కొన్నిసార్లు వాహానాలు రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు షాకింగ్ ఘటనలు జరుగుతుంటాయి. అవి బ్యాలెన్స్ తప్పి.. ప్రమాదాలకు గురౌతుంటాయి. మరికొన్నిసార్లు.. వెహికిల్ నడిపేవారు.. అజాగ్రత్తగా నడిపించడం వలన, లేదా మద్యం తాగి వాహనాలు నడిపించడం వలన కూడా ప్రమాదాలు జరుగుతాయి. కొన్నిసార్లు.. నిద్రమత్తులో ఉండగా కూడా అనుకొని ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇలాంటి సందర్భాలలో కొన్నిసార్లు.. ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. అప్పుడప్పుడు మనం నదిలో పడిపోయిన బస్సులు, అదుపు తప్పి వ్యవసాయ బావిలో పడిపోయిన కారు వంటి ఘటనల గురించి తరచుగా వార్తలలో చూస్తునే ఉంటాం. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు.. ఒడిశాలో (Odisha) షాకింగ్ ఘటన జరిగింది. తాల్చేర్ పట్టణంలో ఒక ట్రక్ బ్రిడ్జ్ మీద నుంచి కిందకు పడిపోయింది. దీంతోస్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పుడు మరో రెండు క్రేన్ లను అక్కడికి తీసుకొచ్చారు. బ్రిడ్జ్ మీద క్రేన్ లను ఉంచి.. అడుగును పడిపోయిన ట్రక్ కు తాడుతో బిగించిపైకెత్తడానికి ప్రయత్నాలు చేశారు. అప్పుడు షాకింగ్ ఘటన జరిగింది. క్రేన్ లు.. ట్రక్ ను ఒక్కసారిగా పైకి లాగడానికి ప్రయత్నించాయి.
అప్పుడు ఒక్కసారిగా రేయిలింగ్ తెగిపోయింది. దీంతో బరువంతా.. ఒకే క్రేన్ మీద పడింది. అప్పుడు.. క్రేన్ ఒక్కసారిగా అదే ట్రక్ మీద బోల్తా పడింది. దీంతో అక్కడ ఉన్న వారు భయంతో పరుగులు తీశారు. అక్కడున్న వారు... రికార్డు చేసిన వీడియోలో ఈ ఘటన రికార్డు అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. వామ్మో.. ఇదేందిరా నాయన అంటూ కామెంట్ లు పెడుతున్నారు.
ఇదిలా ఉండగా రాజస్థాన్ లో తండ్రి కన్న కూతురి పట్ల కసాయిగా మారాడు.
పూర్తి వివరాలు.. రాజస్థాన్ లో (Rajasthan) దారుణ ఘటన జరిగింది. భరత్ పూర్ లో జరిగిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్థానికంగా ఉండే.. నగ్మా అనే యువతి.. అదే ప్రాంతానికి చెందిన నరేంద్ర అనే యువకుడిని ప్రేమించింది. ఇద్దరు కొన్నిరోజులుగా ప్రేమించుకుంటున్నారు. వీరి విషయం కాస్త ఇంట్లో తెలిసింది. వెర్వేరు కులాలు కావడంతో వీరి పెళ్లికి ఇరుకుటుంబాలు అంగీకరించలేదు. అయితే.. నగ్మా ఇంట్లో నుంచి పారిపోయి నరేంద్రను ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకుంది. అప్పుడు నగ్మా తండ్రి.. ఇస్లాంఖాన్.. తన కూతురుని మోసం చేసి పెళ్లిచేసుకున్నారని.. నరేంద్రపై కేసు పెట్టాడు.దీంతో మధ్యప్రదేశ్ కు వెళ్లి కొన్నినెలల పాటు ఉన్నారు. అక్కడ ఆమె గర్భవతి అయ్యిది.
ఆ తర్వాత.. తిరిగి భరత్ పూర్ కు వచ్చి కాపురం పెట్టారు. అప్పటి నుంచి నగ్మా తండ్రి అదను కోసం చూస్తున్నాడు. ఈ క్రమంలో.. రోటిన్ చెకప్ లో భాగంగా నరేంద్ర, నగ్మా ఆస్పత్రికి వెళ్తున్నారు. అప్పుడు నగ్మా తండ్రి ఆటోలో.. రోడ్డుపై వీరిద్దరు నడుచుకుంటూ వెళ్లడాన్ని చూశాడు. వెంటనే వేగంగా వచ్చి ఇద్దరికి గుద్దడానికి యత్నించాడు. ఆటోను గమనించిన నరేంద్ర, నగ్మా లు అక్కడి నుంచి పారిపోయారు రోడ్డు మీద జనాలు గుమిగూడటంతో ఇస్లాంఖాన్ కూడా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటన అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న అధికారులు విచారణ చేపట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Odisha, Viral Video