హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Video: వీడేం వరుడండీ... వేస్టుగాడు... తిట్టిపోస్తున్న నెటిజన్లు

Video: వీడేం వరుడండీ... వేస్టుగాడు... తిట్టిపోస్తున్న నెటిజన్లు

వీడేం వరుడండీ... వేస్టుగాడు... తిట్టిపోస్తున్న నెటిజన్లు (image credit - instagram)

వీడేం వరుడండీ... వేస్టుగాడు... తిట్టిపోస్తున్న నెటిజన్లు (image credit - instagram)

Groom Misbehaviour: వధువును ప్రేమగా పెళ్లి చేసుకోవాల్సిన అతను... అత్యంత దారుణంగా అవమానించాడు. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అతన్ని మెడపట్టి బయటకు గెంటమంటున్నారు.

సాధారణంగా పెళ్లి వేడుకలు ఆనందంగా జరగాలన్నా.. వధూవరుల మధ్య సఖ్యత ఉండాలన్నా.. ఒకరినొకరు గౌరవించుకోవడం ఎంతో అవసరం. ఒకరి పట్ల ఒకరికి గౌరవం లేకపోతే ఆ వివాహ బంధం ఎక్కువ కాలం కొనసాగదు. ఇదే చాలామంది జంటలు విడాకులు తీసుకోవడానికి కారణం అవుతుంది. ఎన్ని కారణాలు ఉన్నా.. ఒకరిపై మరొకరికి ప్రేమ, గౌరవం లేకపోవడం అనేది అన్ని సమస్యలకు కారణంగా మారుతుంది. అయితే ఇలాంటి విషయాలను ఏమాత్రం పట్టించుకోకుండా.. ఓ వరుడు పెళ్లి పందిరిలోనే వధువుని అవమానించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నెటిజన్లంతా ఈ వరుడిని తిట్టిపోస్తున్నారు. అంత ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోకుండా ఉండాల్సిందని సలహాలు కూడా ఇస్తున్నారు. ఇంతకీ ఆ వ్యక్తి ఏం చేశాడో తెలియాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఉన్న వ్యక్తులెవరో ఎవరికీ తెలీదు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందన్న విషయాన్ని కూడా ఆ వీడియో పెట్టిన వ్యక్తి తెలియజేయలేదు. ఈ వీడియోలో వధూవరులు పెళ్లిలో వరమాల కార్యక్రమం కోసం ఎదురెదురుగా నిలబడ్డారు. ఇద్దరూ ఒకరి మెడలో మరొకరు ఆ పూల మాలలు వేయాల్సి ఉంటుంది. అయితే నెమ్మదిగా వేయాల్సిన దండను ఏమాత్రం ఆసక్తి లేనట్లుగా విసిరి పడేశాడు ఆ వరుడు. దీంతో ఆ దండ ఆమె కాళ్ల దగ్గర పడింది. దాన్ని తిరిగి తీసినా మళ్లీ వేయడానికి ఆ వరుడు ఆసక్తి చూపించలేదు. ఈ సంఘటనను చూసి చుట్టుపక్కల ఉన్నవారంతా ఎంతో షాక్ అయ్యారు. అందరి ముందు వరుడు ఇలా వ్యవహరించడం చూసి వధువు నిస్సహాయంగా నిలబడిపోవడం కూడా మనం చూడొచ్చు.

ఆ వీడియో ఇక్కడ చూడండి.


ఇది కూడా చదవండి: జోరుగా పెళ్లి... అంతలో వధువుకు వరుడి ముద్దు.. వీడియో వైరల్

ఈ వీడియోని నిరంజన్ ఎం అనే వ్యక్తి పోస్ట్ చేశాడు. వధువు జీవితం చీకటిమయమైంది అన్న క్యాప్షన్‌తో అతడు పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్‌గా మారింది. దాదాపు 8 వేల కంటే ఎక్కువ మంది ఈ వీడియోని చూశారు. ఎంతోమంది కామెంట్ల ద్వారా తమ కోపాన్ని ప్రకటిస్తున్నారు. ‘పాపం.. ఆ అమ్మాయి ఏం చేసిందని ఇంత అవమానం భరించాలి?’ అని ఒక వ్యక్తి కామెంట్ చేస్తే.. ‘నేను అక్కడికి వస్తే నిన్ను ఎలా కొడతానో నాకే తెలీదు’ అని మరొకరు కామెంట్ చేశారు. ఇష్టం లేకపోతే వదిలేయాలి కానీ పెళ్లి చేసుకుంటూ ఇలా తనని అవమానించకూడదని చాలామంది కామెంట్లు చేశారు. ఇలాంటి వ్యక్తిని మెడపట్టి గెంటేయకుండా ఇలా పెళ్లి జరిపించడం ఏంటని చాలామంది ప్రశ్నిస్తున్నారు.

First published:

Tags: Viral, VIRAL NEWS, Viral Video, Viral Videos

ఉత్తమ కథలు