తల్లికి తన పిల్లలపై ఎనలేని ప్రేమ ఉంటుంది. అందుకే పెద్దలు కాకి పిల్ల కాకికి ముద్దు అని అంటుంటారు. అంటే ఏ తల్లి కైన (Mothers love) తన కన్న బిడ్డ ఏలా ఉన్న ఆమెకు ముద్దు అని అర్థం. నోరు లేని మూగ జీవాలు సైతం వాటి పిల్లల జోలికి ఎవరైన వస్తే.. ఒక రేంజ్ లో ఎదిరిస్తాయి. అడవిలో సింహలు, పులులు, చిరుతలు వంటి క్రూర జంతువులు, సాధు జంతువులైన దున్నపోతులు, జింకల జోలికి వస్తే ఎదిరిస్తాయి. తమ కన్న బలవంత జీవులైనప్పటికి కూడా తమ కడుపున పుట్టిన జీవిని కాపాడుకొవడానికి తాప త్రయపడుతుంటాయి.
ఇక కోతులు కొన్ని సందర్భాలలో తమలో తాము దాడులు చేసుకుంటారు. పొరపాటున వేరే కోతి గాని, మనిషి గాని, ఇంకెవరైన తమపై దాడిచేస్తే చీల్చి చెండాడుతాయి. ఇక మనిషుల్లో కూడా తల్లులు తమ పిల్లలపై ఎనలేని ప్రేమానురాగాలు కల్గి ఉంటారు. ఇలాంటి తల్లి ప్రేమ ఘటనలు ఇప్పటికే ఎన్నో వైరల్ అయ్యాయి. మనుషుల్లోను.. అమ్మ అనిపించుకొవడానికి కొంత మంది ఎలాంటి శస్త్రచికిత్సలకైన వెనకాడరు. అయితే, నోరులేని ఒక తల్లి తన పెట్టిన గుడ్లకు హనికల్గించడానికి ట్రైచేసిన ఒక యువతిపైన దాడిచేసింది.
I wanna punch this woman so badly https://t.co/OFi2Ml1paV
— Ms Perfectly Fine ☕️💌🩰🐇🌷 (@hoopshoota) May 25, 2022
పూర్తి వివరాలు.. ఒక యువతి దూరం నుంచి నెమలిపెట్టిన గుడ్లను చూసింది. వెంటనే పరుగెత్తుకుంటూ వచ్చింది. పాపం... నెమలి గుడ్లపై కూర్చుని ఉంది. యువతి మాత్రం వేగంగా.. నెమలిని అమాంతం పైకెత్తి అల్లంత దూరంలో పడేస్తుంది. గుడ్లను దొంగిలించడానికి ప్రయత్నిస్తుంది. దీంతో చిర్రెత్తుకొచ్చిన నెమలి.. ఎగిరి యువతిని కింద పడేస్తుంది. ఆమెపై దాడిచేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీన్నిచూసిన నెటిజన్ లు కర్మఫలం అనుభవించాల్సిందే.. ఇన్ స్టాంట్ ఖర్మ అంటే ఇదే నేమో, ఈ అమ్మాయిని లాగిపెట్టి కొట్టాలనుంది అంటూ కామెంట్ లు పెడుతున్నారు.
ఇదిలా ఉండగా 80 ఏళ్ల బామ్మ జిమ్ చేస్తు అందరిని షాక్ కు గురిచేసింది.
ఒక బామ్మ తన మనవడు జిమ్ చేస్తుండగా టెర్రస్ మీదకు వెళ్లింది. ఆమెకు 82 ఏళ్లు. తన మనవడు ఆమెకు సవాల్ విసిరాడో.. మరేంటో కానీ.. 80 కేజీల డంబెల్ ను ఎత్తింది. ఏ మాత్రం ఒత్తిడి లేకుండా డంబెల్ ను పైకి ఎత్తి ఆ తర్వాత మెల్లగా కింద పెట్టింది. బామ్మ వర్కవుట్స్ చూసి మనవడు షాక్ కు గురయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. దీన్ని చూసిన నెటిజన్లు.. వావ్... బామ్మ.. భలే వర్కవుట్స్ చేస్తుందంటూ కామెంట్ లు పెడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Viral Video