చిన్నతనంలో మనం బాగా చదవాలని,చదువులో అందరి కంటే ముందుండాని మన ఇంట్లోవారు భావిస్తుంటారు. ఒక వేళ ఏదైన సబ్జెక్ట్ లో వెనుక బడి ఉంటే ప్రత్యేక క్లాస్ లు చెప్పిస్తారు. మరికొంత మంది తమ పిల్లలను ట్యూషన్ లకు కూడా పంపిస్తుంటారు. ఏంచేసిన తమ కొడుకు బంగారు భవిష్యుత్తు కోసమే తల్లిదండ్రులు పాటు పడుతుంటారు. అయితే, ఇన్ని చేసిన కొందరు పిల్లలు మాత్రం అసలు పట్టించుకోరు. స్పెషల్ క్లాస్ లు చెప్పించిన.. ఏం చేసిన ఇంట్రెస్ట్ తో చదవరు. తల్లిదండ్రులు వారి మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేసుకుంటారు. ఇలాంటి కోవకు చెందిన ఘటవ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పూర్తి వివరాలు.. చైనీస్ ప్రజలు చదువుకు అత్యంత ప్రయారిటీ ఇస్తారు. తమ వాళ్లు చదువులో ముందుండాలని అనుకుంటారు. అయితే, ఇక్కడోక వ్యక్తి కూడా తన కొడుకు చదువులో అందరికన్నా ముందుండాలని అనుకున్నాడు. అయితే,తన కొడుకు గణితంలో చాలా వీక్. దీని కోసం అతను సంవత్సరం పాటు ప్రత్యేకంగా ట్యూషన్ ఇప్పించాడు. అయితే, ఇంత చేశాడు. తీరా రిజల్ట్ వచ్చాక.. తన కొడుకు సాధించిన స్కోర్ చూసి ఆ తండ్రి గుక్కపెట్టి ఏడ్చాడు.
View this post on Instagram
అతని కొడుకుకి.. గణితంలో నూటికి కేవలం 6 మార్కులే వచ్చాయి. అది చూసిన తండ్రి షాక్ తో ఏడ్వడం మొదలెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. వింతగా స్పందిస్తున్నారు. బహుషా.. అతనికి గణితం అంటే ఇష్టం లేదేమో...,మరీ ఇంత చాదస్తం ఏంటీ.. మరల రాసి పాస్ అవ్వోచ్చు కదా.., ఆ మాత్రం దానికి ఏడవాలా.. అంటూ కామెంట్ లను పెడుతున్నారు.
ఇదిలా ఉండగా అమర్ నాథ్ యాత్రలో అనుకొని ఘటన జరిగింది.
కరోనా మహమ్మారి (covid) కారణంగా గత రెండు సంవత్సరాలుగా అమర్ నాథ్ (amarnath yatra) యాత్రను ప్రభుత్వం నిలిపివేసింది. ఇప్పుడిప్పుడే... వైరస్ కేసులు తగ్గుముఖం పట్టడంతో మరోసారి యాత్రను ప్రారంభించారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున భక్తులు అమర్ నాథ్ మంచు శివలేంగేశ్వరుడిని దర్శించుకొవడానికి పొటేత్తారు. ఈ నేపథ్యంలో సోమవారం అనుకొని ఘటన జరిగింది. మహారాష్ట్రలోని అకోలాకు సత్యనారయణ తోష్నేయ అనే యాత్రికుడు.. జమ్మూ & కాశ్మీర్‌లోని (Jammu kashmir) బ్రరీమార్గ్ హెలిప్యాడ్ నుండి 50 ఏళ్ల అమర్‌నాథ్ యాత్రికుడు బ్యాలెన్స్ కోల్పోవడంతో 100 అడుగుల ఎత్తునుంచి పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు.
వెంటనే అధికారులు అక్కడికి చేరుకున్నారు. స్థానిక వైద్య సిబ్బంది ప్రథమ చికిత్స చేశారు. అతడిని ప్రత్యేక విమానంలో శ్రీనగర్ తరలించారు. అతను పోనీపై కూతురు, భార్యతో కలిసి దర్శనం తర్వాత పవిత్ర గుహ నుండి తిరిగి వస్తున్నాడు. బ్రరీమార్గ్ సమీపంలో, పోనీ అసమతుల్యత చెందింది. దీంతో వ్యక్తి నదికి దాదాపు 100 అడుగుల దూరంలో పడిపోయాడని ఆర్మీ అధికారులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: China, Maths, Viral Video