Home /News /trending /

VIRAL VIDEO DOG LICKS JUICY MEAT BUT ITS INSIDE THE TV CLIP HAS 9 MILLION VIEWS PAH

Viral video: దీని ఆత్రం పాడుగాను.. టీవీని చూసుకుంటూ చొంగ కారుస్తున్న శునకం.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న వీడియో..

టీవీ స్క్రీన్ నాకుతున్న కుక్క

టీవీ స్క్రీన్ నాకుతున్న కుక్క

Funny video: కుక్కలు చాలా ఫన్నీగా ప్రవర్తించించాయి. అది చేస్తున్న చేష్టలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. టీవీ స్క్రీన్ ని నాకుతూ.. నవ్వు తెప్పించే విధంగా ప్రవర్తించింది.

కుక్కలు ఫన్నీగా ప్రవర్తిస్తుంటాయి. అందుకే ఎక్కువ మంది తమ ఇళ్లలో కుక్కలను, పిల్లులను పెంచుకుంటారు. కుక్కలైతే.. తమ యజమానిని అస్సలు విడిచిపెట్టి ఉండవు. చాలా ఫన్నీగా ప్రవర్తిస్తాయి. ప్రతి నిముషం చూసుకుంటూ ఉంటాయి. ఎక్కడికి వెళ్లిన తోక ఊపుకుంటూ అక్కడికి వెళ్తుంటాయి. పొరపాటున తమ ఓనర్ ఊరికి వెళ్తే అన్నం ముట్టుకోవు. ఇతరులను తమ ఇంట్లోకి రానివ్వవు. కొన్ని సార్లు.. కుక్కలు మనం ఇంట్లో ఏదైన పదార్థాలు తినేటప్పుడు మన ముందుకు వచ్చి కూర్చుంటాయి. వాటికి పెట్టకుండా తింటే.. తనకు ఇవ్వాలని కాలితో, తలతో సైగలు కూడా చేస్తాయి. ఇలాంటి ఫన్నీ వీడియోలు ఎన్నో వైరల్ గా మారాయి. తాజాగా, మరో వీడియో సోషల్ మీడియాలో (Social media) హల్ చల్ చేస్తుంది.

పూర్తి వివరాలు.. చైనాలో (china)ఈ ఘటన జరిగింది. చైనాలో ఒక వ్యక్తి తన ఇంట్లో హస్కీ అనే కుక్కను పెంచుకున్నాడు. అతను దానికి తన ఇంట్లో మనిషిలాగానే చూసుకునేవాడు. దాని కోసం ప్రత్యేక మైన ఫుడ్ పెట్టేవాడు. దానికి ఇష్టమని మాంసం ఎక్కువగా పెట్టేవాడు. ప్రతిరోజు మాంసం ముక్కలు పెట్టేవాడు. అతని ఇంట్లో రెండు కుక్కలను పెంచుకుంటున్నాడు.


ఒక రోజు టీవీ స్క్రీన్ పైన ఒక షో వస్తుంది. దానిలో మాంసం ముక్కలతో ప్రత్యేక పదార్థం ను లైవ్ లో చూపిస్తున్నారు. దీన్ని హస్కీ చూసింది. వెంటనే చోంగ కార్చుకుంటూ టీవీ దగ్గరకు వెళ్లింది. మాంసం తినడానికి ప్రయత్నించింది. టీవీ స్క్రీన్ ను నాలుకతో నాకుతూ, నవ్వుపుట్టించేలా ప్రవర్తించింది. టీవీ పక్కనే మరో కుక్క.. మాత్రం గోడకు ఆనుకొని యోగా చేస్తుంది. ఈ వీడియోను ‘MyChinaTrip’ అనే వినియోగదారు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట (Viral video)  వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు భలే ఉన్నాయి కుక్కలు, మరీ కుక్కకు కక్కుర్తి ఎక్కువగా ఉందంటూ.. ఫన్నీగా కామెంట్ లు పెడుతున్నారు.



ఇదిలా ఉంగా ఒక చింపాంజీ  జూలో దమ్ము కొడుతున్న  ఘటన వార్తలలో నిలిచింది.

సౌత్ ఆసియన్ దేశంలోని వియత్నంలో ఈ ఘటన జరిగింది. హో చిమిన్ సిటీలోని సైగాన్ జూ ఉంది. దానిలో ఒక ఒరంగుటాన్ ను ప్రత్యేకంగా కాపాడుతున్నారు. అయితే, అది ఒక సిగరేట్ తీసుకుంది. (Orangutan Smoking in Vietnam Zoo) దాని చేతిలో పట్టుకుని మనిషి మాదిరిగా పొగను తాగింది. అది అచ్చం మనిషి మాదిరిగా దమ్ముకొడుతున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ (Viral video) గా మారింది. దీనిపై అధికారులు సీరియస్ అయ్యారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: China, Pet dog, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు