ఇది రియల్ టామ్ అండ్ జెర్రీ... ఎలుకను చూసి పిల్లి పారిపోతోందిగా...

Tom and Jerry : టామ్ అండ్ జెర్రీ యానిమేషన్ కార్టూన్‌లో జరిగినట్లు రియల్‌గా జరిగితే అది వింతే. అలాంటి వీడియో ఒకటి నెట్‌లో హల్ చల్ చేస్తోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: June 21, 2019, 6:33 AM IST
ఇది రియల్ టామ్ అండ్ జెర్రీ... ఎలుకను చూసి పిల్లి పారిపోతోందిగా...
ఎలుకను చూసి పారిపోతున్న పిల్లి (Image : Twitter / Harpreet)
  • Share this:
సాధారణంగా ఎలుకని చూడగానే... పిల్లి అమాంతం ఎగబడి... తన గోళ్లతో ఎలుకని పట్టి... చటుక్కున నోటితో కొరికి... అది చనిపోతుంటే... చూస్తూ ఆహారం దొరికిందని ఆనందపడుతూ... ఆ రోజంతా పండగ చేసుకుంటుంది. వాటి మధ్య ఉన్న జాతి వైరం అలాంటింది. అవి రెండు కలిసి ఉండే సందర్భాలు చాలా తక్కువ. ఈ పోరాటంలో ఎప్పుడూ గెలిచేది పిల్లే. అలాంటిది ఈ పిల్లి విషయంలో సీన్ రివర్సైంది. రోడ్డు పక్కన వెళ్తున్న ఎలుకను చూసి... వావ్... ఈ రోజు నాకు చికెన్ బిర్యానీ దొరికింది అనుకుంటూ... పిల్లి... ఆ ఎలుకను పట్టుకోబోయింది. అసలే ఆహారం దొరక్క ఆవేశంలో ఉన్న ఆ ఎలుక రివర్సైంది. పిల్లిని భయపెడుతూ... తరిమికొట్టింది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.

Published by: Krishna Kumar N
First published: June 21, 2019, 6:33 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading