సాధారణంగా కొందరు కష్టపడకుండా సులువుగా డబ్బులు సంపాదించే మార్గాలను అన్వేషిస్తున్నారు. దీనికోసం చోరీలకు పాల్పడుతున్నారు. కొందరు చోరీల కోసం రకారకాల ప్లాన్ లు వేస్తుంటారు. ప్రధానంగా బంగారు దుకాణాలు, రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లేవారిని దొంగతనం చేసే (Steals gold) వారు తమ టార్గెట్ గా పెట్టుకుంటారు. ఈ క్రమంలో షాపులకు కాస్లీ బట్టలు ధరించి వెళ్లారు. ఎదో కొన్నట్లు బిల్డప్ ఇస్తారు. కాస్త.. సమయం దొరగ్గానే వెంటనే అక్కడి వస్తువులను నొక్కెస్తారు. ఇలాంటి ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు.. ఒక బంగారు షాపులో (gold shop) మహిళలు బంగారం కొనడానికి వచ్చారు. చెవిపోగులు, కమ్మలు,చూపించమన్నారు.దీంతో కస్టమర్ల కోసం దుకాణం వారు.. మంచి డిజైలను చూపిస్తున్నారు. ఈ క్రమంలో వారు డిజైన్ లను చూస్తున్నట్లుగా బిల్డప్ ఇచ్చారు. దుకాణ దారు వేరే డిజైలను చూపించడాకి కాస్త అటూ వైపుగా చూశాడు. అప్పుడు మహిళ తన ట్యాలెంట్ (Theft) చూపించింది.
వెంటనే కమ్మలను తీసుకొని తన నోటిలో వేసుకుంది. ఆ తర్వాత.. ఏమి తెలియనట్టు ముఖం పెట్టి కూర్చుంది. కానీ ఆమె చేసిన ఏదవ పని అక్కడే ఉన్న సీసీకెమెరాలో రికార్డు అయ్యింది. మహిళలు వెళ్లి పోయాక.. బంగారు కమ్మలు తక్కువ ఉండటాన్ని సిబ్బంది గుర్తించారు. వెంటనే సీసీ కెమెరాను పరిశీలించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఇక్కడ మరోక ఆంటీకూడా షాపులో కూల్ గా చీరీకి పాల్పడుతుంది.
ఒక షాపులో (Shop counter) కొందరు కౌంటర్ దగ్గర బిల్ కడుతున్నారు. ఒక మహిళ మెడలో బ్యాగ్ వేసుకుని కౌంటర్ దగ్గర నిలబడి, షాపు యజమని తో మాట్లాడుతుంది. ఇంతలో మరోక మహిళ బయట నుంచి గాబరాగా వచ్చింది. షాపులోకి వస్తూనే కౌంటర్ దగ్గర ఉన్న మహిళను ఢీకొట్టింది. ఆమెకు తెలియకుండానే బ్యాగు జీప్ తెరచింది. పాపం.. ఇది తెలియని మహిళ ఏదో.. తోపులాటలో మహిళ దూసుకొచ్చిందని అనుకుంది.
ఆ తర్వాత.. షాపు యజమానితో ఏదో అడుగుతున్నట్లు మాట్లాడుతూ.. మరో చేతితో మహిళ బ్యాగులోనుంచి (Woman steals money) డబ్బును మెల్లగా తీసి, మహిళ తన బ్యాగులో వేసుకుంది. ఆ తర్వాత.. మెల్లగా అక్కడి నుంచి చెక్కెసింది. అయితే, మహిళ నిర్వాకం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో (cc camera) రికార్డు అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ఆంటీ క్యా బాత్ హై.. నీది మాములు తెలివి కాదుగా అంటూగా కామెంట్ లు పెడుతున్నారు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.