Viral video: నిమిషం పాటూ ఉన్న వీడియోలో... ఆ చిన్నారి ఎక్కడా తడబడకుండా వేసిన డాన్స్ స్టెప్స్... నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఎంతో ఈజీగా అలా ఎలా వేస్తున్నాయని కళ్లప్పగించి చూస్తున్నారు.
Viral video: మన మంచి నెటిజన్లు ఇవాళ మరో మంచి వీడియోను వైరల్ చేశారు. ఇప్పటికే ఈ వీడియోను 36 లక్షల మంది చూశారు. ఇప్పుడు ఆ లిస్టులో మనమూ చేరుతున్నాం. విషయమేంటంటే... ఓ చోట కొంత మంది ప్రత్యేక యూనిఫామ్ వేసుకొని... డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. అందులో భాగంగా వారు రకరకాల స్టెప్స్ వేస్తున్నారు. అందరూ ఒకే రకంగా వేస్తున్నారు. అందులో వింతేమీ లేదు. కానీ... వారితో కలిసి... ఓ 3 ఏళ్ల పిల్లాడు కూడా అచ్చం వారిలాగే డాన్స్ వేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. మ్యూజిక్‌కి తగ్గట్టు రిథమిక్‌గా కదులుతూ... ఆ చిన్నారి వేస్తున్న స్టెప్స్.. నెటిజన్లను ప్రేమలో పడేస్తున్నాయి. రెక్స్ ఛాప్మాన్ ఆ వీడియోను నెటిజన్ల కోసం ట్విట్టర్ షేర్ చేశారు.
డాన్స్ వేసేటప్పుడు ఆ చిన్నారి ఎక్కడా టెన్షన్ పడలేదు. చాలా కూల్‌గా కనిపించాయి. ఆ డాన్స్‌ని బాగా ఎంజాయ్ చేశాడు. స్టెప్స్ విషయంలో పూర్తి సింక్ ఇస్తూ వెయ్యడం అంత చిన్న పిల్లలకు అంత ఈజీ కాదు. ఆ వీడియో మీరే చూడండి... నవ్వేయండి.
This little man dancing with the big folks is the Twitter content I’m here for… pic.twitter.com/ikpuHdM8CC
ఈ వీడియోకి రెస్పాన్స్ ఓ రేంజ్లో ఉంది. 36 లక్షల మంది చూశారంటేనే అర్థం చేసుకోవచ్చు... ఏ రేంజ్లో వైరల్ అవుతోందో. మరో మైకెల్ జాక్సన్ అంటున్నారు కొందరు. ట్విట్టర్తోపాటూ... ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలోనూ ఇది షేర్ అవుతోంది.
ఈ వీడియో చూస్తున్నప్పుడు నవ్వు ఆఫుకోలేకపోయా... నా బుగ్గలకు మంచి ఎక్సర్సైజ్ అయ్యింది అని ఓ యూజర్ అన్నారు. ఇంకా ఇలాంటి ఎన్నో మంచి కామెంట్లు వస్తూనే ఉన్నాయి.
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.