Home /News /trending /

VIRAL VIDEO CAT COAXES HEN FOR A PIGGY BACK RIDE AND SUCCEEDS PAH

Viral Video: నే పుంజు మీద ఎక్కి వచ్చేత్తప్పా.. పుంజు మీద పిల్లి సవారీ.. వారెవా క్యా వీడియో హై..

కోడి మీద సవారీ చేస్తున్న పిల్లి

కోడి మీద సవారీ చేస్తున్న పిల్లి

Viral video: పిల్లి, కోడి పుంజు వీపు మీద ఎక్కి కూర్చుంది. పుంజు ఏమాత్రం భయపడలేదు. కాసేపు పుంజుకూడా అలానే మోస్తు కొంత దూరం తీసుకెళ్లింది.

సాధారణంగా కొన్ని జీవుల మధ్య జాతీ వైరాలుంటాయి. పొరపాటున కూడా ఒకదానికి మరోకటి ఎదురుపడవు. ఒక వేళ పడితే, అందులో ఏదో జీవికి మూడినట్లే.  అయితే, చిన్న ప్పటి నుంచి ఒక చోట పెరగటం వలన అవి తమ మధ్య ఉన్న వైశామ్యాలు మరిచిపోయి ఎంతో స్నేహంగా ఉంటాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ (viral video) అవుతుంటాయి. మెయిన్ గా కుక్కలు, పిల్లులు, గున్నఏనుగుల వీడియోలు ట్రెండింగ్ లో (Trending video) ఉంటాయి. కుక్కలు, పిల్లులతో సరదాగా ఆడుకోవడం, పిల్లుల చేష్టలు, గున్న ఏనుగుల ఫన్నీ సంఘటనలు నెట్టింట వైరల్ గా మారిన విషయం తెలిసిందే. నెటిజన్లు కూడా ఈ వీడియోలను చూడటానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఈ కోవకు చెందిన ఒక ఫన్నీ వీడియో ప్రస్తుతం నెట్టింట (Social media) వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు.. ప్రస్తుతం ఈ వీడియోలో ఒక పుంజు ఉంది. ఒక పిల్లి, పుంజు దగ్గరకు వెళ్లింది. పిల్లి, మెల్లగా కోడి వీపుపైన ఎక్కి కూర్చుంది. అవి రెండు మంచి ఫ్రెండ్స్ లాగా ఉంటున్నాయి. కోడి పుంజు కూడా ఏమాత్రం కదిలించకుండా పిల్లిని భుజంపైన ఎక్కించుకుంది. పిల్లి కూడా హయిగా సవారీ చేస్తున్నట్లు మంచిగా ఎక్కి కూర్చుంది. ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో (Social media) వైరల్ గా మారింది.






ఇదిలా ఉండగా   కొందరు కోర్టులో అధికారులకు చుక్కలు చూపించారు.

న్యూయార్క్ లో (New York) ఈ ఘటన జరిగింది. 34 ఏళ్ల మహిళను స్థానికంగా గొడవలు చేసిందనే కారణంతో పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను అల్బానీ సిటీలోని కోర్టులో హజరుపర్చారు. అక్కడ కోర్టులో విచారణ (Hearing) ప్రారంభమైంది. కాసేపు కోర్టులో.. హాట్ హాట్ గా ఆరోపణలు, ప్రత్యారోపణలు జరిగాయి. దీంతో మహిళ రెచ్చిపోయింది. ఆ తర్వాత.. తనకు తెలిసిన వారితో కోర్టులో డబ్బాల నిండా బొద్దింకలను తీసుకొచ్చింది. అక్కడ విచారణ జరుగుతుండగా మెల్లగా బొద్దింకలను నేలపైన గుమ్మరించారు.





కుప్పలు, కుప్పలుగా బొద్దింకలు (Cockroaches) కోర్టు హల్ లో కన్పించడంతో కోర్టులో(Court)  ఉన్న వారు భయంతో పరుగులు పెట్టారు. దీంతో కోర్టు కార్యకలాపాల్లో తీవ్రమైన అంతరాయం ఏర్పడింది. ఇదంతా మహిళ కావాలని చేసిన పనిగా బయటపడింది. దీంతో కోర్టు ఆమె చేసిన పనిని తీవ్రంగా పరిగణించింది. ఆమె చేసిన పనివల్ల కోర్టులో ప్రొసిడింగ్స్ కు తీవ్రమైన అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రస్తుతం ఆమెను పోలీసులు కస్టడీలోనికి తీసుకొని విచారిస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేసిన తింగరి పని నెట్టింట (Social media) వైరల్ గా (Viral news) మారింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Social Media, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు