హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

video: సీలింగ్‌లో ఇరుక్కున్న బాలిక తల.. హర్రర్ మూవీలా ఉందన్న నెటిజన్లు!

video: సీలింగ్‌లో ఇరుక్కున్న బాలిక తల.. హర్రర్ మూవీలా ఉందన్న నెటిజన్లు!

సీలింగ్‌లో ఇరుక్కున్న బాలిక తల (image credit - youtube))

సీలింగ్‌లో ఇరుక్కున్న బాలిక తల (image credit - youtube))

Viral video: ఇది చాలా చిత్రమైన ఘటన. ఆ బాలిక తల సీలింగ్‌లో ఎలా ఇరుక్కుంది. రివుర్సులో ఎలా ఇరుక్కుంది అనే ప్రశ్నలకు వీడియో ద్వారా సమాధానం లభిస్తోంది.

  చైనాలోని ఆ ఇంట్లో ఒక్కసారిగా అరుపులు కేకలు వినిపించాయి. పక్క గదుల్లోని తల్లిదండ్రులు హడావుడిగా అరుపులు వినిపిస్తున్న గదిలోకి వచ్చారు. అక్కడ బాలిక కనిపించలేదు. మరి అరుపులు ఎలా వస్తున్నాయి అనుకుంటుంటే... సీలింగ్ నుంచి బాలిక (girl)... అరుస్తూ... తాను సీలింగ్‌లో ఇరుక్కుపోయానని చెప్పింది. తల ఎత్తి చూసిన పేరెంట్స్ షాక్ అయ్యారు. అచ్చం అరుంధతి (Arundhati) సినిమాలో దెయ్యం సీన్ లాంటి దృశ్యం వారికి కనిపించింది. అదేంటి అలా ఇరుక్కుపోయింది.... వామ్మో అనుకుంటూ... వెంటనే ఫైర్ సిబ్బంది (Fire station)కి కాల్ చేశారు.

  గిఝౌ ప్రావిన్స్‌... పుడింగ్ కౌంటీలోని ఆ ఇంటి ఫస్ట్ ఫ్లోర్ (first floor) రూంలో ఆ బాలికకు ఓ చిన్న కన్నం కనిపించింది. అక్కడ ఎక్స్‌ట్రాక్షన్ ఫ్యాన్ సెట్ చేద్దామని అనుకొని... చెయ్యకుండా కన్నాన్ని అలాగే వదిలేశారు.

  ఆ బాలికకు ఈ విషయం తెలియదు. అక్కడ కన్నం ఎందుకుందా అని అందులో తల పెట్టింది. అంతే తల అలా లోపలికి వెళ్లి ఇరుక్కుపోయింది. తిరిగి పైకి వద్దామంటే కుదరట్లేదు. దాంతో కింద పడిపోతానేమో అని భయపడి అరుపులు, కేకలు పెట్టింది.

  అగ్నిమాపక సిబ్బంది కూడా ఇంట్లోకి రాగానే సీలింగ్‌కి ఉన్న పాప తలను చూసి షాక్ అయ్యారు. దెయ్యం సినిమాల్లోలాగా ఉందే అనుకున్నారు. వెంటనే ఫ్లోర్ పైకి వెళ్లి... పాపకు ధైర్యం చెప్పారు. తల ఎలా దూర్చిందో అలాగే వెనక్కి తీసేద్దాం అనుకున్నారు. అది సాధ్యం కాలేదు. దాంతో... సీలింగ్ కన్నం సైజు పెంచుదామనుకున్నారు. అదీ కుదరలేదు. దాంతో వెజిటబుల్ ఆయిల్ (vegetable oil) తలకు రాసి... మెలమెల్లగా పైకి లాగుతూ... మొత్తానికి సక్సెస్ అయ్యారు.

  ఆ వీడియో ఇక్కడ చూడండి

  ఇది రొటీన్ వీడియో కాదు కదా... అందుకే నెటిజన్లకు ఇది బాగా నచ్చింది. కొత్తగా ఉంది అంటున్నారు. హర్రర్ సినిమా చూసిన ఫీల్ కలిగింది అంటున్నారు.

  ఇది కూడా చదవండి: Video: వీడు మామూలోడు కాదు.. తేనెటీగల్నే మోసం చేసి తేనె పట్టుకుపోతున్నాడు!

  ఈ ఆపరేషన్ మొత్తం 40 నిమిషాలు జరిగింది. ఫైర్ ఫైటర్స్ వచ్చేటప్పటికే గంట నుంచి పాప తల అలాగే ఉందట. అందువల్ల పాపను రక్షించాక ఆస్పత్రికి తరలించారు. లక్కీగా ఏ గాయాలూ కాలేదు. సురక్షితంగా ఉంది.

  మన ఇళ్లలో కూడా పేరెంట్స్ ఏదో పనిలో ఉన్నప్పుడు పిల్లలు ఏదో ఒకటి చేస్తుంటారు. అస్తమానూ వాళ్లనే గమనిస్తూ ఉండటం తల్లిదండ్రులకు సాధ్యం కాదు. తీరా ఏదైనా అయినప్పుడు టెన్షన్ పడేది పేరెంట్సే. అందుకే ఈ వీడియోని పేరెంట్స్ ఎక్కువగా చూస్తున్నారు. సోషల్ మీడియాలో  తమ తమ అనుభవాల్ని కామెంట్స్ రూపంలో చెబుతున్నారు.

  Published by:Krishna Kumar N
  First published:

  Tags: China, Viral, VIRAL NEWS, Viral Video, Viral Videos

  ఉత్తమ కథలు