హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

వామ్మో.. ఇంటిలోని రెండు గోడల మధ్య ఇరుక్కున్న పాము.. తర్వాత ఏం జరిగిందంటే..

వామ్మో.. ఇంటిలోని రెండు గోడల మధ్య ఇరుక్కున్న పాము.. తర్వాత ఏం జరిగిందంటే..

గోడల మధ్య ఇరుక్కున్న పాము..

గోడల మధ్య ఇరుక్కున్న పాము..

Haryana: ఇంట్లో వారు పనులు చేసుకుంటున్నారు. ఇంతలో పెద్ద నాగుపాము ఇంట్లోకి ప్రవేశించింది. అది గోడల మీద పాకి.. అక్కడే ఉన్న ఒక రంధ్రంలోనికి దూరింది.

కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు, చెరువులు పొంగిపోర్లు తున్నాయి. ప్రాజెక్టులలో భారీగా నీరు వచ్చి చేరుతుంది. ఈ క్రమంలో.. చెరువులలోని నీళ్లు జనావాసాల్లోకి కూడా వస్తున్నాయి. కొన్ని సార్లు.. వీటితో పాటు... పాములు, మొసళ్లు, తేళ్లు, క్రిమి కీటకాలు కూడా ఇంట్లోకి ప్రవేశిస్తున్నాయి. ఇవి మనుషులపైకి దాడి చేస్తున్నాయి. ఈ జీవులు కాటు వేయడం వలన.. కొంత మంది మనుషులు చనిపోతున్నారు. మనలో చాలా మందికి పాములంటే చచ్చేంత భయం. పాములు కన్పిస్తే.. అక్కడి దరిదాపుల్లోకి వెళ్లడానికి ఎవరు సాహాసించరు. కొన్నిసార్లు.. అవి ఆహారం, ఆవాసం కోసం దారితప్పి.. మనుషుల ఆవాసాల్లోకి వస్తుంటాయి. ఇప్పటికే పాములు ఇంట్లోకి ప్రవేషించిన అనేక ఘటనల వీడియోలు వైరల్ అయ్యాయి. ఇప్పుడిక మరోక ఘటన వెలుగులోనికి వచ్చింది.

పూర్తి వివరాలు.. హర్యానాలో (Haryana) షాకింగ్ ఘటన జరిగింది. ఫతేహాబాద్ లోని తోహానా ప్రాంతంలో ఒక ఇంట్లో పాము (Snake)  ప్రవేషించింది. ఇంట్లోవారు.. పామును గమనించారు. వెంటనే భయంతో ఇంటి నుంచి బయటకు పరుగులు పెట్టారు. వెంటనే చుట్టుపక్కల వారు అక్కడ గుమిగూడారు. పాము భయంతో.. గోడపై వెళ్లి అక్కడ ఉన్న రంధ్రంలో దూరిపోయింది. ఈ క్రమంలో ఇంట్లో వారు.. స్నేక్ రెస్క్యూ టీమ్ కు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న స్నేక్ సోసైటి వారు.. పామును బైటకు తీయడానికి అనేక ప్రయత్నాలు చేశారు. కానీ అది గోడ రంధ్రలో దూరిపోయిది.

ఇక లాభంలేదని ఇంటి వారు.. గోడను పగల గొట్టడానికి సిద్ధపడ్డారు. ఒక వ్యక్తిని పిలిపించి.. ఇంట్లోని గోడలను కూల్చేశారు. అప్పుడు పాము.. కన్పించింది. వెంటనే స్నేక్ రెస్యూ టీమ్ వారు.. పామును చాకచక్యంగా పట్టుకున్నారు. దీన్ని చూడటానికి చుట్టుపక్కల జనాలు కుప్పలుగా ఎగబడ్డారు. మొత్తానికి పాముకు ఏం కాకుండా స్నేక్ సోసైటీ వారు పట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట (Social media)  వైరల్ గా (viral video)  మారింది.

Published by:Paresh Inamdar
First published:

Tags: Haryana, Snake, Viral Video

ఉత్తమ కథలు