Home /News /trending /

VIRAL VIDEO GIRL ROTATES BODY 180 DEGREES FLEXIBILITY OF THIS GIRL IS REALLY AMAZING PVN

Viral Video : మనిషా,దెయ్యమా?..బాడీని మొత్తం తిప్పేస్తుంది చూడండి

బాడీని 180 డిగ్రీలు తిప్పేస్తున్న బాలిక

బాడీని 180 డిగ్రీలు తిప్పేస్తున్న బాలిక

Girl rotating body 180 degrees : మనం 90 డిగ్రీస్‌ కి తిప్పడమే కష్టం. కానీ ఓ అమ్మాయి మాత్రం తన బాడీని 180 డిగ్రీస్‌ లో తిప్పి కూర్చుంటోంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Girl rotating body 180 degrees :  తన శరీరాన్ని 180 డిగ్రీస్‌లో తిప్పేస్తూ... వెన్నులో వణుకు పుట్టేలా చేస్తోంది ఓ అమ్మాయి. సాధారణంగా మనం ఎక్కడైనా కూర్చుంటే కాళ్లు కిందకు ఉంటాయి. కాళ్లు ఉన్నవైపే తల, మొండెం కూడా ఉంటాయి. కానీ కాళ్లు ఇటువైపు ఉండి... తల మొండెం వెనక్కి తిరిగి ఉండాలంటే... బాడీని 180 డిగ్రీస్‌లో తిప్పాలి. మనం 90 డిగ్రీస్‌కి తిప్పడమే కష్టం. కానీ ఓ అమ్మాయి మాత్రం తన బాడీని 180 డిగ్రీస్‌ లో తిప్పి కూర్చుంటోంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

ఇన్‌ స్టాగ్రామ్‌ లోని nation.video ఛానెల్‌ లో ఇటీవల పోస్ట్ చేసిన ఈ వీడియోలో.. ఓ అమ్మాయి బ్లాక్ డ్రెస్‌ లో ఓ కుర్చీలో కూర్చొని ఉంది. ఆ అమ్మాయి కాళ్లు కుర్చీ కింద క్లియర్‌ గా కనిపిస్తున్నాయి. కానీ పైన తల కనిపించట్లేదు. తలపై ఉన్న జుట్టు కనిపిస్తోంది. మొండం కూడా తేడాగా కనిపిస్తోంది. అందువల్ల ఫస్ట్ చూడగానే నెటిజన్లు ఏంటిది ఇలా ఉందని ఆశ్చర్యంగా చూస్తుండగా చేతులు కదుపుతూ ఆ అమ్మాయి కెమెరావైపు తిరిగింది.

అప్పటివరకూ 180 డిగ్రీస్‌ లో నడుమును తిప్పి ఉంచిందన్న అసలు విషయం తెలుసుకొని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మనిషా దెయ్యమా అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ఆమె అన్నాబెల్లే అని హాలీవుడ్ హర్రర్ సినిమాల్లోని దెయ్యం బొమ్మను గుర్తుచేశారు మరొకరు. ఆ పాప తన శరీరాన్ని రివర్సులో తిప్పడం చూసి నెటిజన్లలో చాలా మంది ఇది నిజమా, గ్రాఫిక్సా.. చూస్తుంటే నమ్మశక్యంగా లేదు అని అంటున్నారు. ఈ అమ్మాయికి చాలా ఫ్లెక్సిబిలిటీ ఉందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Viral vide

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు