Home /News /trending /

VIRAL VIDEO GROOM TOUCHES BRIDES FEET DURING WEDDING INTERNET LOVES THE BEAUTIFUL GESTURE PAH

పెళ్లిలో కాబోయే భర్త తింగరిపని.. బిత్తర పోయిన వధువు.. ఏంచేశాడో తెలుసా..?.. వీడియో వైరల్..

ఎమోషనల్ అయిన వరుడు

ఎమోషనల్ అయిన వరుడు

Wedding video: కొత్త జంట అందంగా ముస్తాబయ్యారు. బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున అటెండ్ అయ్యారు. పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. వధు, వరులు ఒకరి మెడలో మరోకరు జయమాల వేసుకున్నారు.

పెళ్లి (Wedding) వేడుకల ట్రెండ్ నడుస్తోంది. నేటి యువత ఒకప్పటిలా సాదాసీదగా పెళ్లిళ్లు చేసుకొవడం లేదు. తమ వివాహ వేడుకను కలకాలం గుర్తుండిపోయేలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దీనికోసం ఎంత ఖర్చు అయిన భరిస్తున్నారు. చుట్టాలు, బంధువులు, డీజేలు, మాస్ స్టెప్పులు, స్పెషల్ ప్రొగ్రామ్ ల మధ్య ఉండేలా ప్లాన్ లు వేసుకుంటున్నారు. కొందరు పెళ్లి వేడుకును గ్రాండ్ గా చేసుకుంటే... మరికొంత మంది సాంప్రదాయ బద్దంగా కూడా చేసుకుంటున్నారు. పెళ్లిలో కొందరి.. పద్దతులు, ఆచారాలు వేర్వేరుగా ఉంటాయి.

కొన్ని సార్లు.. అవి మనకు వెరైటీగా కూడా అన్పిస్తుంటాయి. కొన్ని పెళ్లిళ్లలో.. గన్ తో గాలిలో కాల్పులు జరుపుతారు.. మరికొన్ని పెళ్లి వేడుకలలో.. మండపానికి వెరైటీగా ఎంట్రీ ఇస్తుంటారు. ఇలాంటి అనేక పెళ్లి (Marriage) ఘటనలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. మరోక వెరైటీ పెళ్లి వీడియో (Viral video)  ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తుంది.


పూర్తి వివరాలు.. కాబోయే భార్యభర్తలు అందంగా తయారయ్యారు. గ్రాండ్ గా కాస్టూమ్స్ వేసుకున్నారు. బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున హజరయ్యారు. ఇంతలో.. పెళ్లివేడుక చుట్టాల మధ్య అట్టహసంగా ప్రారంభమైంది. ఈ క్రమంలో.. వరమాల కార్యక్రమంలో కూడా జరిగింది. అయితే, పెళ్లి కొడుకు చేసిన పనికి, వధువు షాక్ కు గురయ్యింది. వరుడు.. తన భార్య మెడలో వరమాల వేశాడు.

ఆ తర్వాత.. వెంటనే ఆమె పాదాలకు నమస్కరించాడు. దీంతో వధువు ఖంగుతింది. ఆ తర్వాత.. ఎమోషనల్ అయ్యింది. ఉత్తరాదిన కొంత మంది తమ భార్యలో దేవతను చూసుకుంటారు. ఆమె రాకతో తమకు అన్ని విధాల కలిసి వస్తుందని భావిస్తారు. అందుకే.. ఇలా భార్యకు దండం పెడతారు. మరికొంత మంది తమ కూతుళ్ల పాదాలకు కూడా నమస్కరిస్తుంటారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట (Social media) వైరల్ గా మారింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Marriage, Trending video, Viral Video, Wedding

తదుపరి వార్తలు