Wedding Videos: సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించిన వీడియోల క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఏదో ఒక ఫన్నీ సంఘటనతో పెళ్లి వీడియోలు వైరల్ అవుతునే ఉన్నాయి. ఇక్కడో పెళ్లి వేడుకలో వరుడి పక్కన కూర్చున్న అతిథి చేసిన పనితో పెళ్లి వేడుక కాస్త వైరల్ గా మారింది.
Grooms Friend Secretly Steals Cash From Money Garland: ప్రస్తుతం సోషల్ మీడియాలో పెళ్లి వీడియోల ట్రెండ్ కొనసాగుతుంది. ఎక్కడ వెడ్డింగ్ లో ఎలాంటి సంఘటన జరిగిన నిముషాల్లో వైరల్ గా మారిపోతున్నాయి. నెటిజన్లు కూడా ఇలాంటి వెరైటీ వీడియోలను చూడటానికి ఆసక్తి కనబరుస్తున్నారు. పెళ్లిని ప్రతి ఒక్కరు తమ పరిధిలో గ్రాండ్ గా చేసుకొవాలని ప్లాన్లు వేస్తుంటారు. ఇక పెళ్లిలో ప్రధానంగా.. వధువు, వరుల ఎంట్రీకి సంబంధించిన ఎన్నో వీడియోలు వైరల్ గా మారాయి.
కొన్ని వెడ్డింగ్ లలో.. పెళ్లి కూతురు బుల్లెట్ బండితో మండపానికి చేరుకుంటే.. మరికొన్ని చోట్ల ఎడ్ల బండిపై వధువు వేడుకగా వేదికను చేరుకుంటుంది. కొన్ని చోట్ల మండపంలో జరిగిన సరదా సన్ని వేశాలు, ఎమోషనల్ సంఘటనలతో ఆ పెళ్లి వేడుక వైరల్ అయ్యాయి. కొన్ని చోట్ల వధువరులు, క్రేన్ లలో పెళ్లి మండపానికి గ్రాండ్ గా ఇచ్చిన అనేక వీడియోలు వైరల్ అయ్యాయి. కొన్ని పెళ్లిళ్లలో వధువరులు.. వరమాలు వేసుకునేటప్పుడు ఒకరిపై మరొకరు చూపించిన చిరు కోపాలతో ఆ పెళ్లి వేడుకలు వైరల్ గా మారిన విషయం తెలిసిందే.
వధువుకు.. వరడు ఇచ్చిన సర్ ప్రైజ్ గిఫ్ట్ లు.. అది చూసి వధువు మురిసి పోయి ఎమోషనల్ అయిన పలు వీడియోల నెట్ లో దర్శన మిస్తున్నాయి. ఇక కొన్ని సార్లు .. పెళ్లిలో అక్కడక్కడ చోరీలు జరుగుతుంటాయి. వధువరులు.. పెళ్లి కార్యక్రమంలో బిజీగా ఉంటే.. చోరశిఖామణులు తమ పని తాము కానిస్తారు. ఇలాంటి ఫన్నీ సంఘటనతో ఈ పెళ్లి వైరల్ గా మారింది.
పూర్తి వివరాలు.. ఇక్కడ ఒక ముస్లిం పెళ్లి వేడుక జరుగుంది. సాధారణంగా కొందరు వరుడి మెడలో నోట్ల కట్టలను పూల లాగా దారానికి కట్టి వేస్తారు. ప్రస్తుతం ఇక్కడ వరుడికి కూడా నోట్లను దారానికి చుట్టి మెడలో వేశారు. రకరకాల నోట్లు అతని మెడలో ఉన్నాయి. ఈ పెళ్లివేడుకకు.. వరుడి తరపు బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. ఇంతలో వరుడి పక్కన ఒక యువకుడు కూర్చున్నాడు.
వరుడు వేరే వాళ్లతో మాట్లాడుకుంటూ బిజీగా ఉన్నాడు. వరుడు నోట్ల దండను తన ముందు పెట్టుకున్నాడు. ఈ క్రమంలో.. పక్కన కూర్చున్న ఒక యువకుడు.. తన చేతివాటం చూపించాడు. మెల్లగా కొన్ని నోట్లను తెంపి.. వెంటనే తన జేబులో పెట్టేసుకున్నాడు. ఇక నాకేం తెల్వదు.. నేనేం చేయలా అంటూ మోహం తిప్పేసుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీన్ని చూసిన నెటిజన్ లు.. పెళ్లికి వచ్చి ఇదేం పాడుపని అంటూ తిటిపోస్తున్నారు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.