HOME »NEWS »TRENDING »viral video cow came into hospital waiting room and attacks patients video goes viral in social media nk

Viral Video: ఆస్పత్రిలోకి వచ్చిన ఆవు.. రోగులపై పడి కుమ్మేసింది.. వీడియో చూడండి

Viral Video: ఆస్పత్రిలోకి వచ్చిన ఆవు.. రోగులపై పడి కుమ్మేసింది.. వీడియో చూడండి
ఆస్పత్రిలోకి వచ్చిన ఆవు.. రోగులపై పడి కుమ్మేసింది.. వీడియో చూడండి (image credit - youtube)

Viral Video: నిజంగా ఆ వీడియో చూస్తే... అయ్యో అనిపించక మానదు. ఆ క్షణంలో అక్కడ మనమే ఉంటే... కచ్చితంగా ఆ ఆవును ఎలాగొలా బయటకు పంపేందుకు ప్రయత్నించే వాళ్లం అని అనుకుంటాం.

  • Share this:
    Viral Video: ఈ మధ్య ఆవుల దాడులు ఎక్కువవుతున్నాయి. సాధు జీవుల్లా ఉండే ఆవులు... ఎందుకోగానీ... ఉన్నట్టుండి అరి వీర భయంకరంగా మారి... దాడి చేస్తున్నాయి. ఈ షాకింగ్ ఘటన జరిగింది దక్షిణ అమెరికా దేశం కొలంబియాలో. అక్కడి ఓ ఆస్పత్రిలోని వెయిటింగ్ రూంలోకి ఆవు వచ్చింది. ఆ రూంలో పేషెంట్లు, వారి కుటుంబ సభ్యులూ ఉన్నారు. సైలెంట్‌గా వచ్చిన ఆవు వయలెంట్‌గా మారింది. అక్కసారిగా రంకెలేస్తూ... వెయిటింగ్ రూంలో కూర్చున్న వారిపై దాడి చేసింది. కుమ్మేసింది. దాంతో... అక్కడున్న వారు తలో దిక్కుకూ పారిపోయారు. ఆస్పత్రి సిబ్బంది కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వచ్చింది.

    ఓ నలుగురు పేషెంట్లపై దాడికి దిగగా... ముగ్గురు ఎలాగొలా తప్పించుకున్నారు. మరో మహిళను మాత్రం ఆవు వీరలెవెల్లో దాడి చేసింది. గోడకు ఆనించి కుమ్మేసింది. ఆ ఆవుకి ఓ తాడు ఉంది. ఆ తాడు పట్టుకొని ఆస్పత్రి సిబ్బంది... దాన్ని బయటకు లాగేందుకు ఎంతగా ప్రయత్నించినా... కదలదే. అక్కడే తిరుగుతూ... దాడి చేసిన మహిళా పేషెంట్ పడి ఉంటే... మరోసారి దాడి చేసేందుకు సిద్ధపడింది. అది చూసిన ఆస్పత్రి సిబ్బంది ప్రాణాలకు తెగించి ఆవు వెనక్కి వెళ్లారు. వాళ్లను చూసిన ఆవు... దాడికి చేసేందుకు పేషెంట్‌ని వదిలి వాళ్లవైపు తిరిగింది. ఇంతలో పేషెంట్ ఎలాగొలా లేచి... పక్క గదిలోకి వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నారు. ఇక ఆ గదిలో ఎవరూ లేకపోవడంతో... ఆవు... మెల్లగా బయటకు వచ్చింది. ఇదంతా రెండు వీడియోల్లో రికార్డ్ అయ్యింది. అది మీరే చూడండి.



    ఇది కూడా చదవండి: CCTV: రెచ్చిపోయిన ఆవులు... కుక్క, దాని యజమానిపై దాడి... వీడియో చూడండి

    చూశారా ఎంత దారుణంగా దాడి చేసిందో. ఊహించని ఘటన. తప్పించుకునే టైమ్ లేదు. అసలే పేషెంట్లు. ఇలాగైతే ఎలా. ఆస్పత్రి పేరు సాన్ రాఫెల్. ఈ విషయం తెలిసిన ఆవు యజమాని తర్వాత ఆస్పత్రికి వచ్చారు. పేషెంట్లు, సిబ్బందికి క్షమాపణలు చెప్పారు. ఆ ఆవు ఇదివరకు ఎప్పుడూ అలా చెయ్యలేదనీ... ఇప్పుడు ఎందుకు అలా చేసిందో తానే నమ్మలేకపోతున్నానని అన్నారు.
    Published by:Krishna Kumar N
    First published:February 17, 2021, 12:10 IST