హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

బైక్ మీద యువకుడి స్టంట్ లు.. ట్రాఫిక్ పోలీసులు చేసిన పనికి నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్..

బైక్ మీద యువకుడి స్టంట్ లు.. ట్రాఫిక్ పోలీసులు చేసిన పనికి నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్..

బైక్ పై యువకుడి స్టంట్ లు

బైక్ పై యువకుడి స్టంట్ లు

chhattisgarh: యువకుడు బైక్ మీద డెంజరేస్ స్టంట్ వేసుకుంటూ వెళ్తున్నాడు. అతను ఒక చేతితో బైక్ నడిపిస్తూ కుడివైపుగా తిరిగి కూర్చున్నాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Chhattisgarh, India

కొంత మంది యువత రోడ్ల మీద అడ్డమైన స్టంట్ లు వేస్తు బైక్ ను నడిపిస్తుంటారు. ఒక చేత్తో వెహికిల్ నడిపించడం, స్టీరింగ్ వదిలేయండం వంటివి చేస్తుంటారు. మరికొన్ని చోట్ల ట్రిబుల్ రైడింగ్, రాంగ్ రూట్ లో వెళ్లడం, ఎక్కువ మందిని ఎక్కించుకోవడం చేస్తుంటారు. మరికొందరు తాగి వెహికిల్స్ నడిపిస్తుంటారు. ట్రాఫిక్ నియమాలను పాటించమంటే అసలు పట్టించుకోరు. కనీసం హెల్మెట్ కూడాపెట్టుకొరు. కొందరు బైక్ మీద చేసే వెకిలి చేష్టల వలన కొన్నిసార్లు ఇతరుల ప్రమాదాల బారిన పడుతుంటారు. మరికొన్ని సార్లు..వారే ప్రమాదాలను కొని తెచ్చుకుంటారు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తివివరాలు.. ఛత్తీస్ గఢ్ కు (chhattisgarh)  చెందిన యువకుడు బైక్ మీద వేసిన స్టండ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యువకుడు బైక్ మీదకూర్చుని ఒక చేత్తో వెహికిల్ ను కంట్రోల్ చేస్తు మరోచేతితో వెహికిల్ ను నడిపిస్తున్నాడు. అతను కనీసం హెల్మెట్ కూడా పెట్టుకోలేదు.  స్పీడ్ గా డెంజరేస్ గా వెళ్తున్నాడు. అతని చుట్టుపక్కల మరికొన్ని వెహికిల్స్ కూడా రోడ్డుపైన వెళ్తున్నాయి. వారుఇతడిని వింతగా చూస్తున్నారు.

ఇంతలో ట్రాఫిక్ పోలీసులు ఇతగాడిని పట్టుకున్నారు. వెంటనే స్టేషన్ కు తీసుకెళ్తారు. అక్కడ రాంగ్ రూట్, స్టంట్ లు వేసినందుకు ఫైన్ వేశారు. గుంజీలు కూడా తీయించారు. ఆ తర్వాత.. పోలీసులు అధికారిక ట్విటర్ ఖాతాలతో పోస్ట్ చేశారు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో (Social media)  వైరల్ గా (Viral video)  మారింది.

ఇదిలా ఉండగా   ఉత్తర ప్రదేశ్ లోని (Uttar pradesh) ఆగ్రాలో అనుకొని సంఘటన సంభవించింది. ఆగ్రాలోని ప్రైమరీ హెల్త్ సెంటర్ లో ఒక ఆడ శిశువు జన్మించింది. అయితే.. శిశువు శ్వాస తీసుకొలేకపోయింది. ఈ క్రమంలో అక్కడే ఉన్న మహిళా డాక్టర్ సులేఖా చౌదరీ వెంటనే శిశుకు 7 నిముషాల పాటు సీపీఆర్ ద్వారా శ్వాసను అందచేసింది. డాక్టర్ తన నోటితో శిశువుకు శ్వాసను అందజేసింది. దీంతో కాసేపటికి శిశువు ఊపిరి పీల్చుకుంది. వెంటనే శిశువు ఏడుపును ప్రారంభించింది.

దీంతో అక్కడున్న వారంతా సంతోషంతో డాక్టర్ ను అభినందించారు. తమకు దక్కదనుకున్న శిశువు తిరిగి దక్కడంటే శిశువు తల్లిదండ్రులు ఆనందంతో లేడీ డాక్టర్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తన ప్రయత్నం తాను చేశానని లేడీ డాక్టర్ సులేఖ చౌదరీ తెలిపారు. ఈ ఘటన మార్చి 2022 లో జరిగింది. కాగా, దీన్ని తాజాగా, సచిన్ కౌశిక్ అనే పోలీసు అధికారి ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో మరోమారు వైరల్ గా (Viral video)  మారింది

Published by:Paresh Inamdar
First published:

Tags: Chhattisgarh, Traffic challan, VIRAL NEWS, Viral Video

ఉత్తమ కథలు