• Home
  • »
  • News
  • »
  • trending
  • »
  • VIRAL VIDEO FULL WHISKY BOTTLE FOUND IN A FISH ITS RELATED VIDEO GOES VIRAL ON SOCIAL MEDIA HERE YOU CAN WATCH THIS NK

Viral video: చేప పొట్టలో సీల్ విప్పని విస్కీ బాటిల్!... పండగ చేసుకున్న మత్స్యకారులు

చేప పొట్టలో సీల్ విప్పని విస్కీ బాటిల్ (image credit - youtube)

Viral video: నక్క తోకని తొక్కారని అంటారే... మద్యం బాటిల్ చూశాక... ఆ మత్య్సకారులు అలాగే ఫీల్ అయ్యారు. తమకు ఎక్కడో సుడి ఉందనీ... అందుకే కొత్త విస్కీ బాటిల్ తమకు దక్కిందని సంబరపడ్డారు.

  • Share this:
    ఓ జాలరికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు టిక్‌టాక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో అతను ఓ భారీచేపను వలవేసి పట్టుకున్నాడు. తర్వాత చేపను సగనికి కొయ్యగా... అందులో విస్కీ బాటిల్ ఉంది. అతనితోపాటూ.. బోటులో ఉన్నవారు షాక్ అయ్యారు. ఎందుకంటే... ఆ విస్కీ బాటిల్ ఇంక ఓపెన్ చెయ్యలేదు. కొత్త బాటిల్ లా ఉంది. అలాంటి బాటిల్‌ని ఆ చేప మింగేసిందనీ... అది తమకు దక్కడం తమ అదృష్టమని జాలర్లు అంటున్నారు. ఐతే... ఆ ఇద్దరు జాలర్లు చేపను కోసినప్పుడు సముద్రంలో ఉన్నారా... లేక నదిలో ఉన్నారా అనేది తెలియలేదు.

    విస్కీ బాటిల్ చేప పొట్టలో ఉందనే వార్త వైరల్ అయ్యింది. సోషల్ మీడియాలో నెటిజన్లు దీన్ని తెగ చూస్తున్నారు. లక్కీ ఫెల్లోస్ అని వాళ్లను చమత్కరిస్తున్నారు. ఆ వీడియోని మీరు ఇక్కడ చూడండి.

    విదేశాల్లో చేపల వేటకు వెళ్లేవారు... తమతో బోటులో ఐస్ బాక్సులు తీసుకెళ్తారు. పెద్ద చేపల్ని బోటులోనే ముక్కలుగా కోసేస్తారు. అవసరం లేని చేప ముక్కల్ని సముద్రంలో విసిరేస్తారు. ఉపయోగపడే ముక్కల్ని ఐస్ బాక్సుల్లో ఉంచుతారు. తద్వారా బోటులో అనవసర బరువు లేకుండా చేస్తారు. అలాగే... ఎక్కువ చేపల్ని ఐస్ బాక్సుల్లో పట్టించేందుకు కూడా ఇలా చేస్తారు. ఈ వీడియోలో కూడా అదే పద్ధతి ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది.

    ఇంతకీ వాళ్లకు దొరికింది ఫైర్ బాల్ విస్కీ (Fireball Whisky). ఇండియాలో 750 ఎంఎల్ బాటిల్ రూ.700 దాకా ఉంటుంది. విదేశాల్లో రేటు తక్కువే ఉంటుంది. అయినప్పటికీ... ఇలా చేప పొట్టలో నిండు విస్కీ బాటిల్ దొరకడం అనేది అత్యంత అరుదైన విషయం కాబట్టి వైరల్ అయ్యింది. యూట్యూబ్‌తోపాటూ ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్లలో కూడా ఇది వైరల్ అయ్యింది.

    ఈ వీడియోలో వాళ్లు చెప్పింది నిజమే గనక అయితే... ఆ చేప మొత్తం విస్కీ బాటిల్‌ని మింగేసి ఉండాలి... అసలు అలాంటి బాటిల్ ఆ చేపకు ఎక్కడ దొరికింది అని నెటిజన్లు డౌట్లు వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది జాలర్లే కావాలని చేపన పట్టాక దాని నోట్లోంచీ... విస్కీ బాటిల్‌ని లోపలికి పంపి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

    ఇది కూడా చదవండి: Shocking: నదిలో నగ్నంగా అమ్మాయి! చూసి షాకైన ప్రజలు! బయటకు తీశాక ఏమైందంటే

    నిజానికి సముద్ర జీవులు... తాము తినకూడనివి చాలా తినేస్తున్నాయి. ముఖ్యంగా ప్లాస్టిక్ వస్తువుల్ని అవి మింగి చనిపోతున్నాయి. ఇలా రోజూ కొన్ని వేల జీవులు చనిపోతూనే ఉన్నాయి.
    Published by:Krishna Kumar N
    First published: