• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • VIRAL VIDEO HAS SURFACED ON THE INTERNET RECENTLY SHOWING HOW A CROCODILE HUNTS DEER SRD

Viral Video : మూర్ఖత్వంతో ప్రాణాల్ని బలి చేసుకున్న జింక.. వేటాడి..వెంటాడి.. మట్టుబెట్టిన మొసలి..

Viral Video : మూర్ఖత్వంతో ప్రాణాల్ని బలి చేసుకున్న జింక.. వేటాడి..వెంటాడి.. మట్టుబెట్టిన మొసలి..

మూర్ఖత్వంతో ప్రాణాల్ని బలి చేసుకున్న జింక.. వేటాడి..వెంటాడి.. మట్టుబెట్టిన మొసలి.. (Photo Credit : Twitter)

మొసలి పట్టు గురించి అందరికి తెలిసిందే. నీటిలో ఉన్నప్పుడు దాని బలం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏనుగును సైతం తన నోటితో కట్టిపడేయగల బలశాలి. అలాంటి మొసలి తో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిందే. మొసలి నుంచి తప్పించుకోవాలంటే బలం లేదా వ్యూహాన్ని ఉపయోగించాలి. ఒకవేళ అవి రెండింటిని మిస్సయితే మాత్రం మొసలికి ఆహారం అయిపోవాల్సిందే.

  • Share this:
    అడవిలో జంతువులు ఏవైనా సరే... వేటాడేటప్పుడు కచ్చితంగా వ్యూహం ఉండాలి. లేదంటే ఆహారం దొరకదు. అందులోనూ మొసలి లాంటి వాటికి చేపలైతే ఈజీగా దొరుకుతాయి గానీ... నేలపై ఉండే జంతువులు మాగ్జిమం ఎస్కేప్ అవుతాయి. వేటాడేటప్పుడు బలమైనా ప్రయోగించాలి లేదా... వ్యూహమైనా ఉపయోగించాలి. ఆ రెండూ లేనప్పుడు ఆకలే మిగులుతుంది. మరోవైపు జంతువులు కూడా మొసలి నుంచి తప్పించుకోవడానికి బలం లేదా వ్యూహాన్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఇక, మొసలి పట్టు గురించి అందరికి తెలిసిందే. నీటిలో ఉన్నప్పుడు దాని బలం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏనుగును సైతం తన నోటితో కట్టిపడేయగల బలశాలి. అలాంటి మొసలి తో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిందే. మొసలి నుంచి తప్పించుకోవాలంటే బలం లేదా వ్యూహాన్ని ఉపయోగించాలి. ఒకవేళ అవి రెండింటిని మిస్సయితే మాత్రం మొసలికి ఆహారం అయిపోవాల్సిందే. తాజాగా ఈ రెండూ ఉపయోగించడంలో తడబడిన ఓ జింక మొసలి నోటికి చిక్కింది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    ఇందులో ఓ జింక మొసలిని తప్పించుకునేందుకు నీటిలోకి దూకుతుంది. కానీ ఆ నిర్ణయమే మూర్ఖత్వానికి ప్రతీకగా నిలిచింది. మొసలిని నీటి రారాజుగా పిలుస్తుంటారు. నీటిలో ఉంటే దానికి చిక్కడం సింపుల్. సరిగ్గా అదే అవకాశాన్ని జింక ఇచ్చింది. మొసలిని తప్పించుకునేందుకు జింక నీటిలోకి దూకగా.. అదే అదనుగా చూసుకుని ఆ మొసలి సరిగ్గా నది మధ్యలో ఆ జింకను వేటాడి వెంటాడి మట్టుబెడుతుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


    ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ అంగుస్వామి ట్విట్టర్ వేదికగా నెటిజన్లతో పంచుకున్నారు. " ధైర్యానికి, మూర్ఖత్వానికి మధ్య సన్నని గీత ఉందని, దానిని ఎప్పటికీ దాటవద్దని" క్యాప్షన్‌ను ఈ వీడియోకు ఇచ్చారు. ట్వీట్ చేసిన కొద్దిసేపటికే ఈ వీడియో తెగ వైరల్ గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు కురిపిస్తున్నారు.
    Published by:Sridhar Reddy
    First published:

    అగ్ర కథనాలు