Home /News /trending /

VIRAL VIDEO CROCODILE SURROUNDED BY 3 HUNGRY LIONS FIGHTS FURIOUSLY FOR HIS LIFE PAH

Shocking: మూడు సింహాలు వర్సెస్ మొసలి.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..

మొసలిపై దాడిచేస్తున్న సింహాలు

మొసలిపై దాడిచేస్తున్న సింహాలు

Viral  video: సింహాలు మాంచి ఆకలితో ఉన్నాయి. అప్పుడు వాటి కంటికి ఒక మొసలి కన్పించింది. వెంటనే దాని దగ్గరకు వెళ్లాయి.

సాధారణంగా సింహాలు (Lions) చూడటానికి ఎంతో భయంకరంగా ఉంటాయి. వాటి పెద్దనైన జూలు, గాండ్రింపు కొన్ని కిలో మీటర్ల వరకు విన్పిస్తుంటుంది. పొరపాటున ఏదైన జీవి సింహం కంట పడిదంటే దాని పని అయిపోయినట్లే. అవి రౌండప్ చేశాయంటే.. ఎంతటి బలమైన జంతువులున్నా.. వాటి నోటికి ఆహారం కావాల్సిందే. సాధారణంగా సింహాలు గుంపులుగా వేటడతాయి. అడవి దున్నలు, జీబ్రాలు, జింకలు, ఏనుగులు, కొన్ని సార్లు మొసళ్లను కూడా సింహాలు వేటాడుతుంటాయి.

సింహాలు వాటి బలమైన పంజాతో వేటను అదిమిపట్టుకుని, చీల్చి వేస్తాయి. సింహాల వేటకు సంబంధించిన ఎన్నో వీడియోలు ఇప్పటికే నెట్టింట వైరల్ అయ్యాయి. తాజాగా, మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా (viral video) మారింది.










View this post on Instagram






A post shared by Lions Daily (@lionsdaily_)






పూర్తి వివరాలు.. కొన్ని సింహాలు ఆకలితో వేట కోసం అన్వేషిస్తున్నాయి. ఈ క్రమంలో వాటికి ఒక మొసలి కన్పించింది. అది నీటి నుంచి బయటకు వచ్చింది. సాధారణంగా మొసళ్లకు (Crocodile)  నీటిలో ఉంటే పది ఏనుగుల బలముంటుందంటారు. అందుకే మొసలి నీటిలో ఉన్నప్పుడు బలమైన ఏనుగులను సైతం నీటిలోనికి లాక్కెళతాయి. పాపం.. మొసలి నీటి నుంచి బైటకు వచ్చింది. అప్పుడు అది సింహాల కంట పడింది. వెంటనే మూడు సింహాలు (lion attacks on crocodile) వాటిపైన తమ బలమైన పంజాలతో దాడిచేశాయి. మొసలి కూడా ఏమాత్రం తగ్గకుండా సింహాలను ప్రతి ఘటించింది. సింహాలను పదునైన తన పళ్లతో కొరుకుతూ.. మొసలి దాడి చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా (video viral) మారింది.

ఇదిలా ఉండగా  యూఎస్ లో స్టోర్ లోకి కారు చొచ్చుకొని వచ్చి బీభత్సం జరిగింది.

అమెరికాలోని (United states) ఒక షాపింగ్ స్టోర్ లోకి కారు వేగంగా దూసుకెళ్లింది. యూఎస్ లోని టెంపెలో ఈ ప్రమాదం జరిగింది. గత గురువారం ఈ ప్రమాదం (Crashes) జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా  (Social media) మారింది. కాగా, అధికారుల ప్రకారం.. ఒక వ్యక్తి టెంపెలో ఉన్న స్టోర్ లో షాపింగ్  (Shopping) చేయడానికి వచ్చాడు. అప్పుడు కారును స్టోర్ ముందు పార్కింగ్ చేయడానికి వెళ్లాడు. ఇంతలో డ్రైవర్..  బ్రేక్ కు బదులుగా, ఎక్స్ లేటర్ నొక్కాడు.

అంతే.. కారు వేగంగా స్టోర్ లోకి దూసుకెళ్లింది. అప్పుడు షాపులు ఉన్న ఇద్దరు సెల్స్ బాయ్స్ ను (Two Employees) తొక్కుకుంటూ ముందుకు వెళ్లిపోయింది. దీంతో అక్కడి వారు భయంతో దూరంగా పరుగులు పెట్టారు. ఆ తర్వాత.. తేరుకుని కారులో ఉన్న వ్యక్తిని బయటకు తీశారు. స్టోర్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా (viral video) మారింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Crocodile, Lions, Viral Video

తదుపరి వార్తలు