Video: బొంగురు పిల్లి... బాక్సులో దూరింది... వీడియోకి కోటికి పైగా వ్యూస్!

బొంగురు పిల్లి... బాక్సులో దూరింది (image credit - instagram)

Viral Video: ఆ వీడియోలో ఏముంది? ఎందుకు అది అంతలా వైరల్ అయ్యింది? స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ ఆ పిల్లి వీడియోని ఎందుకు ప్రమోట్ చేసింది? తెలుసుకుందాం.

  • Share this:
    Viral Video: మనుషులు ఇష్టంగా పెంచుకునే జంతువుల్లో మొదటి స్థానం కుక్కలది అయితే... రెండోస్థానం పిల్లులది. అమెరికా, యూరప్ దేశాల కంటే... ఆసియా దేశాల్లో ప్రజలు పిల్లుల్ని ఎక్కువగా పెంచుకుంటారు. ముఖ్యంగా జపాన్‌లోనైతే పిల్లుల్ని దైవ సమానంగా చూస్తారు. అక్కడ పిల్లుల కోసం ఓ దీవి (cat island in japan) ఉంది. అంతేకాదు.. ఓ మెట్రో రైల్లో పిల్లి బొమ్మలతో ప్రత్యేక కోచ్ (cat coach) తయారుచేశారు. ఆమధ్య వరకూ ఓ పిల్లి జపాన్‌లోని ఓ రైల్వే స్టేషన్‌ని స్టేషన్ మాస్టర్ (station master cat) గా వ్యవహరించింది. ఇలా పిల్లులకు చాలా ప్రాధాన్యం ఇస్తున్నారు.

    ఇంటర్నెట్‌లో కుక్కల వీడియోల కంటే పిల్లుల వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. చిన్నగా, బుజ్జిగా ఉండే క్యాట్స్... అందరికీ నచ్చుతున్నాయి. వాటిని పెంచుకుంటున్న వారు... వాటి ఆటలు, వాటి చిలిపి చేష్టల్ని వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సైట్లలో పోస్ట్ చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పిల్లలకు స్వయంగా అకౌంట్లు ఉన్నాయి. వాటికి ఫాలోయర్లు కూడా లక్షల్లో ఉంటున్నారు.

    తాజాగా ఓ బొంగురు పిల్లి... మెల్లగా నడుస్తూ కార్డ్‌బోర్డ్ బాక్సులో దూరింది. అక్కడ ఎలుకను పట్టుకుంటున్నట్లు కాసేపు డ్రామా ఆడింది. ఆ తర్వాత ఆ బాక్సుకి కన్నం లేకపోవడంతో... అక్కడే ఓ రౌండ్ వేసి... పల్టీ కొట్టింది. అదీ వీడియో. దాన్ని రెండ్రోజుల్లో ఏకంగా కోటి 13 లక్షల మందికి పైగా చూశారు.

    ఆ వీడియోని ఇక్కడ చూడండి.








    View this post on Instagram






    A post shared by Instagram (@instagram)





    ప్రతి వారం ఇన్‌స్టాగ్రామ్ కొన్ని వీడియోలను తన పేజీలో ప్రమోట్ చేస్తుంది. గత వారం ఈ వీడియోని పోస్ట్ చేసింది. ఇది ఎక్కువ మందికి నచ్చుతోంది. ఎందుకంటే ఇందులో పిల్లి చూడటానికి చాలా బాగుంది. అది అలా దొర్లుతుంటే... మనసుకు హాయిగా అనిపిస్తోంది. దాని అమాయకత్వం నెటిజన్లను నవ్విస్తోంది.

    ఈ పిల్లి పేరు మో. వయసు రెండేళ్లు. దీనికి ప్రత్యేకంగా వెన్ బెల్లా మెట్ మో (@when_bella_met_mo) అనే అకౌంట్ ఉంది. అందులో దీని అల్లరి చేష్టల వీడియోలు చాలా ఉన్నాయి.

    మరో సరదా వీడియో ఇక్కడ చూడండి.



    ఇది కూడా చదవండి: Heart Attack: సైలెంట్ హార్ట్ ఎటాక్ ఎలా వస్తుంది?.. ఈ లక్షణాల్ని ముందే గుర్తించండి!

    ఈ వైరల్ వీడియోకి నెటిజన్లు స్మైలీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం మోకి 12 వేల దాకా ఫాలోయర్స్ ఉన్నారు. తాజా వీడియో సూపర్ వైరల్ అవ్వడంతో... ఫాలోయర్స్ సంఖ్య కూడా పెరుగుతోంది.
    Published by:Krishna Kumar N
    First published: