Video: ప్రపంచంలోనే అత్యంత కాంతివంతమైన ఫ్లాష్ లైట్. గిన్నీస్ రికార్డ్

Video: ప్రపంచంలోనే అత్యంత కాంతివంతమైన ఫ్లాష్ లైట్. గిన్నీస్ రికార్డ్ (image credit - youtube)

Viral Video: ఆ ఫ్లాట్‌లైట్‌ని మామూలు కళ్లతో చూడలేం. ఆ కాంతిని మన కళ్లు భరించలేవు. అంత పవర్ ఫుల్ కాంతితో దాన్ని తయారుచేశారు. పూర్తి వివరాలు ఇవీ.

  • Share this:
    Viral Video: గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు ఓ వీడియోను షేర్ చేశారు. అది ప్రపంచంలోనే అత్యంత కాంతివంతమైన ఫ్లాట్ లైట్‌కి సంబంధించినది. దీన్ని హ్యాక్ స్మిత్ ఇండస్ట్రీస్ (Hacksmith Industries) తయారుచేసింది. దీనికి బీస్ట్ ఆఫ్ ఓ బీమ్ (beast of a beam) అని పేరు పెట్టింది.

    ఈ కంపెనీ... ఇంజినీరింగ్, రీసెర్చ్ కంపెనీ. అందువల్ల అత్యంత కాంతివంతమైన భారీ టార్చ్‌లైట్ తయారుచెయ్యాలి అనుకుంది. అది ప్రపంచంలో ఇప్పటివరకూ తయారుచెయ్యనంత ఎక్కువ కాంతితో ఉండాలని టార్గెట్ పెట్టుకుంది. అందుకోసం పవర్‌ఫుల్ లైట్ తయారుచేసింది. దాని నుంచి 5,00,000 ల్యూమెన్స్ కాంతి విడుదల అవుతోంది. సూర్యుడి కాంతిలో చందమామ, నక్షత్రాలు ఎలాగైతే కనిపించకుండా పోతాయో... ఈ ఫ్లాష్ లైట్ కాంతిలో కూడా అలాగే ఏవీ కనిపించట్లేదు. ఈ కాంతిని చూడాలంటే... కళ్లకు బ్లాక్ గ్లాసెస్ పెట్టుకోక తప్పదు

    ఈ లైట్ వీడియోని ఇక్కడ చూడండి.

    క్రిస్, జేమ్స్ కలిసి ఈ ప్రయోగాత్మక లైట్ తయారు చేశారు. వీడియో ద్వారా తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ రికార్డును నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. త్వరలో మరిన్ని రికార్డులు సాధించాలి అని కోరుతున్నారు.

    ఇది కూడా చదవండి:Video: బురదలోంచి వెళ్లేటప్పుడు జాగ్రత్త. ఈ వీడియోలో ఏమైందంటే..

    కొందరు కామెడీ కామెంట్లు కూడా పెడుతున్నారు. "ఇలాంటి లైట్ నాకు కావాలి... ఇది ఉంటే... బెడ్‌ రూమ్‌లో బయటపడకుండా నిద్రపోతాను" అని ఓ యూజర్ చెప్పగా... "బ్రైట్ ఫ్యూచర్ కంటే... ఈ ఫ్లాష్ లైట్ ఎక్కువ కాంతివంతంగా ఉందని" మరొకరు కామెంట్ పెట్టారు.
    Published by:Krishna Kumar N
    First published: