Home /News /trending /

VIRAL VIDEO DRUNK MAN ENJOYS IN FLOODWATER AMID MUMBAI RAINS NETIZENS COME UP WITH HILARIOUS REACTIONS PAH

అరె ఏంట్రా ఇది.. బురదలో ఇలా బోర్లుతున్నాడు .. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..

బురదలో తాగుబోతు రచ్చ

బురదలో తాగుబోతు రచ్చ

Viral video: వ్యక్తి తప్పతాగి నడిరోడ్డు మీద బీభత్సం చేశాడు. తన ఒంటిపై బట్టలను కూడా తీసేశాడు. వర్షపు నీళ్లలో బొర్లుకుంటూ రోడ్డు మీద న్యూసెన్స్ చేశాడు.

కొందరు పీకల దాగి రోడ్డు మీద రచ్చ చేస్తుంటారు. రోడ్డు మీద వచ్చి పోయే వారిని నోటికొచ్చినట్లు తిడుతుంటారు. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కల్గింస్తుంటారు. మరీ కొందరైతే వారిని ఆపడానికి ప్రయత్నించిన వారిపైన దాడులకు కూడా తెగబడతారు. కొన్ని సందర్బాలలో డ్రంక్ డ్రైవ్ టెస్ట్ లు చేస్తుంటారు. ఈ సందర్బాలలో.. కొంత మంది మోతాదుకు మించి మద్యం తాగి దొరికిపోతారు. వీరు పోలీసులతోనే వాగ్వాదానికి దిగుతారు.

మరికొన్ని చోట్ల.. ట్రాఫిక్ పోలీసుల (Traffic police)  నుంచి తప్పించుకొవడానికి రకరకాల డ్రామాలు చేస్తుంటారు. అయితే, కొన్ని సార్లు తాగా, వారి శరీరంపై కంట్రోల్ తప్పిపోయి పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుంటారు. తాగిన మైకంలో వారేంచేస్తారో వారికే తెలియదు. ఈ కోవకు చెందిన ఒక వీడియో నెట్టింట (social media)  వైరల్ గా మారింది.





పూర్తి వివరాలు.. ముంబైలో (Mumbai) కొన్ని రోజులుగా భారీగా వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లన్ని (Heavy rain)  నీళ్లతో నిండిపోయాయి. ఈ క్రమంలో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. అసలే.. రోడ్లపై నిలిచిలపోయిన నీళ్లు., ట్రాఫిక్ తో ఇబ్బందులు పడుతుంటే ఒక వ్యక్తి పూటుగా మద్యం తాగాడు.రోడ్డు మీద బురదలో పడుకున్నాడు. అదేదే స్విమ్మింగ్ పూల్ లో పడుకుంటున్నట్లు అటు ఇటు బోర్లు తున్నాడు. రోడ్డు మీద వెళ్తున్న వాహనాల వలన నీళ్లు అతని ఒంటిమీద పడుతున్న ఏమాత్రం తెలియకుండా అలాగే పడుకుని ఉన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా (viral video) మారింది.



ఇదిలా ఉండగా బస్సులో ఇద్దరు వ్యక్తులు పరస్పరం తిట్టుకున్నారు.

వృద్ధులు కలిసి బస్సు ఎక్కారు. ఇద్దరు పక్కపక్కన కూర్చున్నారు. జాగ కోసం పొట్లాడటం మొదలేట్టారు. చివరకు ఇది వాగ్వాదం చేసుకుని కొట్టుకొవడం వరకు వెళ్లింది. ఇద్దరిట్లో ఏ ఒక్కరు కూడా తగ్గట్లేదు. కొంత మందికి చాదస్తం కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే, ఇద్దరు కూడా.. నువ్వు జరుగు అంటే.. కాదు..కాదు.. నువ్వే జరుగు అంటూ రచ్చ చేసుకుంటున్నారు.

ఇద్దరు వృద్ధులు కలిసి బస్సు సీటుపై కూర్చుని స్థలం కోసం పోరాడుతున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. "హాయ్ జగహ్," ఒక వ్యక్తి అంటున్నాడు. "నహీ హై," అవతలి వ్యక్తి కోపంతో సమాధానం చెబుతున్నాడు. స్థలం కోసం పోరాడుతున్నప్పుడు ఇద్దరూ కోపంగా అదే మాటలను పదేపదే రిపిట్ చేసుకుంటున్నారు. ఈ వీడియో ను బస్సులో వెనుక వైపు కూర్చున్న కొందరు వీడియో తీసి (Video viral)  నెట్టింట్లో పోస్ట్ చేశారు. ఇంకేముంది.. అది వైరల్ గా  (trending video) మారింది. దీన్ని ముంబై పోలీసులు కూడా తమ అధికారిక ట్విటర్ అకౌంట్ లో దీన్ని పంచుకున్నారు. దీన్ని చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్ లు పెడుతున్నారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Heavy Rains, Mumbai, Trending video, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు