Drunk Aunty Rolls On The Floor As She Dances: పెళ్లిళ్లలో డీజేలు, మ్యూజిక్ సిస్టమ్ లు పెడుతుంటారు. వీటి రిథమ్ కు తగ్గట్టుగా యువకులు మాస్ స్టెప్పులతో అదరగొడతారు. ఇక కొంత మంది యువకులు డ్యాన్స్ చేయాలంటే వారికి వైన్ తాగాల్సిందే. మద్యం తాగగానే ఈ లోకాన్ని మరిచిపోయి అదిరిపోయే స్టెప్పులు వేస్తుంటారు. మద్యం సేవించక ముందు అతిథులు ఏమనుకుంటారో అని... మోహమాటపడతారు. ఇక చుక్కపడగానే లోకాన్ని మరచిపోతారు. డీజే, మ్యూజిక్ కు తగ్గట్టుగా ఏమాత్రం తగ్గకుండా అదిరిపోయేలా డ్యాన్స్ చేస్తారు. కొందరు నాగిన్ లా స్టెప్పులు వేస్తారు. మరికొందరు తీన్ మార్ స్టెప్పులతో అదరగొడతారు. ప్రస్తుతం ఒక ఆంటీ వేస్తున్న మాస్ స్టెప్పులు ప్రస్తుతం సోషల్ మీడియాలో మరోసారి వైరల్ గా మారింది.
పూర్తి వివరాలు.. ఇక్కడ వీడియోలో ఒక ఆంటీ పెళ్లి వేడుకలో పాల్గొంది. అక్కడ స్టేజీమీద అతిథులు ఉన్నారు. కూర్చుని ఉన్నారు. వారిలో ఒక ఆంటీ మాత్రం తన పెర్ఫామెన్స్ తో అదరగొడుతున్నారు. చేతిలో వైన్ బాటిల్ పట్టుకుని దుమ్మురేపే స్టెప్పులు వేస్తున్నారు. ఆమె తన చేతిలో వైన్ బాటిల్ పట్టుకుని.. 1985 లో వచ్చిన కాలా సూరజ్ చిత్రంలోని దో ఘాంట్ పిలా దే సకియా పాటకు ఫ్లోర్ మొత్తం తిరుగుతూ డ్యాన్స్ చేస్తుంది. ఆమె తాను డ్యాన్స్ చేస్తు.. అక్కడి వారిని కూడా డ్యాన్స్ చేయాలంటూ ఉత్సాహపరుస్తుంది. నాగినిలా డ్యాన్స్ చేస్తు అక్కడి వారిని షాకింగ్ కు గురిచేస్తుంది. కొంత మంది మగవాళ్లు సైతం.. ఆమెను చూసి అక్కడి దూరంగా పారిపోతున్నారు. ఆంటీ మాత్రం ఏమాత్రం తగ్గకుండా డబుల్ జోష్ తో డ్యాన్స్ చేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.