• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • VIRAL VIDEO HERD OF ELEPHANTS DESTROYED ALL THE BANANA TREES EXCEPT ONE THIS IS THE REASON WATCH VIDEO HERE NK

Viral video: అరటి తోటంతా నాశనం చేసిన ఏనుగులు... ఒక్క చెట్టు తప్ప... ఎందుకో తెలుసా?

Viral video: అరటి తోటంతా నాశనం చేసిన ఏనుగులు... ఒక్క చెట్టు తప్ప... ఎందుకో తెలుసా?

Viral video: అరటి తోటంతా నాశనం చేసిన ఏనుగులు... ఒక్క చెట్టు తప్ప... ఎందుకో తెలుసా? (image credit - twitter)

Viral video: ఏనుగులు తెలివైనవి. ఎంత కోపంలో ఉన్నా... అవి తెలివిగానే వ్యవహరిస్తాయి తప్ప అనవసర ఆవేశాలకు పోవు. అలాంటిది ఆ ఏనుగులు ఆ ఒక్క చెట్టును ఎందుకు నాశనం చెయ్యలేదో తెలుసుకుందాం.

  • Share this:
    తమిళనాడులో జరిగిన ఓ ఘటన... అక్కడి రాజకీయాల కంటే ఎక్కువ ఆసక్తిగా మారింది. కారణం ఏనుగులు చేసిన పనే. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అసలేమైందంటే... ఆ ఊర ప్రజలు అడవికి దగ్గర్లో అరటి తోట వేసుకున్నారు. అది ఏనుగులకు నచ్చలేదు. మనుషుల లాగా అవి నచ్చలేదు అని చెప్పలేవు కదా... సో... వాళ్లే తీసేస్తారులే అని ఎదురుచూశాయి. నానాటికీ అరటిచెట్లు పెరుగుతున్నాయే తప్ప... తోట ఖాళీ అవ్వట్లేదు. దాంతో ఏనుగులకు మండింది. "ఏంటీ మనుషులు... మన అడవుల్ని కాజేస్తారా" అనుకున్నాయి. మేటర్ తేల్చాల్సిందే అనుకున్నాయి. తాజాగా ఓ రోజు ఏనుగుల మంద అరటితోటవైపు బయలుదేరింది. అది చూసిన ప్రజలు... "వామ్మో ఏనుగులు.. దేవుడో"... అనుకున్నారు.

    అలా అంతా చూస్తుండగానే... ఆ ఏనుగులు అరుస్తూ వచ్చి... అరటి తోటపై పడ్డాయి. దొరికిన చెట్టును దొరికినట్లు తొక్కిపడేశాయి. కొన్ని చెట్లకు పెద్ద పెద్ద అరటి గెలలు కూడా ఉన్నాయి. ఏనుగులు... ఆ చెట్టు, ఈ చెట్టు అని తేడా లేకుండా అన్ని చెట్లనూ నేల కూల్చి... నానా బీభత్సం చేసి... వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోయాయి. ఆ తర్వాత రైతులు అరటి తోటలోకి ప్రవేశించారు. వాళ్లకు ఆశ్చర్యం వేసింది. ఆ తోటలో... ఒక చెట్టు మాత్రం అలాగే ఉంది. దానికి ఎలాంటి సమస్యా రాలేదు.

    "అన్ని చెట్లనూ కూల్చేసిన ఏనుగులు... ఇదొక్కటీ ఎందుకొదిలేశాయి?"... అనుకున్నారు. అంతలో... ఆ చెట్టుపై నుంచి కొన్ని పక్షి పిల్లల అరుపులు వినిపించాయి. దాంతో రైతులకు అసలు విషయం అర్థమైంది. ఆ పక్షి పిల్లలకు హాని జరగకూడదని... ఆ ఏనుగులు... ఆ చెట్టును వదిలేశాయన్నమాట. ఈ విషయం తెలిసి రైతులు ఆశ్చర్యపోయారు. మనుషుల్లో స్వార్థం పెరుగుతోంది కానీ... మూగజీవాల్లో కాదు అనుకున్నారు. ఇప్పుడీ వీడియోని మీరూ చూడండి.





    ఇది కూడా చదవండి: Anti-Inflammatory Foods: శరీరంలో వేడి పెరుగుతోందా... ఈ ఆహారం తీసుకోండి

    బాగున్నాయి కదా పక్షి పిల్లలు. ఆ చెట్టును కూల్చేసి ఉంటే... అవి చచ్చిపోయేవే. ఆ విషయం తెలిసే ఏనుగులు ఆ చెట్టును టచ్ చెయ్యలేదు. ప్రకృతిని ఎలా కాపాడాలో ఏనుగులకు తెలుసు. అవి చాలా తెలివైనవి. అన్నీ తెలిసి మనిషి మాత్రం ప్రకృతిని సర్వనాశనం చేస్తూనే ఉన్నాడు. అందుకే ఈ వీడియో వైరల్ అయ్యింది. ఆ ఏనుగులపై ప్రశంసల జల్లు కుంభవృష్టిలా కురుస్తోంది. ఇంతకీ అవి ఏ పిల్లలో చెప్పలేదు కదూ... రామచిలుకలు.
    Published by:Krishna Kumar N
    First published: