Viral Video: పోలీసులంటే మనకు ఒకింత గౌరవం ఉంటుంది. అది వాళ్ల యూనిఫామ్‌కి మనం ఇచ్చే రెస్పెక్ట్. సమాజ శ్రేయస్సు కోసం వాళ్లు సేవలు చేస్తారు కాబట్టి... మనం వాళ్లకు ఆ విలువ ఇస్తూ ఉంటాం. ఐతే... కొన్నిసార్లు పోలీసులు... తమ ఖాకీ పవర్‌ను మర్చిపోతుంటారు. పోకిరీల్లా తయారవుతారు. తాజాగా ఒడిశాలో అదే జరిగింది. ఓ లేడీ కానిస్టేబుల్ చుట్టూ రౌండప్ చేసి... పోలీసులు డాన్సులు వేశారు. ఆమె కూడా చిందులేసింది. ఆ క్షణం అందరూ ఈ లోకాన్ని మర్చిపోయారు. పాటకు స్టెప్పులేయడంలో మునిగి తేలారు. ఇది జరిగింది జైపూర్ జిల్లాలో. ఎంతో క్రమశిక్షణతో ఉండే పోలీసులు... ఇలా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారు.
పోలీసుల్లోనే ఒకరి ద్వారా ఈ వీడియో నెట్టింట్లోకి వచ్చింది. అది చూసిన నెటిజన్లు... "పోలీసులేంటి... ఆ డాన్సులేంటి.." అంటూ ఫైర్ అవుతున్నారు. "ఎంజాయ్ చెయ్యాలనుకుంటే... డ్యూటీ అయిపోయాగా... ప్రైవేట్ లైఫ్‌లో ఏమైనా చేసుకోవాలి గానీ... ఇలా పట్టపగలు, పోలీస్ స్టేషన్లో యూనీఫామ్తో ఏంటది" అని ప్రశ్నిస్తున్నారు. ఆ వీడియో మీరూ చూడండి. మీకో క్లారిటీ వస్తుంది.
ఇంత జరిగాక... పెద్దాఫీసర్లకు తెలియకుండా ఉంటుందా... వార్త చేరింది. ఆగ్రహం వచ్చింది. ఎంక్వైరీ ఆర్డర్ జారీ అయ్యింది. అంతర్గత దర్యాప్తు జరిగింది. సీసీటీవీల్లో పుటేజ్ క్లియర్‌గా ఉంది. అంతా అయిపోయింది. దీంతో ఈ పానీకోయిలీ పోలీస్ స్టేషన్ ASIని సస్పెండ్ చేశారు.
ఈ డాన్స్ చేసినప్పుడు పోలీస్ స్టేషన్ డోర్లు మూసేసారు. హోలీ (holi) పండుగ సందర్భంగా ఇది చేశారు. డాన్స్ చేస్తూ పోలీసులు తెగ ఆనందపడ్డారు. ఆ తర్వాత ఇలా అవుతుందని వారు అస్సలు ఊహంచలేదు.
ఇంకోసారి ఇలా జరిగితే కఠిన చర్యలుంటాయని మిగతా పోలీసులకు వార్నింగ్ వెళ్లిందని టాక్. ఉన్నతాధికారులు ఏ యాక్షన్ తీసుకుంటే ఏమి... ఆల్రెడీ పరువు పోయింది. దీనిపై ఓ లాయర్ చెప్పిన మాట అందరికీ నచ్చుతోంది. "పోలీసులకూ సామాన్య ప్రజలలాగా ఎంజాయ్ చెయ్యాలని ఉంటుంది. ఐతే... వారు ఖాకీ డిగ్నిటీని కాపాడాలి. ప్రజల గౌరవం, నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి" అని లాయర్ ఉదయ్ నాత్ సాహు అన్నారు.