Video: ఈ అమ్మాయిలకు ఏమైంది? ఈ రేంజ్‌లో కొట్టేసుకుంటున్నారు?

ఈ అమ్మాయిలకు ఏమైంది? (image credit - instagram)

Viral Video: జనరల్‌గా నడి రోడ్డుపై అబ్బాయిలు, కుర్రాళ్లు కొట్టుకోవడం చూస్తుంటాం... ఒక్కోసారి తాగుబోతులు కొట్టుకుంటారు. కానీ ఈ వీడియోలో అమ్మాయిలు చితక్కొట్టేసుకున్నారు.

  • Share this:
    Viral Video: అబ్బాయిలు కొట్టుకుంటే... ఎవరో ఒకరు గెలుస్తారు గానీ... అమ్మాయిలు కొట్టుకుంటే... ఆ ఫైట్ కొనసాగుతూనే ఉంటుంది అనేది ఓ నానుడి. ఎందుకంటే... రెండువైపులా బలంగానే ఎదుర్కొంటారు. అలాంటి ఓ ఫైటింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో ఓ స్కూటీ దగ్గర రోడ్డుపై చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. వారిలో ఇద్దరు అమ్మాయిల మధ్య సడెన్‌గా ఫైటింగ్ మొదలైంది. నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటూ... ఇద్దరూ డ్రెస్సులు పట్టుకొని... డిష్షుం డిష్యుం మొదలుపెట్టారు.

    ఈ ఫైట్ చూసిన ఇతర అమ్మాయిలు... వాళ్లను ఆపుదామని అనుకున్నారు. కానీ ఆపలేదు. వీళ్లెప్పుడూ ఇంతే అన్నట్లుగా వారి హావభావాలు ఉన్నాయి. ఇలా ఆ ఇద్దరు అమ్మాయిలు... ఆపకుండా కొట్టుకుంటుంటే... మిగతా అమ్మాయిలు... తమకు సంబంధం లేనట్లు వ్యవహరించారు. ఈ వీడియోని చాలా మంది చూస్తున్నారు.

    ఆ వీడియోని మీరు ఇక్కడ చూడండి.








    View this post on Instagram






    A post shared by @kaintgalbaatt





    మిగతా అమ్మాయిలు పోలీసులకు కాల్ చెయ్యాలని అనుకుంటున్న మాటలు ఈ వీడియోలో వినవచ్చు. ఇంతకీ వాళ్లు ఎందుకు కొట్టుకున్నారన్నది ఎవరికీ తెలియదు. ఇన్‌స్టాగ్రామ్‌లోని కైంత్‌గల్బాత్ అకౌంట్‌లోని ఈ వీడియోని చూసి నెటిజన్లు మాత్రం రకరకాలుగా స్పందిస్తున్నారు. ఒకరైతే గుడ్ జాబ్ అని వారి ఫైటింగ్‌ని సెటైరికల్‌గా మెచ్చుకున్నారు.

    ఇది కూడా చదవండి: Video: బస్ పైకి ఎక్కిన ప్రయాణికులు.. కొంత దూరం వెళ్లాక షాక్

    ఈమధ్య ఇలాంటిదే మరో వీడియో కూడా వైరల్ అయ్యింది. అందులో కూడా అమ్మాయిలు ఇలాగే కొట్టుకున్నారు.

    ఆ వీడియోని ఇక్కడ చూడండి.








    View this post on Instagram






    A post shared by Sa Tu SaiNi (@satu_saini90)





    ఇలా అమ్మాయిలు కొట్టేసుకుంటున్న వీడియోలను నెటిజన్లు బాగా చూస్తున్నారు.
    Published by:Krishna Kumar N
    First published: