హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Russia Ukraine war: బుచా మారణ హోమం.. నెల తర్వాత యజమానిని కలిసిన శునకం.. కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో..

Russia Ukraine war: బుచా మారణ హోమం.. నెల తర్వాత యజమానిని కలిసిన శునకం.. కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో..

Russia Ukraine crisis: ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడులు కొనసాగిస్తుంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో రష్యన్ దాడులకు సంబంధించి అనేక హృదయ విదారక దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. తాజగా, మరో వీడియో నెటిజన్ల కంట తడిపెట్టిస్తుంది.

Dog Cries as He Reunites With Owner: నెల రోజులకు పైగా రష్యన్ సైన్యాలు ఉక్రెయిన్ పై దాడులు చేస్తున్నాయి. ఇప్పటికే ఉక్రెయిన్ లోని ముఖ్య నగరాలన్ని బాంబులు, క్షిపణుల మోతకు వాటి రూపురేఖలను కొల్పోయాయి. పుతిన్ (Vladimir putin) దురహాంకారాన్నిప్రపంచ దేశాలు వ్యతిరేకించిన ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. ఇప్పటికే పలు దేశాలు రష్యాపై కఠినమైన ఆంక్షలు విధిస్తున్నాయి. ఉక్రెయిన్ కు పరోక్షంగా సహాయం చేస్తున్నాయి. రష్యన్ భీకర దాడుల వలన కోట్లాది ప్రజలు తమ దేశం విడిచి పెట్టి సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్తున్నారు.

అదే విధంగా కొన్ని చోట్ల యువతులు, మహిళలు తీవ్రమైన దాడులను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులు , భవనాలు పూర్తిగా నెలమట్టాయి. ఉక్రెయిన్ అంతటా భీతావహ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్కడ మనుషులు తమ దేశాన్ని విడిచిపెట్టి వెళ్లలేక కన్నీటి పర్యంతమయ్యారు. మరొవైపు కొందరు తమ పెంపుడు జంతువుల కోసం చాలా రోజులు ఇక్కడే గడిపారు.

మరికొందరు తమ పెంపుడు జంతువులను ప్రాణాలకు తెగించి తమతో పాటు సురక్షితంగా తీసుకెళ్లారు. ఇక బూచాలో రష్యన్ చేసిన మారణ కాండను ప్రపంచదేశాలు తీవ్రంగా పరిగణించాయి. అమాయకులను, నిరాయుధులు, సామాన్యప్రజలపై దాడి చేయడాన్ని తప్పుపట్టాయి. ప్రజలను మోకాళ్లపై నిలబెట్టి వారి కణతులపై కాల్పులు జరిపిన అనేక సంఘటనలు బయటపడ్డాయి. దీంతో ఈ పరిణామంపై ప్రపంచ దేశాలు పుతిన్ యుద్దోన్మాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇక ప్రస్తుతం బుచాలో మరో వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు.. బుచా నగరంలో (Bucha killings) రష్య దారుణమైన మారణ హోమాన్ని సృష్టించింది. అక్కడ ఎక్కడ చూసిన శవాలు కుప్పలు తెప్పలుగా శవాలు ఉండటం కనిపిస్తుంది. ఈ దాడులకు భయపడి ప్రజలు బూచానుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఈ క్రమంలో ఒక నెలరోజుల తర్వాత బుచాను చేరుకున్నాడు.

అతడిని చూడగానే.. ఆ కుక్క పరిగెత్తుకుంటు అతడి దగ్గరకు పరిగెత్తుకు వచ్చింది. నెస్సీ అనే నలుపు, తెలుపు చారలు ఉన్న కుక్క తన(Dog Cries) యజమానిని చూసింది. దాదాపు.. నెల రోజుల క్రితం(Reunites With Owner) అతను బుచా వదిలేసి వెళ్లిపోయాడు. అతడిని చూడగానే పరిగెత్తుకు వెళ్లి, తమ యజమానిని హత్తుకుంది. అతనిని నాకుతూ.. తోక ఊపుతు.. అతని చుట్టు తిరిగింది. దాని యజమాని కూడా తన శునకం చూపిన ప్రేమకు ఫిదా అయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో (Viral video) నెట్టింట వైరల్ గా మారింది.

First published:

Tags: Russia, Russia-Ukraine War, Viral Video

ఉత్తమ కథలు