Home /News /trending /

VIRAL VIDEO GIRL HOLDS AND PLAYS WITH SNAKE GETS BITTEN BY IT SEVERAL TIMES PAH

Python: అమ్మబాబోయ్... కొండ చిలువతో కసితిరా కాటు వేయించుకుంటుంది.. వైరల్ వీడియో...

కొండ చిలువతో ఆడుకుంటున్న మహిళ

కొండ చిలువతో ఆడుకుంటున్న మహిళ

Viral video: మహిళ కొండ చిలువను తన చేతిలో పట్టుకుంది. అది విడిపించుకోవడానికి తెగ ట్రై చేస్తోంది. ఈ క్రమంలో ఆమె చేతిని పలుమార్లు కాటు వేసింది.

మనలో చాలా మందికి పాములు, కొండ చిలువలంటే (Snakes)  చచ్చేంత భయం. కొందరైతే వీటి పేరు ఎత్తడానికి కూడా ఇష్టపడరు. పొరపాటున పాము కనిపిస్తే.. భయంతో వణికి పోతుంటారు. ఇక ఆ దరిదాపుల్లోకి వెళ్ళడానికి కూడా సాహసం చేయరు. పాములు.. సాధారణంగా పాడు బడ్డ ఇళ్లలో, చల్లగా ఉండే ప్రదేశంలో, పెరడులలో ఉంటాయి. అవి పొలాల్లో ఎక్కువగా ఉంటాయి. పాములు, ఎలుకల కోసం మన ఇళ్ల లోనికి వస్తుంటాయి. అప్పుడు ఒక్కొసారి మనుషుల కంట పడతాయి.

సాధారణంగా పాములు మనుషుల అలజడి వినిపిస్తే.. అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోతాయి. కానీ కొన్ని సార్లు.. మనుషులు పాము కాటుకు (snake bite) గురౌతుంటారు. కొందరు పాములు కనిపిస్తే.. స్నేక్ సోసైటీ వారికి సమాచారం అందిస్తారు. వారు పాములను పట్టుకుని అడవులలో వదిలేస్తారు. కొన్ని సార్లు.. పాములతో ఆడుకునే క్రమంలో అనుకొని సంఘటనలు జరిగి, అవి కాటువేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి. కొందరు పాములు కాటు వేసిన కూడా.. ఏమాత్రం ప్రాణాపాయం లేకుండా సరైట్ సమయంలో ట్రీట్ మెంట్ తీసుకుని బతికిపోయారు. ఇలాంటి అనేక ఘటనలు వార్తలలో నిలిచాయి.






మరికొందరు దీనికి భిన్నంగా (Pythons)  కొండ చిలువలను, పాములను తమ ఇళ్లలోనే పెంచుకుంటారు. ఎంచక్కా.. వాటిని తమ ఒళ్ళో పెట్టుకుంటూ.. బెడ్ పైన తమ ఇంట్లో మనుషుల మాదిరిగా పెట్టుకుంటారు. అవి కూడా వారికి ఎలాంటి అపాయం తలపెట్టవు. ఈ కోవకు చెందిన అనేక వీడియోలు (Viral video) ఇప్పటికే సోషల్ మీడియాలో  (Social media) వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఈ కోవకు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు.. ఒక మహిళ భయంకరమైన కొండ చిలువను (Python)  తన చేతిలో పట్టుకుంది. అది చూడటానికి ఎంతో భయంకరంగా ఉంది. అది మహిళ చేతిలో నుంచి విడిపించుకొవడానికి ట్రై చేస్తుంది. ఈ క్రమంలో మహిళ చేతిని పదే పదే కాటు వేస్తుంది. అయినప్పటికే ఆమె ఏమాత్రం భయం లేకుండా, ఏదో దొమ కుట్టినట్లు అసలు పట్టించుకొవట్లేదు. ఆమె చేతిని, వేళ్లను కాటు వేస్తుంది. చూడటానికి ఎంతో భయంకరంగా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Python, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు