Home /News /trending /

VIRAL VIDEO ELEPHANT SLAPS GIRL IN THE FACE WHEN SHE TRIES TO CLICK PICTURE INTERNET SAYS OUCH PAH

Funny video: అట్లుంటది మనతోని.. అమ్మాయిని తొండంతో ఒక్కటేసిన ఏనుగు.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో..

అమ్మాయిపై దాడిచేస్తున్న ఏనుగు

అమ్మాయిపై దాడిచేస్తున్న ఏనుగు

Elephant slaps : ఏనుగులు చాలా వరకు ఫ్రెండ్లీగా ఉంటాయి. కానీ ఒక్కొసారి వింతగా ప్రవర్తిస్తాయి. ఇక్కడోక యువతి ఏనుగుకు కోపం తెప్పించింది. దీంతో చిర్రెత్తు కొచ్చిన ఏనుగు ఒక్కటేసింది.

సాధారణంగా సోషల్ మీడియాలో (Social media) కొన్ని రకాల జంతువుల వీడియోలు ఎక్కువగా వైరల్ (viral video) అవుతుంటాయి. కుక్క,పిల్లి, ఏనుగుల సరదా చేష్టలు అవి చేసే చిలిపి పనులు నెట్టింట్లో ట్రెండింగ్ లో ఉంటున్నాయి. వీటిని చూడటానికి నెటిజన్లు సైతం ఇంట్రెస్ట్ చూయిస్తున్నారు. కొన్నిసార్లు, కుక్కలు, పిల్లులు తమ ఓనర్స్ తో వింతగా ప్రవర్తిస్తాయి. కుక్కలు తమ ఓనర్ ముందర తోక ఆపుకుంటూ, ఎక్కడికి వెళ్లిన ఫాలో అయిపోతుంటాయి. తమ ఓనర్ ఏదైన పడేసి, తీసుకురమ్మని సైగ చేస్తే పరుగెత్తుకుంటూ వెళ్లి వాటిని తీసుకొస్తాయి. తమ యజమాని దగ్గరకు కొత్త వాళ్లు వస్తే.. శునకాలు కోపంతో వారిపైన దాడి చేస్తాయి. ఇక పిల్లులు తమ యజమానుల దుప్పట్లలో దూరిపోతుంటాయి. వీపుమీద పడుకుని ఫన్నీగా ప్రవర్తిస్తుంటాయి.





గున్న ఏనుగులు (Elephant) కూడా సరదాగా తమ ఓనర్ ను ఆటపట్టిస్తాయి. అయితే, ఏనుగులు కొన్ని సార్లు వింతగాను ప్రవర్తిస్తాయి. కొంత మంది పర్యటకులు జూకి వచ్చినప్పుడు అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. ఇలాంటప్పుడు ఏనుగులు కోపంతో వారిపైన దాడిచేస్తాయి. ఇలాంటి ఒక వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు.. కొందరు విద్యార్థులు జూలో ఉన్న ఏనుగు దగ్గరకు వచ్చారు. దానితో సరదాగా ఆడుకున్నారు. సాధారణంగా కొందరు జంతువులతో సెల్ఫీతీసుకొవడానికి ఇంట్రెస్ట్ చూయిస్తుంటారు. అయితే, ఇక్కడ కొంత మంది ఏనుగు దగ్గరకు వెళ్లారు. దాని తొండాన్ని ప్రేమతో నిమిరారు. అది కూడా చెవులను ఊపుకుంటూ వారివంక సరదాగా చూస్తుంది. ఇంతలో.. మరో యువతి ఏనుగుతో సెల్ఫీ కాకున్న.. కనీసం దగ్గర నుంచి ఒక ఫోటో తీసుకొవాలనుకుంది. వెంటనే తన ఫోన్ తీసి ఏనుగు దగ్గరకు వెళ్లింది. దాన్ని ఫోటోతీయడానికి ట్రై చేసింది. ఇంతలో ఏనుగు కోపంతో తన తొండం తో యువతికి (Elephant slaps girl) ఒక్కటిచ్చింది. యువతి చేతిలో ఫోన్ కాస్త ఎగిరి కిందపడింది. పాపం... యువతి భయంతో దూరంగా పారిపోయింది. ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో నెట్టింట (Funny video) వైరల్ గా మారింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Elephant, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు