• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • VIRAL VIDEO DUE TO WEDDING SEASON VIOLATION OF COVID LOCKDOWN INCIDENT HELD IN MADHYA PRADESH WHAT POLICE DID THEN WATCH VIDEO NK

Viral video: లాక్‌డౌన్‌లో పెళ్లి కోసం షాపింగ్... అంతలో వచ్చిన పోలీసులు... ఆ తర్వాత...

Viral video: లాక్‌డౌన్‌లో పెళ్లి కోసం షాపింగ్... అంతలో వచ్చిన పోలీసులు... ఆ తర్వాత...

లాక్‌డౌన్‌లో పెళ్లి కోసం షాపింగ్... అంతలో వచ్చిన పోలీసులు (image credit - twitter)

Viral video: ఓవైపు పెళ్లిళ్ల సీజన్. మరోవైపు రాష్ట్రాల్లో లాక్‌డౌన్లు. ప్రజలకు షాపింగ్ చేయక తప్పని పరిస్థితి. పోలీసులకు డ్యూటీ. మరి ఆ ఫ్యామిలీ షాపింగ్‌కి వెళ్లినప్పుడు ఏం జరిగిందో వీడియో చూడండి.

  • Share this:
    Viral video: గతేడాదితో పోల్చితే... ఇప్పుడు దేశంలో కరోనా చాలా ఎక్కువగా ఉంది. అప్పుడు వేల కేసులకే ఇండియా లాక్‌డౌన్‌లోకి వెళ్లింది. ఇప్పుడు రోజూ 4 లక్షల కేసులు వస్తున్నా లాక్‌డౌన్ లేదు. కానీ రాష్ట్రాల్లో అది అమలవుతోంది. ముఖ్యంగా మధ్యప్రదేశ్‌లో రోజూ 10వేలకు పైగా పాజిటివ్ కేసులు వస్తున్నాయి. దాంతో అక్కడి ప్రభుత్వం లాక్‌డౌన్ అమలుచేస్తోంది. ప్రభుత్వాలు రూల్స్ తేవడం, ప్రజలు వాటిని అతిక్రమించడం ఇండియాలో మామూలేగా. తాజాగా... లాక్‌డౌన్ అమల్లో ఉన్నప్పుడు ఓ ఫ్యామిలీ... పెళ్లికి సంబంధించిన బట్టలు, నగలు, ఇతర సామాన్లు కొనుక్కోవడానికి వెళ్లింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో... ఇలా చాలా చోట్ల జరుగుతోంది. మధ్యప్రదేశ్‌లోనూ జరిగింది.

    స్థానిక దాతియా ఏరియాలో వ్యాపారులు... షాపుల షట్టర్లు మూసేసి... లోపల వ్యాపారం చేస్తున్నారు. పైకి లాక్‌డౌన్ అమల్లో ఉన్నట్లు కనిపిస్తున్నా.. లోపల షాపింగ్ జరిగిపోతోంది. ఇక ఇలాగైతే కరోనా ఎందుకు సోకదు అనుకున్న పోలీసులు... యాక్షన్ లోకి దిగారు. వారే స్వయంగా షట్టర్లు తెరిచారు. లోపల మహిళలు, వ్యాపారులు, సిబ్బంది అందరూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. పోలీసుల వార్నింగ్‌తో మహిళలు పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేయగా... పోలీసులు షాప్ నిర్వాహకుల చెంపలు చెళ్లు మనిపించారు. ఇంకెప్పుడూ ఇలా జరగదనీ... ఈసారికి వదిలేయమని బతిమలాడినా పోలీసులు వినలేదు... పదండి అంటూ పోలీస్ స్టేషన్‌కి తీసుకుపోయారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. అది మీరూ ఇక్కడ చూడండి.





    ఇది కూడా చదవండి: Lassi Health Benefits: రోజూ లస్సీని ఇలా తాగితే రెట్టింపు ఆరోగ్యం

    దేశంలో 26 రాష్ట్రాల్లో లాక్‌డౌన్లు, కర్ఫ్యూలు అమల్లో ఉన్నాయి. కానీ అవి సరిగా అమలు కావట్లేదనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా పోలీసులు లైట్ తీసుకుంటున్నారనే వార్తలు వస్తుంటే... పోలీసులపై ఒత్తిడి పెరుగుతోంది. వారు యాక్షన్‌లోకి దిగుతున్నారు. ఢిల్లీ లాంటి కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఇందుకు కారణం లాక్‌డౌనే అనే మాట వినిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించే ఉద్దేశంతో లేకపోవడంతో... రాష్ట్రాలో దీన్ని అమలు చేస్తున్నాయి. ఐతే... ప్రభుత్వాల నిర్ణయాలతో ఇలా ప్రజలు అక్కడక్కడా ఇబ్బంది పడుతున్నారు.
    Published by:Krishna Kumar N
    First published: