూడా పామలు ఎక్కువగా కన్పిస్తుంటాయి. అక్కడ ఉండే ఎలుకలను వేటాడి తింటుంటాయి.

కొన్నిసార్లు.. అవిదారితప్పి మనుషుల ఇళ్లకు వస్తుంటాయి. కొందరు పాములు, కొండ చిలువలు తమ కంట పడితే వాటిని చంపుతుంటారు. మరికొందరు మాత్రం.. స్నేక్ హెల్పింగ్ సోసైటివారికి సమాచారం ఇస్తుంటారు. ఇప్పటికే పాములకు సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో (social media)  వైరల్ గా మారాయి. కొన్ని చూడటానికి భయంకరంగా ఉంటే.. మరికొన్ని మాత్రం ఆశ్చర్యానికి గురిచేసేలా ఉంటున్నాయి. ఈ కోవకు చెందిన మరో వీడియో ట్రెండింగ్ లో నిలిచింది.

పూర్తి వివరాలు.. అడవిలో ఒక భారీ కొండ చిలువ (Python)  చెట్టుదగ్గరకు చేరుకుంది. ఆ తర్వాత.. తన తొకను బ్యాలెన్స్ చేసుకుని చెట్టు బెరడుపైకి ఎక్కింది. అది అచ్చం కల్లుగీతా కార్మికుడు చెట్టు ఎక్కినట్లే పైకి గబాగబా పాకుతూ ఎక్కేసింది. అది తన తోకను ఆధారంగా చేసుకుని చెట్టును చుట్టేసుకుంది. ఆ తర్వాత.. కొండ చిలువ మెల్లగా తోకతో పైకి ఎక్కింది. ఇలా తోకతో తన దేహన్ని ముందుకు నెట్టుకుంటూ పొడవైన చెట్టుపైకి సునాయాసంగా ఎక్కేసింది. ఈ సంఘటన గతంలోనే జరిగింది. తాజాగా, మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా (Viral video)  మారింది.

ఇదిలా ఉండగా  రాజస్థాన్ లో (Rajasthan) వింత ఘటన చోటు చేసుకుంది. సజ్జన్ గఢ్ ప్రాంతంలోని పడ్లా వాడ్కియా గ్రామంలో ఒక వ్యక్తి నివసిస్తున్నాడు. అతను కొన్నేళ్లుగా ఒక ఎలుకను (Rat) ఎంతో అపురూపంగా పెంచుకుంటున్నాడు. దానికి మంచి ఫుడ్ పెట్టేవాడు. ఎక్కడికి వెళ్లిన దాన్ని ఒక కంట కనిపెట్టుకుని ఉండేవాడు. అయితే.. ఒకరోజు అతని పెంపుడు ఎలుక కన్పించకుండా పోయింది. ఇంట్లో చుట్టుపక్కల వెతికాడు. కానీ లాభం లేకుండా పోయింది. దీంతో అతగాడు ఏకంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. తన ఎలుక కన్పించడంలేదని ఫిర్యాదు చేశాడు. దానికి సంబంధించిన ఆనవాళ్లు కూడా చెప్పాడు. ఎలుక 700 గ్రాముల బరువు ఉంటుందని కూడా చెప్పాడు.

అంతే కాకుండా.. ఎలుక మిస్పింగ్ వెనుక తన సోదరుల పిల్లల హస్తం ఉండోచ్చని కూడా ఫిర్యాదు చేశాడు. తొలుత పోలీసులు దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ బాధితుడు మంకుపట్టు పట్టేసరికి ఫిర్యాదు నమోదు చేశారు. అంతే కాకుండా.. ఎలుకను తన సోదరుడి కుమారులు ఏమైన చేశారేమో అని కూడా ఫిర్యాదులో పేర్కొన్నాడు.

First published:

Tags: Python, Snake, Viral Video

ఉత్తమ కథలు