• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • VIRAL VIDEO EK POSHLA RUPKATHA ACTRESS PRIYANKA BHATTACHARJEE FEEDS FOOD TO MONKEYS VIDEO SHARES ON INSTAGRAM NK

Viral video: కొండముచ్చులకు ఆహారం పెట్టిన హీరోయిన్... ఆ తర్వాత ఏమైందంటే...

Viral video: కొండముచ్చులకు ఆహారం పెట్టిన హీరోయిన్... ఆ తర్వాత ఏమైందంటే...

కొండముచ్చులకు ఆహారం పెట్టిన హీరోయిన్ (image credit - instagram)

Viral video: వన్య మృగాలను చూస్తే ఎవరికైనా సరదాగా ఉంటుంది. ముఖ్యంగా కోతులు, కొండముచ్చులంటే చాలా మందికి ఇష్టం. మరి ఆ హీరోయిన్ ఏం చేసింది. కొండముచ్చులు ఏం చేశాయి.

  • Share this:
    Priyanka bhattacharjee: ప్రేమను పంచండి... మీకు ఎంత వీలైతే అంత పంచండి అంటోంది బెంగాల్ నటి ప్రియాంక బట్టాచర్య. 2017లో వచ్చిన ఎక్ పోష్లా రూప్ కథ సినిమాతో ఆమె తెరంగేట్రం చేసింది. ప్రస్తుతం మోడలింగ్‌లో బిజీ అయిన ఈ బ్యూటీ... తన అప్‌డేట్స్ అన్నీ సోషల్ మీడియాలో ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తోంది. తాజాగా... కొండముచ్చులతో ఓ రోజు తను ఎలా గడిపిందో వీడియో షేర్ చేసింది. ఇందులో... ఆమె ఇంటికి ఓ కొండముచ్చుల ఫ్యామిలీ వచ్చింది. అవి కిటికీ దగ్గర నుంచి చూస్తుంటే... ప్రియాంకా వాటికి బిస్కెట్లు పెట్టింది. ఆమె వన్ బై వన్ పెడుతుంటే... ఆవి ఆనందంగా తీసుకొని తిన్నాయి.

    అప్పటికీ ఆకలి తీరని ఆ కొండముచ్చులకు ఆమె ఈసారి ద్రాక్షాపళ్లు పెట్టింది. అవి కోతులకు బాగా నచ్చాయి. వాటంతట అవే ప్లేట్ లోంచీ... నాలుగైదు గుంపుగా తీసుకొని తిన్నాయి. ఇంకా ఆకలి తీరకపోతే... ఈసారి వాటికోసం చిప్స్ తెచ్చి పెట్టింది. అవి కొండముచ్చులకు బాగా నచ్చాయి. కరకరా నములుతూ తినేశాయి. ఆ వీడియో మీరూ చూడండి.



    కోతులైనా, కొండముచ్చులైనా అవి మనపై దాడి చేస్తాయేమో అనే భయం మనకు ఉన్నట్లే... వాటిపై మనం దాడి చేస్తామేమో అనే భయం వాటికీ ఉంటుంది. కానీ ఇక్కడ కొండముచ్చులు ఆమె దగ్గరకు వచ్చి మరీ తింటున్నాయంటే... ఆమెను అవి ఎంతలా నమ్మాయో అర్థం చేసుకోవచ్చు. అది మాటలకు అందని బాండ్.




    ఇది కూడా చదవండి: House vastu: ఇంట్లో ఆ పక్షుల ఫొటోలు పెట్టండి... ఇక అన్నీ శుభాలే...

    ప్రియాంక భట్టాచార్య థియేటర్ ఇండస్ట్రీలో చాలా ప్లేలు చేసింది. వాటిలో కేఫ్ కాఫీ డే ప్రజెంట్ చేసిన నాతీ బినోదినీ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. మొన్ననే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసిన ఈ బ్యూటీ... ప్రస్తుతం సమ్మర్‌ని ఎంజాయ్ చేస్తోంది.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు