Video: మైండ్ బ్లోయింగ్.. ట్రక్కుతో టీ బ్యాగ్ ముంచాడు

ట్రక్కుతో టీ బ్యాగ్ ముంచాడు (image credit - facebook)

Viral Video: ఆ డ్రైవర్ ఎందుకు అలా చేశాడు. ట్రక్కుతో టీ బ్యాగ్‌ని ముంచాల్సినంత అవసరం ఏమొచ్చింది. అతని వీడియోని చూసి... భలే చేశాడుగా... ఏం టాలెంట్‌ రా నాయనా అంటున్నారు నెటిజన్లు.

  • Share this:
    Viral Video: యూరప్ దేశం... నెదర్లాండ్స్... ఆమ్‌స్టర్‌డ్యామ్‌ నుంచి ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. జనరల్‌గా మనం గ్రీన్ టీ తాగాలనుకుంటే.. వేడి నీటిలో... చేతితో పట్టుకొని టీబ్యాగ్ ముంచుతాం. ఓ నిమిషం తర్వాత... టీ తాగేస్తాం. ఆ ట్రక్కు డ్రైవర్ అలా చెయ్యలేదు. టీ గ్లాసును ఓ ట్రాఫిక్ కోన్‌పై ఉంచాడు. టీ బ్యాగును ట్రక్కుకు తగిలించాడు. ట్రక్కును జాగ్రత్తగా నడుపుతూ... టీ గ్లాస్ పక్క నుంచి వెనక్కి డ్రైవ్ చేశాడు. కరెక్టుగా టీ గ్లాస్ దగ్గరకు... టీ బ్యాగ్ వచ్చేలా చేసి... దాన్ని కరెక్టుగా గ్లాస్‌లో మునిగేలా చేశాడు.

    ఇలా చెయ్యడం చాలా కష్టం. అందుకు ఎంతో అనుభవం ఉండాలి. ట్రక్ ఏమాత్రం సరిగా నడపకపోయినా... టీ బ్యాగ్... గ్లాస్‌లోకి దిగదు. కానీ అతను పర్ఫెక్టుగా చేశాడు. అందుకే ఇది నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. అతని టాలెంట్ అదుర్స్ అంటున్నారు. మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ అని మెచ్చుకుంటున్నారు.

    ఆ అదిరే వీడియోని ఇక్కడ చూడండి.

    ఫేస్‌బుక్‌లో షేరైన ఈ వీడియోలో డచ్ ట్రక్ డ్రైవర్ జోహాన్ గ్రోటెబోయర్ (Johan Groteboer)... అలవోకగా ఇది చేశాడు. బండిని మళ్లీ మళ్లీ నడపడం వంటివి చెయ్యకుండా... ఒకేసారి నడిపి ఈ ఫీట్ చేశాడు. నిజానికి ఇదే ఫీట్‌ని ఇంతకుముందు ఫిన్‌లాండ్ డ్రైవర్ చేశాడు. దీనికి టీ బ్యాగ్ ఛాలెంజ్ (teabag challenge) అని పేరు పెట్టాడు. అది చూసి ప్రేరణ పొందిన జోహాన్... తన 82 అడుగుల LHVతో చేసి చూపించాడు.

    ఫేస్‌బుక్‌లోని ఈ వీడియోకి 7 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. నెటిజన్లకు ఇది బగా నచ్చుతోంది. ఇందులో పైకి కనిపించని థ్రిల్ ఉందని అంటున్నారు. 30 ఏళ్ల డ్రైవింగ్ అనుభవం ఉన్న జోహాన్... తన వీడియో వైరల్ అవ్వడంలో వింతేమీ లేదన్నాడు. ప్రపంచంలోని పెద్ద ట్రక్కుల్లో ఇదీ ఒకటి కావడం వల్లే వైరల్ అయ్యిందంటున్నాడు.

    ఇది కూడా చదవండి: Video: వంట వండుతోందా.. ఆ వంకతో అందాలు చూపిస్తోందా?

    ఇలా పాపులార్టీ పెరిగిపోవడంతో జోహాన్‌కి వేర్వేరు దేశాల నుంచి ఫ్రెండ్స్ రిక్వెస్టులు వస్తున్నాయి. వాటిని యాక్సెప్ట్ చెయ్యడం తన వల్ల కావట్లేదనీ.. ఎక్కువైపోతున్నాయని అంటున్నాడు.
    Published by:Krishna Kumar N
    First published: