VIRAL VIDEO COUPLE DANCES TO DHANUSH AND SAI PALLAVI S ROWDY BABY INTERNET SAYS YOU GUYS ROCK PAH
అరె వా.. మైడ్ బ్లోయింగ్.. రౌడీ బేబీ పాటకు మాస్ స్టెప్పులతో అదరగొట్టిన జంట.. వైరల్ గా మారిన వీడియో..
డ్యాన్స్ తో రచ్చచేస్తున్న జంట
Viral video: కొరియో గ్రఫర్ జంట మారి 2 పాటకు ఇరగ దీసే స్టెప్పులు వేశారు. ఇద్దరు కలిసి పాట రిథమ్ కు తగ్గట్టుగా డ్యాన్స్ చేస్తుంటే నెటిజన్లు షాకింగ్ కు గురౌతున్నారు.
అందరిలో ఏదో ఒక ట్యాలెంట్ ఉంటుంది. కొందరు డ్యాన్స్ చేయడానికి ఇష్టపడితే.. మరికొందరు పాటలు పాడటానికి ఇష్టపడుతుంటారు. వారి ఇష్టాలను బట్టి స్పెషల్ టెస్ట్ లు ఉంటాయి. అయితే, ఈ మధ్య కాలంలో డ్యాన్స్ ల వీడియో లు సోషల్ మీడియాలో (Social media) తెగ వైరల్ అవుతున్నాయి. ప్రతిరోజు వేలల్లో డ్యాన్స్ వీడియోలు (viral video) నెట్టింట్లో దర్శనమిస్తున్నాయి. వీటిలో పెళ్లి వేడుకలో, బరాత్ లో, అనేక ప్రత్యేక కార్యక్రమాల్లో డ్యాన్స్ లు చేసిన అనేక వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు మరో డ్యాన్స్ కు చెందిన వీడియో ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్ గా మారింది.
పూర్తి వివరాలు.. 2018 లో మారి 2 సినిమా విడుదలైంది. అందులో ధనుష్, సాయిపల్లవి రౌడీ బేబీ పాటకు చేసిన డ్యాన్స్ ఒక రేంజ్ లో వైరల్ అయ్యింది. అప్పట్లో ఇది ఒక సెన్సెషన్ గా మారింది. ఇప్పటికి దీని ఫివర్ ఇంకా తగ్గలేదు. అనేక చోట్ల ఈ పాటకు డ్యాన్స్ లు చేస్తున్నారు. అయితే, అనేక మంది ఇది వరకే ఈ పాటకు దుమ్మురేపే స్టెప్పులతో అదరగొట్టారు.
ఇప్పుడు.. తాజాగా మరోసారి కొరియో గ్రఫర్ జంట తమ డ్యాన్స్ లతో వార్తలలో నిలిచారు. కోల్ కతాకు చెందిన సౌరభ్, అనూష ఇద్దరు కొరియో గ్రాఫర్ లు. వీరు మారీ 2 సినిమాలోని రౌడీ బేబీ పాటకు అదర గొట్టే స్టెప్పులు వేశారు. ఇది నెట్ లో ట్రెండింగ్ నిలిచింది. దీన్ని చూసిన నెటిజన్ లు.. వీరి ఫర్ఫామెన్స్ కు ఫిదా అవుతున్నారు.
ఇదిలా ఉండగా తన కొడుకు గణితంలో సాధించిన స్కోర్ చూసి ఒక తండ్రి కన్నీళ్లు పెట్టుకున్నాడు.
చైనీస్ ప్రజలు చదువుకు అత్యంత ప్రయారిటీ ఇస్తారు. తమ వాళ్లు చదువులో ముందుండాలని అనుకుంటారు. అయితే, ఇక్కడోక వ్యక్తి కూడా తన కొడుకు చదువులో అందరికన్నా ముందుండాలని అనుకున్నాడు. అయితే,తన కొడుకు గణితంలో చాలా వీక్. దీని కోసం అతను సంవత్సరం పాటు ప్రత్యేకంగా ట్యూషన్ ఇప్పించాడు. అయితే, ఇంత చేశాడు. తీరా రిజల్ట్ వచ్చాక.. తన కొడుకు సాధించిన స్కోర్ చూసి ఆ తండ్రి గుక్కపెట్టి ఏడ్చాడు.
అతని కొడుకుకి.. గణితంలో నూటికి కేవలం 6 మార్కులే వచ్చాయి. అది చూసిన తండ్రి షాక్ తో ఏడ్వడం మొదలెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. వింతగా స్పందిస్తున్నారు. బహుషా.. అతనికి గణితం అంటే ఇష్టం లేదేమో...,మరీ ఇంత చాదస్తం ఏంటీ.. మరల రాసి పాస్ అవ్వోచ్చు కదా.., ఆ మాత్రం దానికి ఏడవాలా.. అంటూ కామెంట్ లను పెడుతున్నారు
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.